సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గతేడాదితో పోలిస్తే సైబర్ నేరాలు 18 శాతం పెరిగాయన్నారు సీఐడీ డీజీ షికా గోయల్. దేశవ్యాప్తంగా లక్ష, తెలంగాణలో 19వేల కేసులు నమోదైనట్టు చెప్పారు. రాష్ట్రంలో సైబర్ నేరాల ద్వారా రూ.1866 కోట్లు దోచుకున్నట్టు వెల్లడించారు.
తెలంగాణలో ఈ ఏడాది సైబర్ నేరాలకు సంబంధించి రిపోర్టును సీఐడీ డీజీ షికా గోయల్ వెల్లడించారు. ఈ సందర్బంగా షికా గోయల్ మాట్లాడుతూ..‘గత ఏడాదితో పోలిస్తే 18% సైబర్ నేరాలు పెరిగాయి. ఈ క్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 1.14 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఏడాది సైబర్ క్రైమ్ ద్వారా 1866కోట్లను సైబర్ నేరస్థులు దోచుకున్నారు. సైబర్ నేరస్థుల నుంచి రూ.176కోట్లు రీ ఫండ్ చేశాము. పలు కేసులకు సంబంధించి 1057 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశాం. దేశ వ్యాప్తంగా లక్షకు పైగా సైబర్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 19వేల కేసులు ఫైల్ అయ్యాయి. తెలంగాణలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాధితులు ఈ జిల్లాల నుంచే ఎక్కువగా ఉన్నారు’ అని తెలిపారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో సైబర్ నేరగాళ్ల భారతం పడుతోంది TGCSB. మ్యూల్ ఖాతాలపై ఉక్కుపాదం మోపింది. బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో 21 మంది సైబర్ కేటుగాళ్లను పట్టుకున్నారు. అలాగే, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ఏజెంట్స్‌ను అరెస్ట్ చేశారు. వీరంతా తెలంగాణ, రాజస్థాన్‌లో భారీ ఆపరేషన్లు జరుపుతున్నట్టు గుర్తించారు. అరెస్ట్ సందర్భంగా వీరి వద్ద నుంచి 20 మొబైల్స్, నాలుగు బ్యాంక్ పాస్ బుక్స్, ఐదు డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక, వీరికి దేశవ్యాప్తంగా వీరికి 714 మంది క్రిమినల్స్‌తో లింక్ ఉన్నట్టు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment