'రకుల్‌ పెళ్లి ఆగిపోతుంది.. జైలుకు వెళ్లే అవకాశం'! | Astrologer Venu Swamy Shocking Comments On Rakul Preet Singh Marraige | Sakshi
Sakshi News home page

Venu Swamy: 'రకుల్‌ జాతకంలో ఉన్నదిదే..పెళ్లి క్యాన్సిల్‌ అవుతుంది'

Oct 23 2021 12:57 PM | Updated on Oct 23 2021 2:08 PM

Astrologer Venu Swamy Shocking Comments On Rakul Preet Singh Marraige - Sakshi

Astrologer Venu Swamy Shocking Comments On Rakul Preet Singh Marriage :  రకుల్‌ జాతకం ప్రకారం ఎంగేజ్‌మెంట్‌ తర్వాత ఆమె పెళ్లి ఆగిపోతుంది..

Venu Swamy Shocking Comments On Rakul Preet Singh Marraige: హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లి ఎంగేజ్‌మెంట్‌ వరకు వచ్చి ఆగిపోతుందని, ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తెలిపారు. ఒకవేళ వివాహం జరిగినా విడిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్‌ ఈ విషయాన్ని ఇటీవలె ప్రకటించిన సంగతి తెలిసిందే. తన 31 వ పుట్టినరోజు సందర్భంగా జాకీ భగ్నానీతో తన రిలేషన్‌ను బయటపెట్టింది. చదవండి: చార్‌ ధామ్‌ యాత్ర: ప్రత్యే​క పూజలు నిర్వహించిన సామ్‌

త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. అయితే రకుల్‌- జాకీ భగ్నానీల జాతకాన్ని పరిశీలించిన అనంతరం వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాకీ భగ్నానీది మకర రాశి అని, ఆయన జాతకంలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడిపై ఉన్నందున వివాహానికి సంబంధించిన సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఇక రకుల్‌ది మిధున రాశి అని, ఆమె జాతకంలో గురువు, కేతువు కలిసి ఉండటం వల్ల కుటుంబం సౌఖ్యం ఉండదని చెప్పుకొచ్చారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌- జాకీ భగ్నానీల పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోతుంది. ఒకవేళ  పెళ్లి జరిగినా ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంతానం కలగకపోవడం సహా న్యాయ పరమైన ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా రకుల్‌ ఓ కేసు విషయమై జైలు కెళ్లే అవకాశం ఉంది అని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. గతంలో సమంత- నాగచైతన్యల వివాహానికి సంబంధించి వేణుస్వామి చెప్పింది నిజమైంది. భార్యభర్తలుగా ఇక కొనసాగలేమంటూ చై-సామ్‌ ప్రకటించిన సం‍గతి తెలిసిందే. మరి రకుల్‌ విషయంలో వేణు స్వామి చెప్పింది జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది. 

చదవండి: ChaySam Divorce: పెళ్లికి ముందే చెప్పారు.. సమంత-నాగ చైతన్య విడిపోతారని..
నేను అనుకున్నది నిజమైంది.. నా కల నెరవేరింది: సమంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement