ఎయిర్‌సెల్(ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా)ఎయిర్‌సెల్ వినియోగదారులకు ఊరటనిచ్చింది. ఎయిర్‌సెల్ కస్టమర్లకు చెందిన బ్యాలెన్స్ నగదును, సెక్యూరిటీ డిపాజిట్లను తిరిగి చెల్లించాలని ఎయిర్‌సెల్‌ను ఆదేశించింది. ఈ విషయంలో వినియోగదారుల ఫిర్యాదులపై స్పందించిన ట్రాయ్ ఈ ఆదేశాలిచ్చింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ చందాదారులకు చెందిన బకాయిలు చెల్లించాలని పేర్కొంది. మార్చి 1 , 2017నుంచి మార్చి 18 2018 మధ్య ఈ చెల్లింపులు చేయాలని ఆదేశించింది. అంతేకాదు ఈ చెల్లింపులకు సంబంధించి ప్రాంతాల వారీగా పూర్తి రిపోర్టును మే 10లోపు అందించాలని కూడా కోరింది.
ఎయిర్‌సెల్ గ్రూప్ ఖాతాదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని ట్రాయ్ తెలిపింది. టెలికాం చందాదారుల ప్రయోజనాన్ని కాపాడే క్రమంలో ఈ అదేశాలు జారీ చేసినట్టు వెల్లడించింది. ఎయిర్‌సెల్‌నుంచి పోర్ట్ అయిన ఖాతాలకు రీఫండ్ మొత్తాన్ని క్రెడిట్ చేయాలని, ఈ సమాచారాన్ని వారికి ఎస్‌ఎంఎస్ ద్వారా వినియోగదారులకు తెలియజేయాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment