మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. ఈ ఏడాది దక్షిణాదిలో కేవలం జైలర్ మూవీలో మాత్రమే కనిపించింది. రజినీకాంత్ నటించిన ఈ చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఆ తర్వాత శ్రద్ధాకపూర్ నటించిన స్త్రీ-2 మూవీలో ఆజ్ కి రాత్ అంటూ ఐటమ్ సాంగ్‌తో ఫ్యాన్స్‌ను అలరించింది ముద్దుగుమ్మ.
అయితే తాజాగా వీకెండ్ పార్టీలో కనిపించింది మిల్కీ బ్యూటీ. అయితే తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఈ పార్టీకి హాజరైంది. ఇందులో పలువురు బాలీవుడ్ తారలు సైతం పాల్గొన్నారు. విక్రాంత్ మాస్సే, శీతల్ ఠాకూర్, ప్రగ్యా కపూర్, జీతేంద్ర, శోభా కపూర్, సోనాలి బింద్రే లాంటి బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రగ్యా కపూర్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
అయితే గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్‌లో ఉన్నారు. గతంలో చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించారు. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కుతారని చాలామంది భావించారు. అయితే తమ కెరీర్‌లో సినిమాలతో బిజీగా ఉన్నందువల్ల ఈ జంట పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోనైనా తమన్నా పెళ్లిబంధంలోకి అడుగు పెడుతుందేమో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment