ఆటోడ్రైవర్‌ అఘాయిత్యం | Husband Ends His Wife Life In Bengaluru, More Details Inside | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్‌ అఘాయిత్యం

Published Thu, Feb 27 2025 9:35 AM | Last Updated on Thu, Feb 27 2025 9:57 AM

husband Obscene Video to Wife in Bengaluru

దొడ్డబళ్లాపురం(కర్ణాటక ): ఓ కిరాతక భర్త భార్యను హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన బెంగళూరు తిగళరపాళ్యలోని ముబారక్‌ నగర్లో చోటుచేసుకుంది. వివరాలు.. సురేశ్‌ (40), మమత (33) దంపతులు, అతడు ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించేవాడు. అయితే సురేశ్‌ ఈ మధ్య సరిగా పనికి వెళ్లకపోవడంతో మమత గొడవపడేది. బుధవారం పండుగ అని ఇంట్లోనే ఉన్నాడు. మమత ప్రశ్నించడంతో రగడ మొదలైంది. 

ఆ సమయంలో వారి కొడుకు (6) అక్కడే ఉన్నాడు. సురేశ్‌ కోపం పట్టలేక మమతను గొంతు నులిమి చంపి, తరువాత తానూ ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సురేశ్‌ భార్యకు మొబైల్లో అశ్లీల చిత్రాలు చూపించి వేధించేవాడని, ఈ విషయాన్ని మమత సురేశ్‌ తల్లికి చెప్పడంతో సహించలేక హత్య చేసినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరి స్వస్థలం తుమకూరు జిల్లా గుబ్బి. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement