సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ కుటుంబసభ్యులను వేణుస్వామి పరామర్శించారు. కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన తనవంతు సాయంగా రేవతి కుటుంబానికి రూ.2 లక్షల సాయం అందించారు. అంతేకాకుండా బాలుడి పేరిట తన సొంత డబ్బులతో మృత్యుంజయ హోమాన్ని చేస్తానని వేణుస్వామి అన్నారు.
వేణు స్వామి మాట్లాడుతూ..' శ్రీ తేజ్‌ను చూసి వచ్చా. తాను త్వరలో కోరుకుంటాడు. నా సొంత డబ్బులతో మృత్యుంజయ హోమాన్ని శ్రీ తేజ్ పేరున చేస్తాను. నా శక్తి మేర రేవతి కుటుంబానికి రూ. 2 లక్షల సాయం అందజేస్తున్నా. కొంచెం ఆలస్యమైనా సరే శ్రీతేజ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాడు. ఇది అనుకోని సంఘటన. వచ్చే ఏడాది మార్చి 28 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదు. అయితే ఆ తరువాత అంతా మంచే జరుగుతుంది.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment