ఎన్నికల్లో పోటీ చేయాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి వచ్చిన మొత్తం ఓట్లలో ఆరోవంతు ఓట్లు ఓడిన అభ్యర్థికి వస్తేనే సెక్యూరిటీ డిపాజిట్ రిటర్న్ చేస్తారు. ఆరోవంతు ఓట్లు సాధించకుంటే.. వారు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ డబ్బు కోల్పోతారు. భారతదేశంలో ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది డిపాజిట్ కోల్పోయారు అనే విషయం ఈ కథనంలో చూసేద్దాం..
మొదటి లోక్‌సభ ఎన్నికల జరిగినప్పటి నుంచి పోటీ చేసిన మొత్తం 91,160 మంది అభ్యర్థులలో 71,246 మంది తమ సెక్యూరిటీ డిపాజిట్‌ను కోల్పోయారు. 1951లో సాధారణ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 250 సెక్యూరిటీ చెయ్యాల్సి ఉండేది. అది ఇప్పుడు రూ. 25000 (జనరల్), రూ. 12500 (ఎస్సీ/ఎస్టీ)కు చేరింది.
2019 ఎన్నికల్లో BSP పార్టీ ఎక్కువగా డిపాజిట్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో నిలబడిన మొత్తం 383 మంది అభ్యర్థుల్లో 345 మంది డిపాజిట్స్ కోల్పోయారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ 421 మందిలో 148 మంది డిపాజిట్స్ కోల్పోయారు. బీజేపీ 69 మంది అభ్యర్థుల్లో 51 మంది, సీపీఐ 49 మంది అభ్యర్థుల్లో 41 మంది డిపాజిట్లు కోల్పోయినట్లు సమాచారం.
1951-52లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికలలో దాదాపు 40 శాతం మంది డిపాజిట్స్ కోల్పోయారు. అంటే 1,874 మంది అభ్యర్థుల్లో 745 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయే ట్రెండ్ భారీగా పెరిగింది. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో 91 శాతం, అంటే.. 13,952 మంది అభ్యర్థుల్లో 12,688 మంది డిపాజిట్లు కోల్పోయారు.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వ్యవస్థాపక సభ్యుడు, ట్రస్టీ జగదీప్ ఎస్ చోకర్ డిపాజిటల్స్ కోల్పోవడం గురించి మాట్లాడుతూ.. సమాజంలోని కొన్ని వర్గాలకు డబ్బు ప్రధానం కాదు. సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయినప్పటికీ చాలా మంది పోటీ పడటానికి ప్రాథమిక కారణం అది పెద్ద మొత్తం కాకపోవడం అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment