![Cyber Crimes: Surveillance On Weekend Party Users - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/22/Weekend%20party.jpg.webp?itok=5vT8xOA8)
వీకెండ్ వస్తుందంటేనే చాలామందిలో ఒక జోష్ వస్తుంది. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నాం. కుటుంబంతో కలిసి పిక్నిక్‌లకు వెళ్లాం.. అంటూ ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటాం. వాటికి వచ్చిన లైక్స్, కామెంట్స్ చూసి మురిసిపోతుంటాం. ఇలాంటి వీకెండ్ పార్టీ జాబితా మీద నిఘా వేసే మోసగాళ్లు డిజిటల్‌లో పొంచి ఉన్నారు జాగ్రత్త.
డిజటల్ మోసగాడి లక్ష్యం ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్స్‌ను అనుకరిస్తూ వారి పేరిట నకిలీ అకౌంట్స్‌ను సృష్టించడం. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, నటీనటులు, కంపెనీ అధినేతలు, ప్రముఖుల అకౌంట్స్ ఉండే అవకాశాలే ఎక్కువ. నకిలీ అకౌంట్స్‌తో మోసం చేసేవారు అన్ని ఆన్‌లైన్ సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తారు. వీరిలో చాలా మంది ప్రమాదకారులు కానప్పటికీ, పరువు నష్టం లేదా విరాళాలు అడగడం/ రుణాలు కోరడం/ కనెక్ట్ అయిన వెంటనే డబ్బు దోపిడీ చేయడం .. వంటి వాటిపై దృష్టి సారించే వారున్నారు.
ముందే ప్లాన్
డిజిటల్ మోసగాళ్లు ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం ఏ మాత్రం నమ్మదగని కంటెంట్‌ను సృష్టిస్తారు. బాధితులు లేదా ఇతర హెల్త్ కేర్ ప్రొవైడర్స్ నుండి సమాచారాన్ని దొంగిలించడానికి టెలిఫోన్ స్కామర్లు ఎన్‌సిబి, ఇతర డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్లలాగా నటించే విస్తృత మోసపు పథకాలు రిలీజ్ చేస్తుంటారు. ముఖ్యంగా వీక్ ఎండ్ పార్టీ కల్చర్ ఉన్న ఆన్‌లైన్ వినియోగదారులకు ఈ విధమైన కాల్స్ చేస్తుంటారు. స్కామర్లు నకిలీ పేర్లు, ప్రసిద్ధ డ్రగ్ ఎన్ ఫోర్స్‌మెంట్ అధికారులు లేదా అసలు విభాగాలలోని పోలీసు అధికారుల పేర్లను కూడా ఉపయోగిస్తారు.
ప్రధానమైన ఎంపిక
వైద్యపరమైన సమస్యలు, విడాకులు, కొత్త ఉద్యోగం, పార్టీల అవగాహన, గేమింగ్, కొనుగోళ్లు చేయాలనుకునేవారు, లైఫ్ స్టైల్ అవగాహన, టెక్నాలజీ, ట్రావెల్, స్పోర్ట్స్.. వంటి టాపిక్స్ గురించి చర్చించే సామాజిక ప్రొఫైల్స్‌ను మోసగాళ్లు ఎంచుకుంటారు.
మోసగాళ్ల సాధారణ లక్షణాలు
♦దాడి చేసేవారి మాటల్లో వేగం ఉంటుంది. దీనిని గమనించి బాదితులు వెంటనే అలర్ట్ అవ్వచ్చు.
♦డబ్బుకు సంబంధించి ధ్రువీకరణ పొందడానికి ఊహించని రిక్వెస్ట్‌లు పంపుతారు. ఇది ఇ–మెయిల్స్‌కు ఎక్కువ.
♦స్కామర్లు తరచుగా ‘ప్రైవేట్, గోప్యమైన, రహస్య‘ పదాలను ఉపయోగిస్తారు,
♦చాలాసార్లు స్కామర్లు మీ ఇన్ బాక్స్‌లోకి ప్రవేశించడానికి ఇ మెయిల్ స్పూఫింగ్ లేదా ఒకేలా కనిపించే ఇమెయిల్‌ను ఉపయోగిస్తారు.
ఇటీవలి కొత్త దాడులు
♦మోసగాళ్లు దొంగిలించిన ఉన్నతాధికారుల ఖాతాలను ఉపయోగించి ఆన్ లైన్ లో నకిలీ ఖాతాను సృష్టిస్తున్నారు. మోసగాళ్ళు వారి డిజిటల్ ప్రొఫైల్ (ఈ్క)ని ఎన్ ఫోర్స్‌మెంట్ అధికారి లేదా సీనియర్ బ్యూరోక్రాట్ చిత్రంతో సృష్టిస్తారు. స్కామర్ ఆ ఎన్ ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ లేదా బ్యూరోక్రాట్‌గా నటించి వారి బృందాలకు వాట్సప్ సందేశాలను పంపుతాడు.
♦వారు వారాంతపు పార్టీపై అవగాహన ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారు. మొత్తం డేటా సోషల్ మీడియా పోర్టల్‌ల నుండి సేకరిస్తారు.
♦స్కామర్ల కథనాలు కొద్దిగా మారవచ్చు కూడా. సాధారణంగా, వారు చట్టవిరుద్ధమైన డ్రగ్స్‌తో ప్యాక్ చేసిన పార్శిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మీకు చెప్తారు. ఇది బాధితుల పేరుతో కొరియర్ చేయబడింది, లేదా అక్రమ మాదకద్రవ్యాలతో చేసిన ప్యాక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు, కొరియర్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా సృష్టిస్తారు. అంతేకాదు, మాదకద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కోసం బాధితుడిని అరెస్టు చేయబోతున్నారని బెదిరించడం.
♦బాధితులు వారి ఇ మెయిల్‌లు, వాట్సాప్ సంభాషణలకు సరిగ్గా స్పందించకపోతే, స్కామర్లు మొత్తాలను చెల్లించనందుకు అరెస్టు చేయడానికి లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలుగా నటిస్తూ నకిలీ నోటీసులు పంపడం ద్వారా బాధితుడిని బెదిరించడం ప్రారంభిస్తారు. బాధితురాలికి బకాయిపడిన మొత్తంపై అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
♦దోపిడీలో భాగంగా, బాధితుడు తమకు చెల్లింపుగా డబ్బును బదిలీ చేయడానికి లేదా బాధితుడు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడని నిరూపించడానికి నకిలీ అధికారి పైన పేర్కొన్న కారణాన్ని చూపుతాడు. UPIని ఉపయోగించి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయమని చెబుతారు.
సోషల్ మీడియాలో మోసం జరిగితే..
Instagramలో అయితే https://help.instagram.com/ 370054663112398
YouTubeలో అయితే https://support.google.com/youtube/answer/2801947?hl=en
Facebookలో అయితే https://www.facebook.com/ help/contact/169486816475808
LinkedInలో అయితే https://www.linkedin.com/ help/linkedin/answer/61664/reporting-fake-profiles?lang=en రిపోర్ట్ చేయవచ్చు
సైబర్ క్రైమ్ పోర్టల్...
పరిస్థితి తీవ్రతను బట్టి జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ https://www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయచ్చు. మోసం చేయడానికి రకరకాల వేషాలు వేయడం, పరువు తీయడం లేదా మోసం చేయడం లేదా మోసం చేయాలనే ఉద్దేశ్యంతో తప్పుడు గుర్తింపు ఉండటం.. వంటివి నేరంగా ఈ పోర్టల్‌లో ఉంటుంది.
మోసగాళ్ల బారిన పడకుండా..
♦మీ ఖాతాలకు ప్రత్యేక, ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలతో సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి
♦(2FA) రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించండి.
♦లాక్/ గార్డ్ వంటివి మీ ప్రొఫైల్ ఫీచర్లకు ఉపయోగించండి.
♦సమాచార భాగస్వామ్యాన్ని నియంత్రించడానికి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం గోప్యతా సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయండి
♦సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు
♦అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి, https://isitphishing.org/తో లింక్‌ను ధృవీకరించండి.
♦నిజ జీవితంలో మీకు తెలిసిన, విశ్వసించే వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వండి.
♦ఆఫ్‌లైన్– ఆన్‌లైన్ అందరినీ ఒకే విధంగా పరిగణించాలి.
♦మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం GPS లొకేషన్ ఫీచర్‌కి యాక్సెస్ ఆపేయండి.
♦మీ ఆర్థిక లావాదేవీలను ఉపయోగించే సమయాల్లో రిక్వెస్ట్ చేయడం, రిప్లై ఇవ్వడం వంటివి చేసే ముందు మీ ఇమెయిల్ హెడర్‌లను కూడా చెక్ చేయడం అలవాటు చేసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment