ఆయన చెప్పిందే నిజమైంది..సామ్‌-చై విడిపోయారు | Chay Sam Divorce-Astrologer Venu Swamy Predictions Turned Out True | Sakshi
Sakshi News home page

ChaySam Divorce: పెళ్లికి ముందే చెప్పారు.. సమంత-నాగ చైతన్య విడిపోతారని..

Published Sat, Oct 2 2021 5:04 PM | Last Updated on Sat, Oct 2 2021 5:51 PM

Chay Sam Divorce-Astrologer Venu Swamy Predictions Turned Out True - Sakshi

Naga Chaitanya-Samantha Divorce: సమంత- నాగ చైతన్య విడాకులపై గత కొంత కాలంగా వస్తున్న పుకార్లకు తెరపడింది. తాము విడాకులు తీసుకుంటున్నట్లు టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ నాగ చైతన్య-సమంత సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఇక భార్యా-భర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో వీరి వైవాహిక బంధం ముగిసినట్లుయ్యింది.

చదవండి: బ్రేకింగ్‌: సమంత-నాగ చైతన్య విడాకులు

2017, అక్టోబర్‌ 7న గోవాలో  క్రిస్టియన్‌, హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న సామ్‌-చై అక్టోబర్‌2న విడాకులు ప్రకటించారు. గత కొన్నాళ్లుగా వీరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. విడాకులకు రెండు నెలల ముందే సమంత తన సోషల్‌మీడియా అకౌంట్లలో అక్కినేని అనే పదాన్ని తీసేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.

ఇదిలా ఉండగా సమంత-నాగ చైతన్య విడిపోతారని మూడేళ్ల క్రితమే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సమంత-నాగ చైతన్యకు పెళ్లి తర్వాత విబేధాలు వస్తాయని,సినిమాల పరంగా బాగానే ఉన్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇబ్బందులు వస్తాయని వేణు స్వామి గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సామ్‌-చై పెళ్లికి ముందే వేణుస్వామి ఈ కామెంట్స్‌ చేయడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.
చదవండి: చైసామ్‌ విడాకులు.. ఏంటీ? ఏం జరిగింది?

అయితే ఇప్పుడు అదే వార్తలను  నిజం చేస్తూ సమంత-నాగ చైతన్య విడిపోయారు. దీంతో వేణు స్వామి చెప్పిందే నిజమైందని, ఆయన మూడేళ్ల క్రితమే చెప్పిన విడాకులు నేటితో నిరూపితం అయ్యిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

చై-సామ్‌ పెళ్లినాటి  ఫోటోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement