అహ్మదాబాద్: ప్రముఖ జ్యోతిష్యుడు బెజన్ దారువాలా (89) మరణించారు. గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన గత రాత్రి తుదిశ్వాస విడిచారని అహ్మదాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈయన భారతదేశంలోని ప్రసిద్ధ జోతిష్య శాస్త్ర కాలమిస్ట్‌లలో ఒకరు. తన దశాబ్ధాల కెరీర్‌లో అనేక వార్తాపత్రికలు, న్యూస్ ఛానెల్‌తో సంబంధం కలిగి ఉన్నారు. అహ్మదాబాద్‌లో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.
బెజన్‌కు 2015లో ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన చేతిని చూపించానని చెప్పడం విశేషం. అయితే తన తండ్రి కరోనా బారిన పడి మరణించారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కుమారుడు నాస్టూర్ దారువాలా ఖండించారు. కాగా.. బెజన్ దారువాలా మరణానికి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్రమంత్రి స్మతి ఇరానీలు సంతాపం ప్రకటిస్తూ.. 'ఆయన మరణం మమ్మల్ని కలిచివేసింది. వారి కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఓం శాంతి' అంటూ ట్వీట్ చేశారు.
చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే
Comments
Please login to add a commentAdd a comment