‘శ్రీలంక అధ్యక్షుడు చస్తాడు.. జ్యోతిష్యుడు అరెస్టు’ | Astrologer Arrested For Predicting Sri Lankan President Sirisena's Death | Sakshi
Sakshi News home page

‘శ్రీలంక అధ్యక్షుడు చస్తాడు.. జ్యోతిష్యుడు అరెస్టు’

Published Thu, Feb 2 2017 8:49 AM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

‘శ్రీలంక అధ్యక్షుడు చస్తాడు.. జ్యోతిష్యుడు అరెస్టు’

‘శ్రీలంక అధ్యక్షుడు చస్తాడు.. జ్యోతిష్యుడు అరెస్టు’

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చనిపోతాడని జోష్యం చెప్పిన శ్రీలంక మాజీ నావికుడు, ప్రస్తుతం జ్యోతిష్యాలు చెప్పుకుంటు బతుకుతున్న వజితా రోహన విజెమునిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 26నాటికి మైత్రిపాల చనిపోతాడంటూ అతడు చెప్పిన మాటలు ఫేస్‌బుక్‌తో పాటు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని క్రైం బ్రాంచ్‌కు చెందిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారణకు తరలించారు.

గతంలో ఇతడు శ్రీలంక నావికుడిగా ఉన్నప్పుడు భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీపై రైఫిల్‌తో దాడికి యత్నించాడు. ఇండో-లంక మధ్య కుదుర్చుకునేందుకు రాజీవ్‌ గాంధీ కొలంబో వెళ్లినప్పుడు రోహన తన తుపాకీతో దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన 1987 జులై నెలలో జరిగింది. ఆ దెబ్బకు అతడిని కోర్టు మార్షల్‌ చేసిన శ్రీలంక జైలుకు పంపించింది. జైలు శిక్ష పూర్తయిన తర్వాత అతడు ప్రస్తుతం జ్యోతిష్యుడిగా పనిచేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement