Karnataka: Tiptur Astrologer Predicts Woman PM In 2024 - Sakshi
Sakshi News home page

దేశరాజకీయాల్లో పెను మార్పలు.. ఎన్నికల తర్వాత మహిళ ప్రధాని!

Published Fri, Aug 11 2023 12:44 PM | Last Updated on Fri, Aug 11 2023 1:03 PM

Karnataka: Tiptur Astrologer Predicts Woman PM 2024 - Sakshi

తుమకూరు(బెంగళూరు): వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రధానిగా ఒక మహిళ అధికారం చేపడతారని ప్రముఖ జ్యోతిష్యుడు యశ్వంత గురూజీ చెప్పారు. తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలూకా నోణవినకెరెలో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని తాను చెప్పిన జోస్యం నిజమైందని అన్నారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒక మహిళ పగ్గాలు చేపడుతుందని, ఇందిరాగాంధీ తరువాత ఆమె రెండవ మహిళా ప్రధాని అవుతారని చెప్పారు. రాబోయే మహా శివరాత్రి తరువాత దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. మహా శివరాత్రిలోగా ఎన్నికల జరిగితే ప్రధాని మోదీకి మరో అవకాశం ఉంటుంది, శివరాత్రి తరువాత జరిగితే ఆయనకు ఇబ్బందులు తప్పవని అన్నారు.

చదవండి: కాంగ్రెస్‌ నిర్వాకం వల్లే ఈశాన్యంలో సమస్యలు.. నార్త్‌ఈస్ట్‌... జిగర్‌ కా తుక్డా: మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement