Security deposits
-
‘టాస్క్’ల పేరుతో టోపీ!
సాక్షి, హైదరాబాద్ : పార్ట్‌టైం, ఫుల్‌టైం, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల పేరిట అమాయకులకు సోషల్ మీడియా ద్వారా ఎర వేసి సెక్యూరిటీ డిపాజిట్, ఇతర ఖర్చుల పేరుతో అందినకాడికి దండుకుంటూ వచి్చన జాబ్‌ఫ్రాడ్ నేరగాళ్లు ఇటీవల పంథా మార్చారు. బాధితులతో ‘టాస్్క’ల పేరిట ఆన్లైన్లో పనులు చేయించుకొని అందుకు ప్రతిఫలంగా చెల్లించాల్సిన మొత్తాన్ని కాజేస్తున్నారు. విద్యార్థులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలే టార్గెట్...పార్ట్‌టైం, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలకు విద్యార్థులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తారని గ్రహించిన జాబ్‌ఫ్రాడ్ నేరగాళ్లు ప్రధానంగా వారినే తమ మోసాలకు ఎంచుకుంటున్నారు. ఉద్యోగార్థుల వివరాలను జాబ్ పోర్టల్స్‌తోపాటు లక్కీ డిప్ల పేరిట ప్రజల వివరాలు సేకరించే ఏజెన్సీల నుంచి కొంటున్నారు. ఈ డేటా ఆధారంగా ఆయా ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా బల్క్ మెసేజ్‌లు పంపుతున్నారు. తమ సందేశాలకు స్పందించే వారిని మోసగించే స్కెచ్‌ను కేటుగాళ్లు పక్కాగా అమలు చేస్తున్నారు. రివ్యూలు, రేటింగ్స్ ఇస్తే డబ్బిస్తామని ఆశజూపి.. వినియోగదారుల ప్రమేయం లేకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్లైన్ షాపింగ్ సంస్థలకు కమీషన్‌పై భారీ రేటింగ్స్, పాజిటివ్ రివ్యూలు ఇచ్చే ఏజెన్సీలతో జాబ్‌ఫ్రాడ్ నేరగాళ్లు లింకులు పెట్టుకుంటున్నారు. తమ సందేశాలకు స్పందించిన అమాయకులతో ఆయా షాపింగ్, రెస్టారెంట్ సంస్థల యాప్స్‌ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. వాటికి రేటింగ్, రివ్యూలు (టాస్్కలు) ఇచ్చి ఆ స్క్రీన్ షాట్స్‌ను పంపాలని కోరుతున్నారు. అలా తొలి ‘టాస్్క’పూర్తి చేసిన బాధితులకు రూ. 240 వెంటనే వారికి బదిలీ చేస్తున్నారు. అనంతరం వారిని మరింతగా ఉచ్చులోకి లాగేందుకు వీలుగా తమ అనుచరులతో కూడిన ‘టెలిగ్రామ్’గ్రూపుల్లో చేర్చి ఇతరుల సక్సెస్ స్టోరీస్ పేరిట పోస్టింగ్స్ పెట్టిస్తున్నారు. ప్రత్యేక యాప్స్ డౌన్లోడ్ చేయించి... ఆ తర్వాత అసలు కథ మొదలుపెట్టే నేరగాళ్లు బాధితులతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన వర్చువల్ యాప్స్‌ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు నగదు బదిలీ చేస్తే రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇబ్బందులు వస్తున్నాయని.. అందువల్ల ఆ మొత్తాన్ని ఈ యాప్స్‌లో జమ చేస్తామని నమ్మిస్తున్నారు. నిర్ణిత సమయం తర్వాత సొమ్ము డ్రా చేసుకోవచ్చని చెప్పి రకరకాల ‘టాస్్క’లు చేయించుకుంటున్నారు. కానీ ఆయా ‘టాస్్క’లకు సంబంధించిన నగదును ఎప్పటికప్పుడు ఏజెన్సీల నుంచి తీసేసుకుంటూ... యాప్స్‌లోని బాధితుల ఖాతాల్లో మాత్రం డబ్బు జమ అయినట్లు వర్చువల్‌గా చూపిస్తున్నారు. మొత్తం రూ. 2 లక్షలు దాటాకే డ్రా చేసుకోవడానికి వీలవుతుందని నమ్మబలకడంతోపాటు మరికొంత బోనస్ సొమ్మును కూడా బాధితులకు వర్చువల్‌గా చూపిస్తున్నారు. వెంటనే డబ్బు కావాలంటే కొంత కట్టమంటూవర్చువల్ యాప్స్‌లోని సొమ్ము రూ. 10 లక్షలు దాటాకే విత్‌డ్రాకు వీలవుతుందంటూ కొత్త కథ అల్లుతున్న కేటుగాళ్లు.. ఆ మొత్తాన్ని తక్షణమే తీసుకోవాలంటే కొంత డబ్బు డిపాజిట్ చేయాలని కోరుతున్నారు. వర్చువల్ యాప్స్‌లో భారీ మొత్తం కనిపిస్తుండటంతో నేరగాళ్లు కోరిన సొమ్మును అమాయకులు చెల్లిస్తున్నారు. అలా వందలు, వేలాది మంది బాధితుల నుంచి భారీ మొత్తం కొల్లగొట్టాక నేరగాళ్లు ఆయా సోషల్ మీడియా గ్రూపులతోపాటు వర్చువల్ యాప్స్‌ను కనుమరుగు చేస్తున్నారు.చిన్న మొత్తాలను ఇచ్చి, భారీ మొత్తాలను కాజేసే సైబర్ నేరగాళ్లను నమ్మొద్దు. జాబ్స్, టాస్్కలంటూ ప్రకటనలు ఇచ్చే వాళ్లు అందుకు నగదు చెల్లించకుండా ఎదు రు డబ్బు అడుగుతున్నారంటూ అది మోసమని గ్రహించాలి. ఇలాంటి మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ ఇ.కాళీరాజ్ నాయుడు (నేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ డైరెక్టర్) -
డిపాజిట్లు కోల్పోయిన వారు ఎందరంటే?
ఎన్నికల్లో పోటీ చేయాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి వచ్చిన మొత్తం ఓట్లలో ఆరోవంతు ఓట్లు ఓడిన అభ్యర్థికి వస్తేనే సెక్యూరిటీ డిపాజిట్ రిటర్న్ చేస్తారు. ఆరోవంతు ఓట్లు సాధించకుంటే.. వారు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ డబ్బు కోల్పోతారు. భారతదేశంలో ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది డిపాజిట్ కోల్పోయారు అనే విషయం ఈ కథనంలో చూసేద్దాం.. మొదటి లోక్‌సభ ఎన్నికల జరిగినప్పటి నుంచి పోటీ చేసిన మొత్తం 91,160 మంది అభ్యర్థులలో 71,246 మంది తమ సెక్యూరిటీ డిపాజిట్‌ను కోల్పోయారు. 1951లో సాధారణ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 250 సెక్యూరిటీ చెయ్యాల్సి ఉండేది. అది ఇప్పుడు రూ. 25000 (జనరల్), రూ. 12500 (ఎస్సీ/ఎస్టీ)కు చేరింది. 2019 ఎన్నికల్లో BSP పార్టీ ఎక్కువగా డిపాజిట్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో నిలబడిన మొత్తం 383 మంది అభ్యర్థుల్లో 345 మంది డిపాజిట్స్ కోల్పోయారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ 421 మందిలో 148 మంది డిపాజిట్స్ కోల్పోయారు. బీజేపీ 69 మంది అభ్యర్థుల్లో 51 మంది, సీపీఐ 49 మంది అభ్యర్థుల్లో 41 మంది డిపాజిట్లు కోల్పోయినట్లు సమాచారం. 1951-52లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికలలో దాదాపు 40 శాతం మంది డిపాజిట్స్ కోల్పోయారు. అంటే 1,874 మంది అభ్యర్థుల్లో 745 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయే ట్రెండ్ భారీగా పెరిగింది. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో 91 శాతం, అంటే.. 13,952 మంది అభ్యర్థుల్లో 12,688 మంది డిపాజిట్లు కోల్పోయారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వ్యవస్థాపక సభ్యుడు, ట్రస్టీ జగదీప్ ఎస్ చోకర్ డిపాజిటల్స్ కోల్పోవడం గురించి మాట్లాడుతూ.. సమాజంలోని కొన్ని వర్గాలకు డబ్బు ప్రధానం కాదు. సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయినప్పటికీ చాలా మంది పోటీ పడటానికి ప్రాథమిక కారణం అది పెద్ద మొత్తం కాకపోవడం అని పేర్కొన్నారు. -
ఎయిర్‌సెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా)ఎయిర్‌సెల్ వినియోగదారులకు ఊరటనిచ్చింది. ఎయిర్‌సెల్ కస్టమర్లకు చెందిన బ్యాలెన్స్ నగదును, సెక్యూరిటీ డిపాజిట్లను తిరిగి చెల్లించాలని ఎయిర్‌సెల్‌ను ఆదేశించింది. ఈ విషయంలో వినియోగదారుల ఫిర్యాదులపై స్పందించిన ట్రాయ్ ఈ ఆదేశాలిచ్చింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ చందాదారులకు చెందిన బకాయిలు చెల్లించాలని పేర్కొంది. మార్చి 1 , 2017నుంచి మార్చి 18 2018 మధ్య ఈ చెల్లింపులు చేయాలని ఆదేశించింది. అంతేకాదు ఈ చెల్లింపులకు సంబంధించి ప్రాంతాల వారీగా పూర్తి రిపోర్టును మే 10లోపు అందించాలని కూడా కోరింది. ఎయిర్‌సెల్ గ్రూప్ ఖాతాదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని ట్రాయ్ తెలిపింది. టెలికాం చందాదారుల ప్రయోజనాన్ని కాపాడే క్రమంలో ఈ అదేశాలు జారీ చేసినట్టు వెల్లడించింది. ఎయిర్‌సెల్‌నుంచి పోర్ట్ అయిన ఖాతాలకు రీఫండ్ మొత్తాన్ని క్రెడిట్ చేయాలని, ఈ సమాచారాన్ని వారికి ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారులకు తెలియజేయాలని కోరింది. -
పాతిక లక్షలు కతికేశారు..
పిఠాపురం, న్యూస్‌లైన్ :ఎన్నికైన పురపాలకులూ లేరు. ఆర్థిక విషయాలను చూడాల్సిన కీలక స్థానాల్లో అర్హులైన ఉద్యోగులూ లేరు. ఇంకేముంది- పిఠాపురం మున్సిపాలిటీలోని అవినీతిపరులైన అధికారులకు పంట పండింది. పురపాలక సంఘం పరిధిలో జరిగే వివిధ పనులకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్లు, వ్యాట్, ఇన్‌కం ట్యాక్స్‌ల నిమిత్తం కాంట్రాక్టర్ల నుంచి కట్టించుకున్న సొమ్మును రూ.25 లక్షల వరకూ స్వాహా చేసేశారు. కొందరు అధికారులు కలిసి పాల్పడిన స్వాహాపర్వం బయటకు పొక్కడంతో తమ పై అధికారులకు ముడుపులు ముట్టజెప్పీ, ఆయా ఖాతాల్లో నామమాత్రపు మొత్తాలు జమ చేసీ తాము బయట పడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి విశ్వసనీయంగా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. సాధారణంగా మున్సిపాలిటీ పరిధిలో ఏ విభాగానికి సంబంధించి ఏ పని చేపట్టినా.. సంబంధిత కాంట్రాక్టర్ నుంచి ఆ పని విలువలో 7.5 శాతం సెక్యూరిటీ డిపాజిట్‌గా, 5 శాతం ఁవ్యాట్రూ.గా, 2.5 శాతం ఇన్‌కం ట్యాక్స్‌గా వసూలు చేస్తారు. ఈ సొమ్ము డీడీలు, చెక్కులుగా ఆయా విభాగాల ఖాతాల్లో జమ చేయాలి. పిఠాపురం మున్సిపాలిటీలో పది మంది క్లాస్ వన్ కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరికి ఏ పని కేటాయించినా.. ఈ పని విలువలో 7.5 శాతం సెక్యూరిటీ డిపాజిట్‌గా కట్టించుకుని, ఆ పని సక్రమంగా, నాణ్యంగా పూర్తయిందని నిర్ధారణ అయ్యాక తిరిగి చెల్లిస్తారు. అలాగే వ్యాట్, ఇన్‌కం ట్యాక్స్‌లుగా వసూలు చేసిన మొత్తాన్ని మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు వెచ్చించాలి. అయితే 2005 నుంచి మున్సిపాలిటీ పరిధిలో ఇలా సేకరించిన సెక్యూరిటీ డిపాజిట్లు రూ.11 లక్షలు మేరకు, వ్యాట్ రూ.10 లక్షల మేరకు, ఇన్‌కం ట్యాక్స్ రూ.4 లక్షల మేరకు కొందరు అధికారులు సొంత అవసరాలకు యథేచ్ఛగా వాడుకున్నారు. ఆర్థిక వ్యవహారాాలను చూసే స్థానాల్లో అర్హులైన వారు లేకపోవడంతో వారి పని సునాయాసమైంది. పనులు పూర్తయ్యాక కాంట్రాక్టర్లకు సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాల్ని తిరిగి చెల్లించకపోయినా..వారు మున్సిపాలిటీలో తాము తిరిగి కొత్త పనులను చేపడుతూనే ఉంటాము గనుక.. ఎప్పటికో అప్పటికి వస్తాయి కదా అన్న భావనతో ఉండిపోయారు. మొత్తం మీద అన్నిరకాలుగా రూ.25 లక్షలను ఆయా ఖాతాల నుంచి నగదుగా డ్రా చేసి దారి మళ్లించిన ఆ నలుగురు అధికారులూ ఇప్పుడు విషయం బయటకు పొక్కడంతో.. తమపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు పై అధికారులకు ముడుపులు ముట్టజెపుతున్నారని సమాచారం. అంతేకాక ఆయా విభాగాల ఖాతాల్లో నామమాత్రంగా రూ.3 లక్షలు జమచేసి అంతా సక్రమంగా ఉన్నట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అనర్హులకు పగ్గాలతో.. కళ్లేలు తెంచుకున్న అవినీతి.. కాగా మున్సిపాలిటీలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ ఉద్యోగిని అర్హత లేకున్నా 2008లో రెవెన్యూ విభాగంలో కీలకమైన పోస్టులో నియమించిన నాటి నుంచి సొమ్ములు దారి మళ్లడం జోరందుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో రికార్డు అసిస్టెంట్‌ను ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మరో కీలక స్థానంలోనియమించడం కూడా ఈ కుంభకోణానికి దోహదపడినట్టు చెపుతున్నారు. మున్సిపాలిటీ అక్కౌంటెంటుగా 2013 జూన్ 14నే పద్మజ్యోతి బాధ్యతలు చేపట్టినా ఆ ఉద్యోగులిద్దరూ తమ వద్ద ఉన్న రికార్డులు అప్పగించక పోవడం గమనార్హం. అయినా కమిషనర్ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా.. మున్సిపాలిటీలో నిధులు దారి మళ్లినట్టు వచ్చిన ఆరోపణల గురించి కమిషనర్ బి.రాముని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. ఆరోపణలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఆర్ఐ, షరాబులు కొత్తగా వచ్చిన అక్కౌంటెంటుకు రికార్డులు అప్పగించక పోవడం వాస్తవమేనన్నారు.