
నవీన్, శ్రుతి దంపతులు
సాక్షి, బెంగళూరు(దొడ్డబళ్లాపురం): సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా కొందరు మూఢ నమ్మకాలను వీడటం లేదు. జ్యోతిష్యుడి మాటలు నమ్మి చెడు జరుగుతుందని నమ్మిన వ్యక్తి కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను ఇంట్లోంచి బయటకు పంపించిన దారుణ సంఘటన చెన్నపట్టణ పరిధిలోని మంజునాథ్ లేఔట్‌లో చోటుచేసుకుంది.
వివరాలు... నవీన్ (35), శ్రుతికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రుత్విక్ (2) అనే కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారి పుట్టిన నక్షత్రం వల్ల బిడ్డకు, ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి వల్ల నీకు కీడు జరుగుతుందని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతో ఆ మాటలు నమ్మిన నవీన్ భార్య, బిడ్డపై నిత్యం దాడి చేసి హింసించేవాడు. ఇంట్లోంచి వెళ్లిపోవాలని లేదంటే పెట్రోల్ పోసి ఇద్దరినీ తగలబెడతానని బెదిరించడంతో శ్రుతి తన బిడ్డను తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment