పంథా మార్చుకున్న జాబ్‌ఫ్రాడ్ నేరగాళ్లు
పార్ట్‌టైం జాబ్స్‌కు సెక్యూరిటీ డిపాజిట్ల పేరిట గతంలో అమాయకులను దోచుకున్న కేటుగాళ్లు
తాజాగా ఆన్‌లైన్ ‘టాస్క్’ల పేరిట పనులు చేయించుకొని వారి ప్రతిఫలాన్ని కాజేస్తున్న వైనం
టెలిగ్రామ్ గ్రూపుల కేంద్రంగా సాగుతున్న వ్యవహారం
అప్రమత్తంగా ఉండాలంటున్న ఎన్సీఎస్సార్సీ డైరెక్టర్
సాక్షి, హైదరాబాద్ : పార్ట్‌టైం, ఫుల్‌టైం, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల పేరిట అమాయకులకు సోషల్ మీడియా ద్వారా ఎర వేసి సెక్యూరిటీ డిపాజిట్, ఇతర ఖర్చుల పేరుతో అందినకాడికి దండుకుంటూ వచి్చన జాబ్‌ఫ్రాడ్ నేరగాళ్లు ఇటీవల పంథా మార్చారు. బాధితులతో ‘టాస్‌్క’ల పేరిట ఆన్‌లైన్‌లో పనులు చేయించుకొని అందుకు ప్రతిఫలంగా చెల్లించాల్సిన మొత్తాన్ని కాజేస్తున్నారు.
విద్యార్థులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలే టార్గెట్...
పార్ట్‌టైం, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలకు విద్యార్థులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తారని గ్రహించిన జాబ్‌ఫ్రాడ్ నేరగాళ్లు ప్రధానంగా వారినే తమ మోసాలకు ఎంచుకుంటున్నారు. ఉద్యోగార్థుల వివరాలను జాబ్ పోర్టల్స్‌తోపాటు లక్కీ డిప్‌ల పేరిట ప్రజల వివరాలు సేకరించే ఏజెన్సీల నుంచి కొంటున్నారు. ఈ డేటా ఆధారంగా ఆయా ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా బల్క్ మెసేజ్‌లు పంపుతున్నారు. తమ సందేశాలకు స్పందించే వారిని మోసగించే స్కెచ్‌ను కేటుగాళ్లు పక్కాగా అమలు చేస్తున్నారు.
రివ్యూలు, రేటింగ్స్ ఇస్తే డబ్బిస్తామని ఆశజూపి..
వినియోగదారుల ప్రమేయం లేకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలకు కమీషన్‌పై భారీ రేటింగ్స్, పాజిటివ్ రివ్యూలు ఇచ్చే ఏజెన్సీలతో జాబ్‌ఫ్రాడ్ నేరగాళ్లు లింకులు పెట్టుకుంటున్నారు. తమ సందేశాలకు స్పందించిన అమాయకులతో ఆయా షాపింగ్, రెస్టారెంట్ సంస్థల యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. వాటికి రేటింగ్, రివ్యూలు (టాస్‌్కలు) ఇచ్చి ఆ స్క్రీన్ షాట్స్‌ను పంపాలని కోరుతున్నారు. అలా తొలి ‘టాస్‌్క’పూర్తి చేసిన బాధితులకు రూ. 240 వెంటనే వారికి బదిలీ చేస్తున్నారు. అనంతరం వారిని మరింతగా ఉచ్చులోకి లాగేందుకు వీలుగా తమ అనుచరులతో కూడిన ‘టెలిగ్రామ్’గ్రూపుల్లో చేర్చి ఇతరుల సక్సెస్ స్టోరీస్ పేరిట పోస్టింగ్స్ పెట్టిస్తున్నారు.
ప్రత్యేక యాప్స్ డౌన్‌లోడ్ చేయించి...
ఆ తర్వాత అసలు కథ మొదలుపెట్టే నేరగాళ్లు బాధితులతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన వర్చువల్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు నగదు బదిలీ చేస్తే రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇబ్బందులు వస్తున్నాయని.. అందువల్ల ఆ మొత్తాన్ని ఈ యాప్స్‌లో జమ చేస్తామని నమ్మిస్తున్నారు. నిర్ణిత సమయం తర్వాత సొమ్ము డ్రా చేసుకోవచ్చని చెప్పి రకరకాల ‘టాస్‌్క’లు చేయించుకుంటున్నారు. కానీ ఆయా ‘టాస్‌్క’లకు సంబంధించిన నగదును ఎప్పటికప్పుడు ఏజెన్సీల నుంచి తీసేసుకుంటూ... యాప్స్‌లోని బాధితుల ఖాతాల్లో మాత్రం డబ్బు జమ అయినట్లు వర్చువల్‌గా చూపిస్తున్నారు. మొత్తం రూ. 2 లక్షలు దాటాకే డ్రా చేసుకోవడానికి వీలవుతుందని నమ్మబలకడంతోపాటు మరికొంత బోనస్ సొమ్మును కూడా బాధితులకు వర్చువల్‌గా చూపిస్తున్నారు.
వెంటనే డబ్బు కావాలంటే కొంత కట్టమంటూ
వర్చువల్ యాప్స్‌లోని సొమ్ము రూ. 10 లక్షలు దాటాకే విత్‌డ్రాకు వీలవుతుందంటూ కొత్త కథ అల్లుతున్న కేటుగాళ్లు.. ఆ మొత్తాన్ని తక్షణమే తీసుకోవాలంటే కొంత డబ్బు డిపాజిట్ చేయాలని కోరుతున్నారు. వర్చువల్ యాప్స్‌లో భారీ మొత్తం కనిపిస్తుండటంతో నేరగాళ్లు కోరిన సొమ్మును అమాయకులు చెల్లిస్తున్నారు. అలా వందలు, వేలాది మంది బాధితుల నుంచి భారీ మొత్తం కొల్లగొట్టాక నేరగాళ్లు ఆయా సోషల్ మీడియా గ్రూపులతోపాటు వర్చువల్ యాప్స్‌ను కనుమరుగు చేస్తున్నారు.
చిన్న మొత్తాలను ఇచ్చి, భారీ మొత్తాలను కాజేసే సైబర్ నేరగాళ్లను నమ్మొద్దు. జాబ్స్, టాస్‌్కలంటూ ప్రకటనలు ఇచ్చే వాళ్లు అందుకు నగదు చెల్లించకుండా ఎదు రు డబ్బు అడుగుతున్నారంటూ అది మోసమని గ్రహించాలి. ఇలాంటి మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ ఇ.కాళీరాజ్ నాయుడు (నేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ డైరెక్టర్)
Comments
Please login to add a commentAdd a comment