రష్మిక, పూజా హెగ్డే బాటలో శ్రీలీల.. బిగ్‌ ప్లాన్‌ వేసిన బ్యూటీ | Sreeleela's Big Plan For Next Movie | Sakshi
Sakshi News home page

రష్మిక, పూజా హెగ్డే బాటలో శ్రీలీల.. బిగ్‌ ప్లాన్‌ వేసిన బ్యూటీ

Published Fri, Feb 23 2024 6:54 AM | Last Updated on Fri, Feb 23 2024 9:19 AM

Sreeleela Big Plan For Next Movie - Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌లో మారు మోగుతున్న పేరు శ్రీలీల. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ పూర్వీకం కర్ణాటకకు చెందింది. డాక్టర్‌ విద్య చదివి యాక్టర్‌ అయిన శ్రీలీల 2019లో కిస్‌ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత పెళ్లిసందడి చిత్రంతో టాలీవుడ్‌లో యమ సందడి చేశారు. ఆ తర్వాత ఒక ఏడాది పాటు సైలెంట్‌గా ఉన్న ఈమె ధమాకా చిత్రంతో తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు. దీంతో వరుసగా అవకాశాలు శ్రీలీల తలుపు తడుతున్నాయి. జస్ట్‌ నాలుగేళ్లలో డజనుకు పైగా చిత్రాలు చేసేశారు.

అయితే పాటలకు, అందాలారబోతకే ఎక్కువగా పరిమితం అవుతున్న శ్రీలీలకు ఇంకా అవకాశం ఉన్న పాత్రల్లో సత్తా చాటే స్థాయికి ఎదగలేదు. తాజాగా మహేష్‌బాబు సరసన నటించిన గుంటూరు కారం చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. కాగా శ్రీలీల తాజాగా తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలను నటించే అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. వాటి వివరాలను త్వరలోనే ఆయా దర్శక నిర్మాతలు అధికారిక పూర్వకంగా వెల్లడిస్తారని పేర్కొన్నారు. మొత్తానికి కన్నడం, తెలుగు భాషల్లోనే నటిస్తున్న బ్యూటీ త్వరలో తమిళంలోనూ పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారన్న మాట. అయితే ఇప్పటికే రష్మిక మందన్న, పూజా హెగ్డే వంటి కన్నడ భామలు కోలీవుడ్లో నటించినా, ఆశించిన స్థాయికి చేరుకోలేదన్నది గమనార్హం. మరి శ్రీలీల భవిష్యత్తు ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement