స్మృతీ ఇరానీ...రాబోయే రోజుల్లో రాష్ట్రపతి? | Astrologer to Smriti Irani: You will become president one day | Sakshi
Sakshi News home page

స్మృతీ ఇరానీ...రాబోయే రోజుల్లో రాష్ట్రపతి?

Published Mon, Nov 24 2014 12:35 PM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM

స్మృతీ ఇరానీ...రాబోయే రోజుల్లో రాష్ట్రపతి?

స్మృతీ ఇరానీ...రాబోయే రోజుల్లో రాష్ట్రపతి?

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.  ఆమె ...ఓ జ్యోతిష్యుడిని కలవడం కలకలం రేపుతోంది. స్మృతీ ఇరానీ ఆదివారం... భీల్‌వాడాలోని జ్యోతిష్కుడు నాథూలాల్‌ వ్యాస్‌ను  కలిశారు. భర్త జుబిన్‌తో కలిసి ఆమె నాథూలాల్ దగ్గరకు వెళ్లారు.  జ్యోతిష్కుడుతో ఆమె సుమారు 4 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా స్మృతీ ఇరానీ భవిష్యత్ గురించి తెలుసుకునేందుకు చేయి చూపించుకున్నట్లు సమాచారం. తన రాజకీయ భవిష్యత్, కుటుంబ పరిస్థితి, ఆరోగ్య స్థితిగతులపై వివరాలు తెలుసుకున్న ఆమె నాథూలాల్ వ్యాస్ ఆశీర్వాదం తీసుకున్నట్లు భోగట్టా.  నాథూలాల్ వ్యాస్ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

స్మృతీ ఇరానీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, ఆమెకు అత్యున్నత పదవి దక్కే అవకాశముందని జ్యోతిష్యుడు చెప్పినట్లు సమాచారం. భవిష్యత్తులో స్మృతీ ఇరానీ రాష్ట్రపతి అయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా జ్యోతిష్యున్ని కలవడంపై స్మృతీ ఇరానీ వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు తనకు రాశిచక్రం లేదని, అందుకే జ్యోతిష్యున్ని కలిసినట్లు తెలిపారు. మరోవైపు స్మృతీ ఇరానీ జ్యోడిష్యుడ్ని కలవటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement