గాంధీనగర్: అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను శనివారం గవర్నర్‌కి సమర్పించారు విజయ్ రూపానీ. 2016 నుంచి గుజరాత్ సీఎంగా ఉన్న రూపానీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
వచ్చే ఏడాది గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం నాయకత్వ మార్పుకు ఆదేశించినట్లు సమాచారం. దానిలో భాగంగానే విజయ్ రూపానీ రాజీనామా చేశారు. పటేల్ సామాజిక వర్గం నుంచే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. కొత్త సీఎం రేసులో నితిన్ పటేల్, సీఆర్ పటేల్, ఆర్‌సీ ఫాల్దూ ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పటేల్ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి రాజీనామా పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇటీవలే బీజేపీ.. కర్ణాటక, ఉత్తరాఖండ్ సీఎంలను మార్చిన సంగతి తెలిసిందే.
(చదవండి: స్వపక్షంలో విపక్షం)
2016 నుంచి విజయ్ రూపానీ గుజరాత్ సీఎంగా కొనసాగుతున్నారు. ఏబీవీపీ కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగారు. రూపానీ 1998లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2006-12 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజీనామా అనంతరం విజయ్ రూపానీ మాట్లాడుతూ ‘‘ఇన్నాళ్లు మోదీ మార్గదర్శకంలో పని చేశా. నాకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చాను. నేను సీఎంగా రాజీనామా చేసినప్పటికి మోదీ నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధి కొనసాగుతుంది. ఇక కొత్త సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది’’ అని తెలిపారు.
చదవండి: వైరల్: కొడుక్కు సెల్యూట్ చేసిన తల్లి, నెటిజన్లు ఫిదా
Comments
Please login to add a commentAdd a comment