విజయ్‌ చివరి చిత్రంలో ఇద్దరు స్టార్‌ హీరోయిన్లు..ఎవరంటే?  | Samantha And Keerthy Suresh To Team Up With Vijay In His 69th Film | Sakshi
Sakshi News home page

ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో విజయ్‌ రొమాన్స్‌.. చివరి చిత్రమిదేనా?

Published Sat, Apr 27 2024 11:01 AM | Last Updated on Sat, Apr 27 2024 11:01 AM

Samantha And Keerthy Suresh To Team Up With Vijay In His 69th Film

ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికరమైన టాక్‌ హల్‌చల్‌ చేస్తోంది. నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చి త్రం గోట్‌(ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టై మ్‌) నటి మీనాక్షి చౌదరి, స్నే హ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్,వైభవ్, ప్రేమ్‌జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

 

కాగా తదుపరి విజయ్‌ తన 69వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇదే ఈయన చివరి చిత్రం అని ప్రచా రం జోరుగా సాగుతోంది. కారణం విజయ్‌ రాజకీయరంగ ప్రవేశం చేయడమే. కాగా ఆయన చివరి చిత్రానికి హెచ్‌ వినో ద్‌ దర్శకత్వం వహించనున్నారన్న ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో దీన్ని ఏ నిర్మాణ సంస్థ నిర్మించనుందీ అన్నది కూడా తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఇందులో విజయ్‌తో జత కట్టే కథానాయికల గురించి ప్రచారం జో రుగా సాగుతోంది.

అలా ఈ జాబితాలో పలువురు పేర్లు చెక్కర్లు కొడుతున్నా, నటి సమంత, కీర్తీసురేష్‌ పేర్లు తాజాగా వినిపిస్తున్నాయి. నటి సమంత ఇంతకు ముందు విజయ్‌ సరసన కత్తి, తెరి, మెర్సల్‌ చిత్రాల్లో నటించారు. అలాగే నటి కీర్తీసురేష్‌ కూడా ఇంతకు ముందు భైరవా, సర్కార్‌ చిత్రాలలో జత కట్టారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి విజయ్‌తో రొమాన్స్‌ చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement