Tamanna Open About Her dating Rumours With Vijay Varma- Sakshi
Sakshi News home page

Tamanna: విజయ్ వర్మతో డేటింగ్.. ఘాటుగా స్పందించిన తమన్నా

Mar 14 2023 7:38 PM | Updated on Mar 15 2023 5:03 AM

Tamanna Open About Her dating Rumours With Vijay Varma - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీ అయిపోయింది ముద్దుగుమ్మ. ఇటీవల జరిగిన లక్మీ ఫ్యాషన్‌ షోలో తళుక్కున మెరిసింది. పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్న ఈ షోలో తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఫ్యాషన్‌ పరంగా తన అభిరుచులను అభిమానులతో పంచుకుంది. తన ఫ్యాషన్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది మిల్కీ బ్యూటీ. అలాగే డేటింగ్‌ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది తమన్నా.

అలా ఉండేందుకు ఇష్టపడతా

తమన్నా మాట్లాడుతూ.. 'ఎప్పుడూ క్యాజువల్‌ దుస్తుల్లో ఉండడానికి ఇష్టపడతా. తనకు కంఫర్ట్‌గా ఉండే దుస్తులే ధరిస్తా. నా జుట్టు అంటే చాలా ఇష్టం. దాని కోసం ఎక్కువ కాస్మోటిక్స్‌ వాడను. ఎప్పుడూ సహజంగా ఉండేలా చూసుకుంటా. అందుకోసం ఉల్లిపాయ రసాన్ని వాడతాను.' అంటూ మిల్కీ బ్యూటీ తన అందం సీక్రెట్‌ చెప్పేసింది. 

విజయ్ వర్మతో డేటింగ్

అయితే గతంలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. న్యూ ఇయర్ వేడుకల్లో వీరిద్దరు జంటగా కనిపించడంతో పెద్దఎత్తున గాసిప్స్ గుప్పుమన్నాయి. విజయ్‌ వర్మతో రిలేషన్‌పై కాస్త ఘాటుగానే స్పందించింది. గోవాలో జరిగిన న్యూ ఇయర్‌ వేడుకల్లో విజయ్ వర్మకు తమన్నా ముద్దు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే.

డేటింగ్ వార్తలపై తమన్నా మాట్లాడుతూ.. 'మేమిద్దరం కలిసి ఓ సినిమాలో నటించాం. అప్పటి నుంచే మాపై రూమర్స్‌ తీసుకొచ్చారు. దీనిపై అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదు.' అంటూ ఘాటుగానే సమాధానమిచ్చింది తమన్నా. కాగా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్‌లో కనిపించనుంది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి జైలర్‌లో నటిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement