జ్యోతిష్యుడు హత్య | - | Sakshi
Sakshi News home page

జ్యోతిష్యుడు హత్య

Published Mon, Feb 19 2024 6:26 AM | Last Updated on Mon, Feb 19 2024 1:51 PM

- - Sakshi

 అన్నానగర్‌: జ్యోతిష్యుడి హత్య కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. తేని జిల్లా దేవదానపట్టి ఉత్తర వీధికి చెందిన మన్మథన్‌ (35)కు దేవిక అనే భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మన్మథన్‌ జ్యోతిష్యం చెపుతూ ఫైనాన్‌న్స్‌ ఇచ్చేవాడు. శనివారం ఇతని భార్య, పిల్లలు దిండుక్కల్‌లోని పుట్టింటికి వెళ్లారు. ఆదివారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా మన్మథన్‌ కత్తిపోట్లకు గురై శవంగా కనిపించాడు.

షాక్‌కు గురైన భార్య పోలీసులకు సమాచారం అందించింది. పోలీసుల విచారణలో నల్లకరుప్పన్‌ పట్టికి చెందిన జయదీప(40) మన్మథన్‌ వద్ద అప్పు తీసుకుంది. వడ్డీ, అసలు చెల్లించకపోవడంతో ఆమెని మన్మథన్‌ దూషించాడు. దీంతో జయదీప మన్మథన్‌ ని చంపాలని నిర్ణయించుకుంది. ముత్తుమణితో కలిసి పథకం వేసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మన్మథన్‌ను హత్య చేసి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో జయదీప, ముత్తుమణిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement