అల్లు అర్జున్, రష్మిక మందన్న జోడిగా నటించిన చిత్రం 'పుష్ప: ది రూల్'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బన్నీకి ఇప్పటికే మలయాళంలో భారీ క్రేజ్ ఉంది. అక్కడి హీరోలకు ఉన్న మార్కెట్ అల్లు అర్జున్‌కు కూడా ఉంది. ఇప్పుడు పుష్పగాడి రూల్ తమిళనాడులో ప్రారంభం కానుంది. పుష్ప ప్రమోషన్స్ కార్యక్రమం తాజాగా తమిళనాడులో ఘనంగా జరిగింది.అయితే, తమిళనాడులో అత్యధిక థియేటర్స్‌లో విడుదలయ్యే చిత్రంగా పుష్ప రికార్డ్ క్రియేట్ చేసింది.
అల్లు అర్జున్ తమిళంలో మాట్లాడి అక్కడి ప్రేక్షకుల మనుసును గెలుచుకుంటే.. రజనీకాంత్ స్టైల్‌తో వారిని మరింత ఉత్తేజ పరిచారు. తాజాగా జరిగిన ఈవెంట్‌తో అక్కడ భారీ క్రేజ్‌ను పుష్ప సొంతం చేసుకుంది. పుష్ప తమిళ్ వర్షన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. ఆ సంస్థ నిర్మాత ఆర్చన కూడా పుష్ప ఈవెంట్‌లో పాల్గొన్నారు. పుష్ప సినిమాపై తమకు భారీ అంచనాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఇదే సంస్థ నుంచి ఈ ఏడాదిలో 'ది గోట్' చిత్రం విడుదలైన విషయం తెలిసిందే.
ది గోట్ సినిమాను 900కు పైగా స్క్రీన్స్‌లో 4000 షోలతో ఫస్ట్ డే విడుదల చేసినట్లు ఆమె చెప్పారు. అయితే, పుష్ప 2 సినిమాను తమిళనాడులో ఏకంగా 800కు పైగా స్క్రీన్‌లలో దాదాపుగా 3500షోలతో విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ఇన్ని స్క్రీన్స్‌లో విడుదల కాలేదు.
అల్లు అర్జున్ గురించి 'జైలర్' దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌కు తమిళ భాషపై మంచి పట్టు ఉందని ఆయన తెలిపారు. బన్నీ డైరెక్ట్ తమిళ సినిమా చేస్తే చాలా సంతోషిస్తామని ఆయన అన్నారు. అందుకు బన్నీ కూడా ఓకే చెప్పడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment