
బెంగళూరు: భర్త ఆడవాళ్ల మాదిరిగా లిప్‌స్టిక్ పూసుకుని, మహిళలలో దుస్తులు ధరిస్తే ఏ భార్య మాత్రం ఊరుకుంటుంది? తేడాగా ఉన్నాడని గొడవ చేయదా? అచ్చం ఇలాంటి ఘటనే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇదే జరిగింది. అంతేగాక అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడని భర్త, అతని కుటుంబసభ్యులపై భార్య కుమారస్వామి లేఔట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..
మ్యాట్రిమోనియల్‌లో పరిచయమై
25 ఏళ్ల యువతికి మూడేళ్ల క్రితం మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి ఎంటెక్ చేశాడని, మంచి ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పుకున్నారు. దీంతో 2020లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కట్నకానుకల కింద 800 గ్రాములు బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ.5 లక్షల నగదు ముట్టజెప్పారు. వివాహమైన మొదటిరాత్రే సదరు భర్త వికృత రూపాన్ని ప్రదర్శించాడు.
అద్దం ముందు నిలబడి పెదవులకు లిప్‌స్టిక్ రాసుకుని, మహిళల లో దుస్తులను ధరించాడు. భార్య ఇదేమని ప్రశ్నిస్తే తనకు స్త్రీలంటే చాలా ఇష్టమని చెప్పేవాడు. నిత్యం ఇదే తంతు జరిగేది, ఈ విషయంపై దంపతులు తరచూ గొడవపడేవారు. దీంతో పగ పెంచుకున్న భర్త, అత్తమామ ఆమె మీద బొద్దింకల మందు స్ప్రే చేసి అనారోగ్యానికి గురిచేశారు. నీకు ఆసుపత్రిలో చూపించడానికి రూ.10 లక్షలు పుట్టింటి నుంచి తీసుకురావాలని పీడించారు. ఇది తట్టుకోలేక బాధితురాలు బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment