
సాక్షి, హైదరాబాద్: మహానటి సినిమా సూపర్ సక్సెస్‌తో స్టార్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. మై మండే బ్లూస్ అంటూ తాజాగా బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జోస్ అలుక్కాస్ నగలతో సూపర్ లుక్‌లో అదరగొడుతున్న ఫోటోలకు "మండే బ్లూస్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. దీంతో అభిమానులు లవ్ ఎమోజీలతో సందడి చేస్తున్నారు.
చదవండి : ANR: ఫేవరెట్ వాచ్, ఖద్దరు ఇదే! నాగ్ ఎమోషనల్ ట్వీట్
తన అప్‌కమింగ్ మూవీ రజనీకాంత్ సరసన నటిస్తున్న ‘అన్నాత్తే’ పోస్టర్‌ను గతవారం కీర్తి సురేష్ షేర్ చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’, మహేశ్ బాబుతో ‘సర్కారు వారి పాట’ మూవీలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సమంతతో కలిసి వీకెండ్ పార్టీ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. కీర్తి సురేష్, త్రిష, కళ్యాణి ప్రియదర్శన్, ప్రీతం జుకల్కర్‌తో కలిసి ఉన్న ఫోటోను సామ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇపుడు హాట్‌టాపిక్‌గా మారాయి.
My Monday blues 💙#MondayBlues pic.twitter.com/gJhz4GTW6p
— Keerthy Suresh (@KeerthyOfficial) September 20, 2021
Comments
Please login to add a commentAdd a comment