Astrologer Venu Swamy Predictions On Nayanthara And Vignesh Shivan Marriage Life - Sakshi
Sakshi News home page

Nayanthara Marriage Astrology: నయన్‌ పెళ్లి జీవితంపై ప్రముఖ జ్యోతిష్యుడు ఏమన్నారంటే..

Published Wed, May 11 2022 10:40 AM | Last Updated on Wed, May 11 2022 11:39 AM

Astrologer Venu Swamy Predictions Nayanthara Marriage Life - Sakshi

Astrologer Predictions Nayanthara Marriage Life: ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ సెలబ్రెటీల గురించిన జోష్యంపై ఆసక్తికర విషయాలను చెబుతు ఉంటారు ఆయన. గతంలో సమంత-నాగచైతన్య పెళ్లి సమయంలో ఆయన షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. సమంతకు వైవాహిక జీవితం కలిసి రాదని, ఆమె పెళ్లి చేసుకున్న అతి త్వరలోనే భర్తతో విడిపోతుందని జోష్యం చెప్పారు. ఇక చై-సామ్‌ విడాకుల ప్రకటన అనంతరం వేణు స్వామి చెప్పినట్లుగానే ఆమె జీవితంలో జరిగిందని అందరు చర్చించుకున్నారు. ఇప్పడు తాజాగా ఆయన లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

చదవండి: ‘ద పీకాక్‌’ మ్యాగజైన్‌పై మహేశ్‌, ఫొటో షేర్‌ చేసిన సూపర్‌ స్టార్‌

అయితే నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ల పెళ్లి గత కొంతకాలంగా చర్చనీయాంశం అవుతుంది. 5ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లాక్‌డౌన్‌లో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకోవడంతో వీరి పెళ్లి అంశం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌ 9న తిరుమల తిరుపతి దేవస్థానంలో నయన్‌-శివన్‌లు పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నయనతార వైవాహిక జీవితంపై అస్ట్రాలజర్‌ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చదవండి: మహేశ్‌-రాజమౌళి మూవీపై అప్‌డేట్‌ ఇచ్చిన రచయిత విజయేంద్ర ప్రసాద్‌

నయన తారకు పెళ్లి అచ్చిరాదని, వివాహ అనంతరం తన వైవాహిక జీవితం సవ్యంగా సాగదని ఆయన అంటున్నారు. తన జాతకంలో గురుడు నీచ స్థితిలో ఉ‍న్నాడని, అందువల్ల వైవాహిక జీవితంలో కలతలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అంతేకాదు విడాకులు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. అలాగే స్టార్‌ హీరోయిన్స్‌ అనుష్క శెట్టి, రష్మిక మందన్నాల గురించి కూడా చెప్పారు. వీరికి సైతం పెళ్లి జీవితం అచ్చి రాదని, వీరి జాతకంలో కూడా గురువు నీచ స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ఇక చివరగా సమంత, పూజ హెగ్డే, రష్మిక మందన్నా, నయనతార సినీ కేరీర్‌ 2024 తర్వాత అంతమైపోతుందని ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement