
Astrologer Comments on Anushka Shetty Marriage: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క పెళ్లిపై వచ్చినన్ని రూమర్స్ మరే ఇతర హీరోయిన్స్‌పై వచ్చుండవేమో. గతంలో ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వినిపించాయి. అయితే తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని, అలాంటివి వార్తల్లో నిజం లేదంటూ ఇద్దరూ క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పడింది. అనంతరం ఓ బిజెనెస్ మెన్‌తో అనష్కుకు పెళ్లి ఫిక్సయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అది కూడా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.
చదవండి : Nagarjuna: ఆ విషయం తలుచుకొని నాగార్జున భావోద్వేగం
ఇక `నిశ్శబ్దం` సినిమా అనంతరం జోరు తగ్గించిన అనుష్క నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తుందని అనౌన్స్ చేసినా ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అనుష్క పెళ్లిపై మరోసారి రూమర్స్ జోరందుకున్నాయి.ఈ నేపథ్యంలో అనుష్క వివాహంపై ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ జగన్నాథ్ గురూజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చదవండి : కమెడియన్ అలీ లగ్జరీ ఇంటిని చూశారా?
అనుష్క వృత్తి విషయంలో ఎంతో సిన్సియర్ అని, ఆమె ముఖ కవళికలను బట్టి చూస్తే ఇండస్ట్రీ వ్యక్తిని కాకుండా బయటి వ్యక్తిని అనుష్క పెళ్లాడనుందని పేర్కొన్నారు. అనుష్క చాలా డౌన్ టూ ఎర్త్ అని, ఆమెలో కొంచెం కూడా అహంభావం ఉండదని తెలిపారు. ఇక పెళ్లి గురించి చెబుతూ..2023లోపు అనుష్కకు వివాహం జరుగుతుందని వివరించారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది చూడాల్సి ఉంది.
చదవండి: బాక్సాఫీస్ వద్ద ‘లవ్‌స్టోరి’ప్రభంజనం.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment