
సుమన్‌శర్మ ఇంట్లో సోదాలు చేస్తున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు
సాక్షి, రామన్నపేట: వరంగల్ రామన్నపేటలోని జ్యోతిష్యుడు కాళేశ్వరం సుమన్‌శర్మ ఇంట్లో రూ.2.12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ జీవన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఇంట్లో నగదు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు ఎన్నికల టాస్క్‌ఫోర్స్ అధికారి ప్రశాంతి నేతృత్వంలో బుధవారం రాత్రి తనిఖీలు నిర్వహించగా నగదు లభ్యమైనట్లు ఆయన వివరించారు. ఈ నగదుకు సంబంధించిన వివరాలు తెలపకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.