Top Heroines Plays Special Roles In Telugu Movies | Nayanthara, Pooja Hegde - Sakshi
Sakshi News home page

Special Role In Movie: స్పెషల్‌ హీరోయిన్‌.. సో స్పెషల్‌

Published Thu, Apr 14 2022 8:05 AM | Last Updated on Thu, Apr 14 2022 12:47 PM

Nayanthara, Pooja Hegde And Others Plays Special Roles In Telugu Movies - Sakshi

హీరోయిన్‌ అంటేనే సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ ఇక ‘స్పెషల్‌ హీరోయిన్‌’ అంటే ఇంకా స్పెషల్‌.. అంతే కదా..ఒక స్టార్‌ హీరోయిన్‌ స్పెషల్‌ రోల్‌ చేస్తే సో స్పెషల్‌గా ఉంటుంది కదా. రానున్న సినిమాల్లో కొందరు స్టార్‌ హీరోయిన్లు స్పెషల్‌ రోల్స్‌ చేస్తున్నారు. ఈ హీరోయిన్లు ఆ సినిమాలకు ‘స్పెషల్‌ హీరోయిన్‌’ అనొచ్చు. ఇక ఈ స్పెషల్‌ రోల్స్‌ గురించి తెలుసుకుందాం. 

ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కొవొస్తున్నా నయనతార స్పీడు ఏ మాత్రం తగ్గలేదు. ఒకవైపు హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మŠస్‌తో కెరీర్‌లో బిజీగా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇప్పుడు మరో స్టెప్‌ ముందుకు వేసి ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రం కోసం నయనతార స్పెషల్‌ హీరోయిన్‌గా మారారు. మలయాళ హిట్‌ ‘లూసిఫర్‌’కు ‘గాడ్‌ఫాదర్‌’ తెలుగు రీమేక్‌. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. ఈ సినిమాలో ఓ కీ రోల్‌ చేస్తున్నారు నయనతార. ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘బోళాశంకర్‌’. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపిస్తారు కీర్తీ సురేశ్‌. అయితే కీర్తి ఇలా స్పెషల్‌ రోల్‌ చేయడం ఇది తొలిసారి కాదు. ‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్న’) చిత్రంలో రజనీకాంత్‌ చెల్లెలిగా పాత్రకు కీర్తీ సురేశ్‌ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే చిరంజీవి హీరోగా నటించిన ‘ఆచార్య’ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటించారు. కానీ ఈ చిత్రంలో కీలక పాత్రలో రామ్‌చరణ్‌ కనిపిస్తారు. రామ్‌చరణ్‌కు జోడీగా స్పెషల్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న థియేటర్స్‌లో విడుదల కానుంది.

ఇంకోవైపు క్రేజీ హీరోయిన్‌ రష్మికా మందన్నా ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకించి చెపక్కర్లేదు. ఇటు సౌత్‌  అటు నార్త్‌ ఇండస్ట్రీస్‌లో హీరోయిన్‌ గా రష్మికా మందన్నా వరుసగా సినిమాలు కమిట్‌ అవుతున్నారు. అయినప్పటికీ ‘సీతారామం’ చిత్రంలో స్పెషల్‌ రోల్‌ అంగీకరించారు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సీతారామం’. ఇందులో లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో కనిపించే దుల్కర్‌ను, సీత పాత్రధారి మృణాళినీ ఠాకూర్‌లను కలిపే కశ్మీర్‌ ముస్లిం అమ్మాయి అఫ్రీన్‌ పాత్రలో రష్మికా మందన్నా కనిపిస్తారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

కాగా డబుల్‌ స్పెషల్‌గా కనిపించనున్నారు హీరోయిన్‌ సోనాల్‌ చౌహాన్‌. ప్రస్తుతం నాగార్జున ‘ఘోస్ట్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సోనాల్‌ ‘ఎఫ్‌ 3’లో ఓ కీ రోల్‌ చేస్తున్నారు. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. ఈ ఏడాది మే 27న ‘ఎఫ్‌ 3’ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఇక ప్రభాస్‌ ‘ఆదిపురు‹Ù’ చిత్రంలోనూ ఓ స్పెషల్‌ రోల్‌ చేశారు సోనాల్‌. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్‌ కానుంది. ఇక ‘బొమ్మరిల్లు’ హీరోయిన్‌ హాసిని.. అదేనండీ.. జెనీలియాను మర్చిపోవడం అంత ఈజీ కాదు.

నటుడు, నిర్మాత రితేష్‌ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న తర్వాత తెలుగు సినిమాలకు జెనీలియా కాస్త దూరంగా ఉంటున్నారు. కానీ ఇటీవలే రీ ఎంట్రీ షురూ చేశారు. భర్త రితేష్‌తో కలిసి మరాఠిలో ‘వేద్‌’, హిందీలో ‘మిస్టర్‌ మమ్మీ’ సినిమాలు చేస్తున్నారు జెనీలియా. అంతే కాదండోయ్‌.. దాదాపు పదేళ్ల తర్వాత ఓ ద్విభాషా (కన్నడం, తెలుగు) చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.   రాధాకృష్ణ దర్శకత్వంలో కిరిటీ (వ్యాపారవేత్త గాలి జనార్థన్‌ కుమారుడు) హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో జెనీలియా ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తున్నారు. మరోవైపు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, లేడీ ఓరియంటెడ్‌... ఇలా బ్యాలెన్స్‌ చేస్తున్నారు ప్రియమణి. రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ‘విరాటపర్వం’లో ప్రియమణి ఓ స్పెషల్‌ రోల్‌ చేశారు.

ఈ చిత్రంలో కామ్రేడ్‌ భరతక్క పాత్రలో ప్రియమణి కనిపిస్తారు. మరోవైపు హిందీలో ఆమె మూడు నాలుగు చిత్రాల్లో హీరోయిన్‌ గా నటిస్తున్నారు. అలాగే ‘అద్భుతం’ చిత్రంతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన శివానీ రాజశేఖర్‌ ‘శేఖర్‌’ చిత్రంలో స్పెషల్‌ రోల్‌ చేశారు. ఆమె తండ్రి రాజశేఖర్‌ టైటిల్‌ రోల్‌లో, తల్లి జీవితా రాజశేఖర్‌ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ఇది. ఇక ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన శివాతి్మక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కంచిన ’రంగ మార్తండా’ చిత్రంలో ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇలా స్పెషల్‌ హీరోయిన్స్‌ జాబితాలో ఇంకా వరలక్ష్మీ శరత్‌కుమార్, నివేదా పేతురాజ్, అనిఖా సురేంద్రన్‌లతో పాటు మరికొంత మంది హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement