weekend party
-
ప్రియుడితో కలిసి వీకెండ్ పార్టీలో మిల్కీ బ్యూటీ..!
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. ఈ ఏడాది దక్షిణాదిలో కేవలం జైలర్ మూవీలో మాత్రమే కనిపించింది. రజినీకాంత్ నటించిన ఈ చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఆ తర్వాత శ్రద్ధాకపూర్ నటించిన స్త్రీ-2 మూవీలో ఆజ్ కి రాత్ అంటూ ఐటమ్ సాంగ్‌తో ఫ్యాన్స్‌ను అలరించింది ముద్దుగుమ్మ.అయితే తాజాగా వీకెండ్ పార్టీలో కనిపించింది మిల్కీ బ్యూటీ. అయితే తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఈ పార్టీకి హాజరైంది. ఇందులో పలువురు బాలీవుడ్ తారలు సైతం పాల్గొన్నారు. విక్రాంత్ మాస్సే, శీతల్ ఠాకూర్, ప్రగ్యా కపూర్, జీతేంద్ర, శోభా కపూర్, సోనాలి బింద్రే లాంటి బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రగ్యా కపూర్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.అయితే గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్లో ఉన్నారు. గతంలో చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించారు. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కుతారని చాలామంది భావించారు. అయితే తమ కెరీర్లో సినిమాలతో బిజీగా ఉన్నందువల్ల ఈ జంట పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోనైనా తమన్నా పెళ్లిబంధంలోకి అడుగు పెడుతుందేమో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Pragya Kapoor (@pragyakapoor_) -
వీకెండ్ పార్టీలకు వెళ్తున్నారా? మోసగాళ్లు తొలుత ఏం చేస్తారో తెలుసా?
వీకెండ్ వస్తుందంటేనే చాలామందిలో ఒక జోష్ వస్తుంది. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నాం. కుటుంబంతో కలిసి పిక్నిక్లకు వెళ్లాం.. అంటూ ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటాం. వాటికి వచ్చిన లైక్స్, కామెంట్స్ చూసి మురిసిపోతుంటాం. ఇలాంటి వీకెండ్ పార్టీ జాబితా మీద నిఘా వేసే మోసగాళ్లు డిజిటల్లో పొంచి ఉన్నారు జాగ్రత్త. డిజటల్ మోసగాడి లక్ష్యం ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్స్‌ను అనుకరిస్తూ వారి పేరిట నకిలీ అకౌంట్స్‌ను సృష్టించడం. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, నటీనటులు, కంపెనీ అధినేతలు, ప్రముఖుల అకౌంట్స్ ఉండే అవకాశాలే ఎక్కువ. నకిలీ అకౌంట్స్‌తో మోసం చేసేవారు అన్ని ఆన్లైన్ సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తారు. వీరిలో చాలా మంది ప్రమాదకారులు కానప్పటికీ, పరువు నష్టం లేదా విరాళాలు అడగడం/ రుణాలు కోరడం/ కనెక్ట్ అయిన వెంటనే డబ్బు దోపిడీ చేయడం .. వంటి వాటిపై దృష్టి సారించే వారున్నారు. ముందే ప్లాన్ డిజిటల్ మోసగాళ్లు ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం ఏ మాత్రం నమ్మదగని కంటెంట్‌ను సృష్టిస్తారు. బాధితులు లేదా ఇతర హెల్త్ కేర్ ప్రొవైడర్స్ నుండి సమాచారాన్ని దొంగిలించడానికి టెలిఫోన్ స్కామర్లు ఎన్‌సిబి, ఇతర డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లలాగా నటించే విస్తృత మోసపు పథకాలు రిలీజ్ చేస్తుంటారు. ముఖ్యంగా వీక్ ఎండ్ పార్టీ కల్చర్ ఉన్న ఆన్లైన్ వినియోగదారులకు ఈ విధమైన కాల్స్ చేస్తుంటారు. స్కామర్లు నకిలీ పేర్లు, ప్రసిద్ధ డ్రగ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు లేదా అసలు విభాగాలలోని పోలీసు అధికారుల పేర్లను కూడా ఉపయోగిస్తారు. ప్రధానమైన ఎంపిక వైద్యపరమైన సమస్యలు, విడాకులు, కొత్త ఉద్యోగం, పార్టీల అవగాహన, గేమింగ్, కొనుగోళ్లు చేయాలనుకునేవారు, లైఫ్ స్టైల్ అవగాహన, టెక్నాలజీ, ట్రావెల్, స్పోర్ట్స్.. వంటి టాపిక్స్ గురించి చర్చించే సామాజిక ప్రొఫైల్స్‌ను మోసగాళ్లు ఎంచుకుంటారు. మోసగాళ్ల సాధారణ లక్షణాలు ♦దాడి చేసేవారి మాటల్లో వేగం ఉంటుంది. దీనిని గమనించి బాదితులు వెంటనే అలర్ట్ అవ్వచ్చు. ♦డబ్బుకు సంబంధించి ధ్రువీకరణ పొందడానికి ఊహించని రిక్వెస్ట్‌లు పంపుతారు. ఇది ఇ–మెయిల్స్‌కు ఎక్కువ. ♦స్కామర్లు తరచుగా ‘ప్రైవేట్, గోప్యమైన, రహస్య‘ పదాలను ఉపయోగిస్తారు, ♦చాలాసార్లు స్కామర్లు మీ ఇన్ బాక్స్‌లోకి ప్రవేశించడానికి ఇ మెయిల్ స్పూఫింగ్ లేదా ఒకేలా కనిపించే ఇమెయిల్‌ను ఉపయోగిస్తారు. ఇటీవలి కొత్త దాడులు ♦మోసగాళ్లు దొంగిలించిన ఉన్నతాధికారుల ఖాతాలను ఉపయోగించి ఆన్ లైన్ లో నకిలీ ఖాతాను సృష్టిస్తున్నారు. మోసగాళ్ళు వారి డిజిటల్ ప్రొఫైల్ (ఈ్క)ని ఎన్ ఫోర్స్మెంట్ అధికారి లేదా సీనియర్ బ్యూరోక్రాట్ చిత్రంతో సృష్టిస్తారు. స్కామర్ ఆ ఎన్ ఫోర్స్మెంట్ ఆఫీసర్ లేదా బ్యూరోక్రాట్‌గా నటించి వారి బృందాలకు వాట్సప్ సందేశాలను పంపుతాడు. ♦వారు వారాంతపు పార్టీపై అవగాహన ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారు. మొత్తం డేటా సోషల్ మీడియా పోర్టల్‌ల నుండి సేకరిస్తారు. ♦స్కామర్ల కథనాలు కొద్దిగా మారవచ్చు కూడా. సాధారణంగా, వారు చట్టవిరుద్ధమైన డ్రగ్స్‌తో ప్యాక్ చేసిన పార్శిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మీకు చెప్తారు. ఇది బాధితుల పేరుతో కొరియర్ చేయబడింది, లేదా అక్రమ మాదకద్రవ్యాలతో చేసిన ప్యాక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు, కొరియర్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా సృష్టిస్తారు. అంతేకాదు, మాదకద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కోసం బాధితుడిని అరెస్టు చేయబోతున్నారని బెదిరించడం. ♦బాధితులు వారి ఇ మెయిల్లు, వాట్సాప్ సంభాషణలకు సరిగ్గా స్పందించకపోతే, స్కామర్లు మొత్తాలను చెల్లించనందుకు అరెస్టు చేయడానికి లా ఎన్ఫోర్స్మెంట్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలుగా నటిస్తూ నకిలీ నోటీసులు పంపడం ద్వారా బాధితుడిని బెదిరించడం ప్రారంభిస్తారు. బాధితురాలికి బకాయిపడిన మొత్తంపై అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ♦దోపిడీలో భాగంగా, బాధితుడు తమకు చెల్లింపుగా డబ్బును బదిలీ చేయడానికి లేదా బాధితుడు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడని నిరూపించడానికి నకిలీ అధికారి పైన పేర్కొన్న కారణాన్ని చూపుతాడు. UPIని ఉపయోగించి డబ్బును ట్రాన్స్ఫర్ చేయమని చెబుతారు. సోషల్ మీడియాలో మోసం జరిగితే.. Instagramలో అయితే https://help.instagram.com/ 370054663112398 YouTubeలో అయితే https://support.google.com/youtube/answer/2801947?hl=en Facebookలో అయితే https://www.facebook.com/ help/contact/169486816475808 LinkedInలో అయితే https://www.linkedin.com/ help/linkedin/answer/61664/reporting-fake-profiles?lang=en రిపోర్ట్ చేయవచ్చు సైబర్ క్రైమ్ పోర్టల్... పరిస్థితి తీవ్రతను బట్టి జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ https://www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయచ్చు. మోసం చేయడానికి రకరకాల వేషాలు వేయడం, పరువు తీయడం లేదా మోసం చేయడం లేదా మోసం చేయాలనే ఉద్దేశ్యంతో తప్పుడు గుర్తింపు ఉండటం.. వంటివి నేరంగా ఈ పోర్టల్‌లో ఉంటుంది. మోసగాళ్ల బారిన పడకుండా.. ♦మీ ఖాతాలకు ప్రత్యేక, ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలతో సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి ♦(2FA) రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించండి. ♦లాక్/ గార్డ్ వంటివి మీ ప్రొఫైల్ ఫీచర్లకు ఉపయోగించండి. ♦సమాచార భాగస్వామ్యాన్ని నియంత్రించడానికి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం గోప్యతా సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయండి ♦సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు ♦అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి, https://isitphishing.org/తో లింక్‌ను ధృవీకరించండి. ♦నిజ జీవితంలో మీకు తెలిసిన, విశ్వసించే వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. ♦ఆఫ్‌లైన్– ఆన్లైన్ అందరినీ ఒకే విధంగా పరిగణించాలి. ♦మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం GPS లొకేషన్ ఫీచర్‌కి యాక్సెస్ ఆపేయండి. ♦మీ ఆర్థిక లావాదేవీలను ఉపయోగించే సమయాల్లో రిక్వెస్ట్ చేయడం, రిప్లై ఇవ్వడం వంటివి చేసే ముందు మీ ఇమెయిల్ హెడర్లను కూడా చెక్ చేయడం అలవాటు చేసుకోండి. -
యదార్థ సంఘటనతో ‘వీకెండ్ పార్టీ’
కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమాలు చూసే ధోరణి మారిపోయింది. రియాలిటీ చిత్రాలను, రియలిస్టిక్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నిజ జీవితంలోని ఘటనలు, యథార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అలాంటి నేపథ్యంతో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వీకెండ్ పార్టీ’. నాగార్జున సాగర్ ఏరియాలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రాబోతుంది. కథారచయిత అమరుడు డాక్టర్ బోయ జంగయ్య గారి 80వ జయంతి సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సినిమా నిర్మాత బోయ చేతన్ బాబు, సినిమా దర్శకులు అమరేందర్ ప్రోమో విడుదల చేశారు. నాగార్జునసాగర్ లో జరిగినటువంటి ఒక యదార్థ సంఘటన ఆధారంగా, ఈ సినిమా కొనసాగుతూ ఉంటుందని మేకర్లు తెలిపారు. బాహుబలి ప్రభాకర్, గీతా సింగ్, గుంటూరు విజయ్, అక్షిత్ అంగరీష్, రమ్య నాని, రమ్య రాజ్, సిరి, గీతిక, ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సదా చంద్ర సంగీతం అందిస్తున్నారు. -
"వీకెండ్ పార్టీ" ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
బి.జె క్రియేషన్స్, ఫోర్త్ ఆల్ థియేటర్ సంస్థలు సంయుక్తంగా బోయ చేతన్ బాబు నిర్మాణ సారథ్యంలో అమరేందర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం "వీకెండ్ పార్టీ". పాశం నరసింహారెడ్డి, పాశం కిరణ్ రెడ్డి, ఎన్ రేఖ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 1990వ దశకంలో జరిగినటువంటి ఒక యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని అమరుడు బోయ జంగయ్య రాసిన "అడ్డదారులు" రచనను తీసుకుని 'వీకెండ్ పార్టీ" తెరకెక్కించారు. సదా చంద్ర సంగీతం సమకూర్చిన ఈ సినిమా కు చంద్ర బోస్, కాసర్ల శ్యామ్, సదా చంద్రలు సాహిత్యం సమకూర్చారు. అద్దంకి రాము సినిమాటోగ్రఫీ అందించగా సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రాఫర్‌గా చేశారు. వేముల వెంకట్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. నలుగురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహంతో ఒక వీకెండ్ సాగర్‌కు వెళ్లగా అక్కడ ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కొన్నారనేది సినిమా కథ. ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాజ్ కందుకూరి వీకెండ్ పార్టీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. వీకెండ్ పార్టీ కథ అద్భుతంగా ఉంది. దర్శకుడు మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినందుకు ఎంతో గొప్పగా ఉంది. అన్నారు. దర్శకుడు డైరెక్టర్ అమరేందర్ మాట్లాడుతూ.. ఈ సినిమాపై, నాపై నమ్మకం పెట్టుకుని తెరకెక్కించిన నిర్మాతకు ధన్యవాదాలు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడానికి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో మంచి నటీనటులు నటించారు. తప్పకుండా అందరిని మెప్పిస్తుంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.. అన్నారు. -
ప్రాణాలు తీసిన ‘పార్టీ’
దుండిగల్/కలిదిండి (కైకలూరు): మద్యం మత్తు.. అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్నాయి. నలుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని దుండిగల్ సమీపంలో బౌరంపేట వద్ద ఆగి ఉన్న ట్రాలీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లా కలిదిండి మండలం కాళ్లపాలెం, ఆవకూరు, కోరుకొల్లు గ్రామాలకు చెందిన పుప్పాల సత్యనారాయణ కుమారుడు గణేశ్ (25), నరహరిశెట్టి నర్సింహారావు కుమారుడు సంజయ్ (25), సలాది అశోక్ (26) స్నేహితులు. చదవండి: ‘గ్యారెంటీ’ కోసం డీఎస్పీని సృష్టించాడు! ఉన్నత విద్యనభ్యసించిన ఈ ముగ్గురూ కొన్ని నెలల క్రితమే నగరానికి వచ్చారు. ప్రగతి నగర్లో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ప్రస్తుతం అశోక్ సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తుండగా మిగిలిన ఇద్దరూ ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. వీరి స్నేహితుడైన మియాపూర్‌కు చెందిన సాయి అప్పుడప్పుడు వీరి గదికి వస్తుండేవాడు. అతడి ద్వారా ఈ ముగ్గురికీ గాజుల వెంకటసాయి చరణ్‌తో (25) పరిచయమైంది. కారులో వెళ్తుండగా.. ఈ ఐదుగురూ మియాపూర్‌కు చెందిన దుర్గా, వేణుతో కలిసి శనివారం రాత్రి ప్రగతి నగర్‌లోని తమ గదిలో వీకెండ్ పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి తర్వాత సాయి, దుర్గా, వేణు గదిలోనే నిద్రించారు. అశోక్ దగ్గరి బంధువులు షాపూర్ నగర్‌లోని సంజయ్‌గాంధీ నగర్లో ఉంటున్నారు. అశోక్‌ను వారి ఇంట్లో దింపేందుకు చరణ్, గణేశ్, సంజయ్ సిద్ధమయ్యారు. తెల్లవారుజామున చరణ్‌కు చెందిన కియా కారులో గండిమైసమ్మ చౌరస్తా వైపు బయలుదేరారు. మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అక్కడ ఆగి ఉన్న ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొని నుజ్జునుజ్జయ్యింది. చరణ్, సంజయ్, గణేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద తీవ్రతను తగ్గించే ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నప్పటికీ.. ప్రమాద తీవ్రతకు పగిలిపోవడంతో ఫలితం దక్కలేదు. -
సమంతతో వీకెండ్ పార్టీ, మండే బ్లూస్: పిక్స్ వైరల్
సాక్షి, హైదరాబాద్: మహానటి సినిమా సూపర్ సక్సెస్‌తో స్టార్ హీరోయిన్గా కీర్తి సురేష్ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. మై మండే బ్లూస్ అంటూ తాజాగా బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జోస్ అలుక్కాస్ నగలతో సూపర్ లుక్‌లో అదరగొడుతున్న ఫోటోలకు "మండే బ్లూస్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. దీంతో అభిమానులు లవ్ ఎమోజీలతో సందడి చేస్తున్నారు. చదవండి : ANR: ఫేవరెట్ వాచ్, ఖద్దరు ఇదే! నాగ్ ఎమోషనల్ ట్వీట్ తన అప్‌కమింగ్ మూవీ రజనీకాంత్ సరసన నటిస్తున్న ‘అన్నాత్తే’ పోస్టర్‌ను గతవారం కీర్తి సురేష్ షేర్ చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’, మహేశ్ బాబుతో ‘సర్కారు వారి పాట’ మూవీలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సమంతతో కలిసి వీకెండ్ పార్టీ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. కీర్తి సురేష్, త్రిష, కళ్యాణి ప్రియదర్శన్, ప్రీతం జుకల్కర్‌తో కలిసి ఉన్న ఫోటోను సామ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇపుడు హాట్‌టాపిక్‌గా మారాయి. My Monday blues 💙#MondayBlues pic.twitter.com/gJhz4GTW6p — Keerthy Suresh (@KeerthyOfficial) September 20, 2021 View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) -
సిగ్నల్ జంపింగ్.. ప్రాణాలు తీసింది
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి/గన్‌ఫౌండ్రీ: వీకెండ్ పార్టీలో ఎంజాయ్ చేద్దామనుకున్నారు. కారులో జాయ్ రైడ్ చేస్తున్నారు. కానీ, మృత్యువు టిప్పర్ రూపంలో కాటేసింది. అప్పటిదాకా ఆనం దంగా గడిపినవారు అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని ఐటీ కారిడార్‌లో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు విగతజీవులయ్యారు. విప్రో జంక్షన్లో సిగ్నల్ జంప్ చేసిన వీరి స్విఫ్ట్ కారును వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ధాటికి టిప్పర్ సైతం బోల్తా కొట్టింది. స్టాప్‌లైన్ వద్ద ఐదు సెకన్లు ఆగినా టిప్పర్ ముందుకు వెళ్లిపోయి ప్రాణాలు దక్కేవని, మృతులంతా 25 ఏళ్లలోపు యువకులేనని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్‌రావు తెలిపారు. 1.మనోహర్ 2.రోషన్ 3. భరద్వాజ్ ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయ్గూడానికి చెందిన కాట్రగడ్డ సంతోష్(25) మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెల్లూరుకు చెందిన నాగిశెట్టి రోషన్(23), ఫస్ట్ లుక్ 3డీ యానిమేషన్లో పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి గణేష్ కాలనీకి చెందిన చింతా మనోహర్ (23), విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన పప్పు భరద్వాజ్ (20) మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని మారుతి పీజీ మెన్స్ హాస్టల్లో ఉంటున్నారు. నెల్లూరు జిల్లా వేదాయపాలెంకు చెందిన పవన్ కుమార్ (24) తన స్నేహితుడైన రోషన్‌ను కలిసేందుకు వచ్చాడు. పవన్ సోమవారం సాయంత్రం తన స్వస్థలానికి తిరిగి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఐదుగురూ తమ స్విఫ్ట్ కారులో వీకెండ్ పార్టీకని బయలుదేరారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రోషన్ మినహా మిగిలిన నలుగురూ హాస్టల్‌కు తిరిగి వచ్చారు. మళ్లీ 9.26 గంటలకు ఆ నలుగురు బయటకు వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. (సెటిలయ్యాక వస్తానన్నాడు.. ఇంతలోనే విషాదం) విప్రో సర్కిల్లో బోల్తా పడిన టిప్పర్.. నుజ్జునుజ్జయిన కారు కారు నడిపిందెవరంటే... ప్రమాద సమయంలో కారును సంతోష్ నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. టిప్పర్ డ్రైవర్ దీపేందర్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని శ్వాస పరీక్ష నిర్వహించగా మద్యం తాగిన ఆనవాళ్లు కనిపించలేదు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి సంబంధీకులకు మృతదేహాలను అప్పగించారు. అంతిమ సంస్కారాల నిమిత్తం స్వస్థలాలకు తరలించారు. జాయ్ రైడ్ కోసమేనా? రాత్రి 9.26కు బయటకు వెళ్లిన ఐదుగురు స్నేహితులు తెల్లవారు జామున 2.48 గంటల వరకు ఎక్కడికి వెళ్లారనే ప్రశ్నకు పోలీసులకు కూడా సరైన సమాధానం దొరకట్లేదు. కారులో పగిలిపోయిన కొన్ని బాటిళ్ల ఆనవాళ్లు పోలీసులకు కనిపించాయి. ఈ నేపథ్యంలో వీళ్లు ఎక్కడైనా పార్టీ చేసుకొని జాయ్ రైడ్ కోసం అటు వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతులు మద్యం సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తేనే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రమాదం ఇలా..? వీరు ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారుజామున 2.48 గంటల ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న విప్రో జంక్షన్ వద్దకు చేరుకుంది. ట్రిపుల్ ఐటీ వైపు నుంచి వచ్చిన ఈ కారు ఆ జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి గౌలిదొడ్డి వైపు వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో రెడ్ సిగ్నల్ పడటంతో ట్రిపుల్ ఐటీ వైపు నుంచే వచ్చిన మరో కారు ఆగి ఉంది. అయితే, రెడ్ సిగ్నల్‌ను బేఖాతరు చేసిన ఈ స్విఫ్ట్ కారు గౌలిదొడ్డి వైపు వెళ్లేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో కోకాపేట వైపు నుంచి ట్రిపుల్ ఐటీ వైపు వెళ్ళేందుకు వేగంగా వస్తున్న టిప్పర్ (టీఎస్ 5 యుబి 2451) ఈ కారును ఢీ కొట్టింది. కారును రోడ్డు పక్కన తోసుకుంటూ వెళ్లిన టిప్పర్ కూడా బోల్తా కొట్టింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు కావడంతో ఐదుగురూ అందులో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకుని అక్కడకు పోలీసులు వచ్చి.. కారులో ఇరుక్కున్నవారిని బయటకు తీశారు. అప్పటికే సంతోష్, రోషన్, పవన్, మనోహర్ విగతజీవులయ్యారు. తీవ్రరక్తస్రావం అవుతున్న భరద్వాజ్‌ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచాడు. కారులో లభించిన సెల్ఫోన్ల ఆధారంగా పోలీసులు మృతుల వివరాలను తెలుసుకున్నారు. అంతుచిక్కని ఈ–చలానా! ప్రమాదానికి ముందు దృశ్యం ప్రమాదస్థలంలో నుజ్జునుజ్జై పడి ఉన్న వాహనంపై ఈ–చలాన్ జారీ అయి ఉంది. అదీ ఈ ప్రమాదం జరిగిన దాదాపు రెండున్నర గంటల తర్వాత కావడం గమనార్హం. తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రమాదం జరిగితే, ఆదివారం ఉదయం 5.29 గంటలకు కొత్తగూడ జంక్షన్లో ఈ కారు క్యారేజ్ వేలో రాంగ్ పార్కింగ్ చేసినట్లు రూ.100 జరిమానాతో ఈ–చలానా జారీ అయింది. ఈ చలానా ప్రకారం.. ప్రమాదం జరిగిన 2 గంటల 41 నిమిషాల తర్వాత... ఘటనాస్థలికి సుమారు ఆరు కిలోమీటర్ల వెనుక సదరు కారు రాంగ్ పార్కింగ్‌లో ఉందన్నమాట. ఈ చిక్కు ప్రశ్నకు పోలీసులే సమాధానం చెప్పాలి. ప్రతి ఈ–చలానాతోపాటు ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోనూ సదరు వెబ్సైట్ పొందుపరుస్తుంది. అయితే ఈ ఈ–చలానాకు సంబంధిత ఫొటోను మాత్రం జత చేయలేదు. -
బెజవాడలో వీకెండ్ పార్టీల జోరు
ముజ్రా డ్యాన్స్‌లకు అనుమతి ఉండదు..కానీ అర్ధరాత్రి అశ్లీల నృత్యాలతో ‘జిల్ జిల్ జిగేల్ రాణి’ అని హోరెత్తి స్తారు.. క్రాస్ మసాజ్ సెంటర్లకు అనుమతి లేదు.. కానీ నగరం నడిబొడ్డునే మసాజ్ సెంటర్ల ముసుగులో మజా చేస్తారు.. అసలు పబ్‌లకు అనుమతే లేదు.. కానీ ఓ అతిపెద్ద షాపింగ్‌మాల్‌లోనే అనధికార పబ్‌లో చిందులు తొక్కుతారు.. రాజధాని విజయవాడ అంటే అదీ మరి... ఇక్కడ అనుమతులతో పని లేదు.. అక్రమాలకు పెద్దపీట వేస్తారు.. అధికార టీడీపీ పెద్దల అండ ఉంటే చాలు.. అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతుంటే.. విశృంఖలత్వం వెర్రితలలు వేస్తూ ఉంటుంది. సాక్షి, అమరావతిబ్యూరో: అది విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఓ పెద్ద షాపింగ్‌మాల్. ఆ మాల్ పై అంతస్తులో ఓ పబ్. బడాబాబుల బిడ్డలకు అది అడ్డా. అధికారికంగా అనుమతి లేకపోయినా సరే మూడు డీజేలు... ఆరు గ్లాసులుగా అడ్డగోలు వ్యాపారం ‘ఫుల్’గా కళకళలాడుతూనే ఉంటుంది. అందులో ఓ డ్యాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేసి వీకెండ్ పార్టీల పేరుతో హల్చల్ చేస్తున్నా పోలీసు యంత్రాంగం పట్టించుకోదు. ప్రతి శని, ఆదివారాల్లో అక్కడ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బార్లకు ఇచ్చిన నిర్ణీత సమయం ముగిసినప్పటికీ ఆ పబ్‌లో మాత్రం డీజేలు, డ్యాన్స్‌లు హోరెత్తుతూనే ఉంటాయి. పోలీసుల ఉదాసీనతే ఆ పబ్ వేదికగా శనివారం అర్ధరాత్రి గ్యాంగ్‌వార్‌కు దారితీసింది. శనివారం ఆ పబ్‌లో రెండువర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. యాజమాన్యం ఒత్తిడికి తలొగ్గి... దాదాపు 214 మంది ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించుకుని బీభత్సం సృష్టించారు. తప్పని పరిస్థితుల్లో పబ్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసుల రాక చూసి 10 మంది పలాయనం చిత్తగించగా నలుగురు చిక్కారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘర్షణ పడ్డ మిగిలిన 10 మంది పేర్లు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పబ్ యాజమాన్యం ఒత్తిడికి పోలీసులు తలొగ్గుతున్నట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి ఘర్షణ జరగగా ఆదివారం రాత్రి వరకు సాగదీసి ఆ నలుగురు యువకులపై కేవలం న్యూసెన్స్ కేసుతో సరిపెట్టారు. కానీ అసలు ఆ పబ్‌కు అనుమతి ఉందా? అనుమతి లేకుండా ఎలా నిర్వహిస్తున్నారనే విషయాన్నే పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే యువకుల ఘర్షణ మీదే హడావుడి చేస్తూ అనధికారిక పబ్ విషయన్ని కప్పిపుచ్చుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మామూళ్ల మత్తు... అధికార యంత్రాంగం చిత్తు షాపింగ్ మాల్ల్లోని పబ్ మాత్రమే కాదు నగరంలోని బార్లు , మద్యం దుకాణాల విషయంలో కూడా పోలీసుల వైఖరి అలానే ఉంది. జిల్లాలో 343 మద్యం దుకాణాలు, 162 బార్లు ఉన్నాయి. విజయవాడ నగరంలోనే దాదాపు 40 మద్యం దుకాణాలు, 120 వరకు బార్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు రాత్రి 10 వరకు, బార్లు రాత్రి 11 గంటలకు మూసివేయాలి. కానీ నగరంలో మద్యం దుకాణాలు, బార్లు రాత్రి 12 గంటల వరకు దర్జాగా విక్రయాలు సాగిస్తునే ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. కానీ పోలీసులు గానీ ఎక్సైజ్ అధికారులుగానీ చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. సత్యనాయణపురం, ఆటోనగర్, సింగ్‌నగర్, పటమట, కృష్ణలంక ఇలా జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రధాన రహదారులపైనే ఈ బార్లు, మద్యం దుకాణాలు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటున్నా పట్టించుకునే నాథుడే లేరు. ఇక పెద్ద షాపింగ్‌లో మాల్లో అనధికారికంగా నిర్వహిస్తున్న పబ్ విషయంలో పట్టించుకుంటారని ఆశించడం అత్యాశే అవుతుంది. మద్యం దుకా ణాలు, బార్లు, పబ్ యాజమాన్యాలు ఇచ్చే మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం నిబంధనలను గాలికొదిలేస్తోంది. పెట్రేగిపోతున్న విచ్చలవీడితనం అధికార యంత్రాంగం ఉదాసీనత రాజధానిలో విశృంఖలత్వం వెర్రితలలు వేస్తోంది. శాంతిభద్రతలకు విఘాతంగా పరిణమిస్తోంది. కొన్నిరోజుల కిందటే భవానీపురంలో టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన హోటల్లో ముజ్రా పార్టీ నిర్వహించడం కలకలం సృష్టించింది. ప్రతి నెలా అక్కడ ముజ్రా పార్టీ అన్నది సర్వసాధారణ అంశంగా మారింది. మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అనధికార పబ్‌లు, అందులో దాడుల ఘటనలు రాజధానిలో గాడితప్పుతున్న వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. యువత పెడదారిపడుతున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండం విస్మయపరుస్తోంది. విజయవాడలో పెట్రేగుతున్న పెడధోరణులపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. -
18 ఏళ్లలోపే మద్యం రుచి చూస్తున్నారు
గుంటూరు(ఎస్వీఎన్ కాలనీ) : తాగితే తప్పేముంది అనుకుంటున్నారేమో పట్టణ వాతావరణంలోని 18ఏళ్లలోపు యువత పెగ్గులు లాగించేస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలను, ఆశయాలను నీరుగారుస్తున్నారు. స్నేహితులతో కలిసి మొదట సరదాగా మద్యం రుచి చూస్తున్న యువత రానురాను డోస్ పెంచేసి దానికి బానిసలుగా మారుతున్నారు. బంగారు భవిష్యత్తును చేతులారా చిదిమేసుకుంటున్నారు. అసోచామ్, పీటర్బర్గ్ విశ్వవిద్యాలయం వంటి సామాజిక అధ్యయన సంస్థలు తేటతెల్లం చేస్తున్న దిగ్భ్రాంతికర విషయాలు పరిశీలిస్తే ఉజ్వల భవితవ్యం ఉన్న యువభారతం పెడదోవ పడుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ బిడ్డల వ్యవహారశైలిపై ఓ కన్నేసి ఉండాల్సిందేనని మనస్తత్త్వ శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. నేరాలకు మూలమిదే.. సిగరెట్లు వద్దంటూనే, మందే ముద్దు అని యువత రెచ్చిపోతోంది. పెరుగుతున్న అశాంతి, నేరాలు, ఘోరాలకు ప్రధాన కారణం తాగిన మైకమేనని మనస్తత్వ శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు చాటి చెబుతున్నా పట్టించుకుంటున్నవారే కరువవుతున్నారు. అమ్మాయిలు కూడా బాటిల్ మూతలు తెరుస్తున్నారు. దీనికి ఒత్తిడి, పాకెట్‌మనీలో విచ్చలవిడితనం, మితిమీరిన స్వేచ్ఛ, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణాలుగా స్పష్టమవుతోంది. అసోచామ్ సోషల్ డెవలప్మెంట్ ఫౌండేషన్(ఏఎస్డీఎఫ్) అధ్యయనాల్లో ఇదే విషయం వెల్లడైంది. ప్యారిస్‌కు చెందిన అర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) నివేదికను పరిశీలిస్తే భారత్‌లో 10 ఏళ్ల కాలంలో ఆల్కహాల్ వినియోగం 55 శాతం పెరిగిందని స్పష్టం చేస్తోంది. మరీ ముఖ్యంగా యువత, మహిళల్లో కూడా ఆల్కహాల్వినియోగం పెరిగిందని ఆ సంస్థ చెబుతూనే చిన్నారులు ఈ అలవాటు బారిన పడటం ఆందోళనకరమంటూ హెచ్చరించింది. ఈ అంశాల ఆధారంగా ఆసోచామ్, పీటర్బర్గ్ యూనివర్సిటీ సంయుక్తంగా టీనేజ్ డ్రింకింగ్‌పై దేశ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన అధ్యయనంలో 16 నుంచి 29 ఏళ్ల వయసున్న యువతపై ఆన్లైన్ క్లినికల్ ట్రైల్ చేపట్టింది. ఇందులో మూడో వంతు టీనేజర్లు తాము కాలేజీలో ప్రవేశించక మునుపే ఆల్కహాల్ టేస్ట్ చేస్తున్నారని తేల్చారు. 40 శాతం టీనేజర్లు తమకు 15–17 సంవత్సరాల వయసున్నప్పుడే మందు తాగామని చెప్పారు. 20–29 ఏళ్లు కలిగిన 69 శాతం మంది యువతీ, యువకులు తాము నూతన సంవత్సర, వీకెండ్ వేడుకల్లో మద్యం తాగామని ఒప్పుకుంటున్నారు. అయితే అమ్మాయిలకన్నా అబ్బాయిలే ఎక్కువగా తాగుతున్నారని గుర్తించారు. అధిక శాతం మంది యువతులు తమ పాకెట్ మనీలో గరిష్ట శాతం మూవీ టికెట్లు, సాఫ్ట్ డ్రింక్స్, కేఫ్ సెంటర్స్‌లోనే ఖర్చు చేస్తున్నామన్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణే కీలకం తల్లిదండ్రులు ఆల్కహాల్‌ను పిల్లల ముందు సేవించడం, పిల్లలతో ఆనుబంధం సరిగాలేకపోవడం, విద్యా సమస్యలు, ఆల్కహాల్ తీసుకున్నా ఏమీకాదనే భావన, వ్యాపార ప్రకటనలు, చట్టాలు సరిగా అమలు చేయకపోవడం, బార్లలో ఆఫర్లు వంటివి యువత మద్యానికి ఆకర్షితులవడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. విచ్చలవిడి పాకెట్‌మనీ ఎక్కువశాతం యువత వీకెండ్ వేడుకలు వచ్చాయంటే రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు ఆల్కహాల్ మీదనే ఖర్చు చేస్తున్నారని, అధికశాతం ఆల్కహాల్ వినియోగిస్తున్న చిన్నారులు, టీనేజర్లు సంఘంలో ఉన్నత కుటుంబాలకు చెందిన వారేనని గుర్తించారు. యువతులు ఫ్రూటీఫ్లేవర్డ్ ఆల్కహాల్ ను తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారన్నారు. ఇదీ ముప్పు ఆల్కహాల్ అధికంగా వినియోగించడం వల్ల స్వీయ ప్రమాదాలు కొనితెచ్చుకోవడం, హైరిస్క్, విచిత్ర మనస్తత్వ ధోరణి, సెక్సువల్ ప్రవర్తన, అన్నవాహిక క్యాన్సర్, కాలేయ వ్యాధులు, అల్సర్లు, అసహనానికి లోనుకావడం(ఆల్కహాల్ డిపెడెన్సీ సిండ్రో మ్), హైపర్ టెన్షన్ వంటి ఆరోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉందని వైద్యులు చెబుతున్నారు. డీ ఎడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్లాలి మద్యం మత్తులోనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 25 ఏళ్లలోపే ఎక్కువ మంది మద్యానికి బానిసలవుతున్నారు. బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. మద్యం అలవాటును నివారించేందుకు డీ ఎడిక్షన్ కంట్రోల్ కేంద్రాలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి వారికి తగిన విధంగా కౌన్సెలింగ్, చికిత్స అందించగలిగితే చాలా వరకు మార్పు వస్తుంది. – డాక్టర్ నల్లూరి మురళీకృష్ణ, హెచ్‌వోడీ మానసిక వైద్య విభాగం ఆరోగ్య సమస్యలకు మూలం తెలిసీతెలియని ప్రాయంలో ఒత్తిడిని అధిగమించాలనే ఉద్దేశంతో ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. మద్యం అనేక ఆరోగ్య సమస్యలకు మూలమని గమనించాలి. ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల్లో ఎక్కువగా మద్యం వ్యసనపరులే ఉంటున్నారు. మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు 20 ఏళ్లప్రాయంలోనే తలుపు తట్టడానికీ మద్యమే కారణం. – డాక్టర్ వైవీఎస్ ప్రభాకర్, ఫిజీషియన్ -
వీకెండ్ పార్టీలో అగ్నిప్రమాదం.. 33 మంది మృతి
అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో ఒక వీకెండ్ పార్టీ జరుగుతున్న భవనంలో మంటలు చెలరేగడంతో 33 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు అంతస్థులలో ఉన్న ఈ భవనాన్ని ఒక కళాకారుడు తాను సేకరించిన పెయింటింగులను దాచుకోడానికి గోడౌన్‌గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందులో మంటలు చెలరేగడంతో మొత్తం భవనం అంతా బూడిద కుప్పగా మారింది. అందులోంచి సుమారు 12 మంది మృతదేహాలను వెలికితీశారు. అగ్నిప్రమాదం ఎందువల్ల సంభవించిందో ఇంకా తెలియలేదు. ఇందులో విద్రోహచర్య ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ భవనంలో తరచు సంగీత ప్రదర్శనలు కూడా జరుగుతుంటాయని, కానీ భవన నిర్మాణంలో నిబంధనలను మాత్రం అస్సలు పాటించలేదని అంటున్నారు. ఆల్మెడా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఇప్పటికే అగ్నిప్రమాదానికి సంబంధించిన నేర విచారణను ప్రారంభించిందని మేయర్ లిబ్బీ స్కాఫ్ తెలిపారు. బాధితులు ఎవరో గుర్తించడం, వాళ్ల కుటుంబాలకు సమాచారం అందించడం తమ ప్రథమ కర్తవ్యమని మేయర్ చెప్పారు. ఏడు కుటుంబాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చామన్నారు. ఈ ప్రమాదం సరిగే సమయానికి భవనంలో ఎంతమంది ఉన్నారన్న విషయం ఇంకా తెలియలేదు. గతంలో 2003 సంవత్సరంలో రోడ్ ఐలండ్ నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 100 మంది మరణించారు. దాని తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదేనని చెబుతున్నారు. -
పజామా పార్టీల హంగామా