Tamannaah Bhatia and Vijay Varma Hold Hands on a Date in Mumbai - Sakshi
Sakshi News home page

Tamannaah-Vijay Varma: ముంబయిలో మెరిసిన లవ్‌బర్డ్స్.. పెళ్లి చేసుకోమంటున్న నెటిజన్స్!

Published Mon, Jul 31 2023 6:31 PM | Last Updated on Mon, Jul 31 2023 6:49 PM

Tamannaah Bhatia and Vijay Varma hold hands on a date in Mumbai - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ  కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ కలిసి నటించిన 'లస్ట్‌ స్టోరీస్‌ 2' ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ జంట పీకల్లోతు ప్రేమలో ఉన్నట్ తెలుస్తోంది. ఇటీవలే విజయ్ సైతం బహిరంగంగానే చెప్పాడు. తామిద్దరూ డేటింగ్‌లో ఉన్నామని ఇప్పుడు తనకు బాగా అర్థమవుతోందన్నాడు.

(ఇది చదవండి: ఇది నాకు మరో జన్మ.. అస్సలు భయపడను: సుస్మితా సేన్)

అయితే తాజాగా ఈ ప్రేమజంట ముంబయిలో తళుక్కున మెరిశారు. ఈ లవ్‌బర్డ్స్‌ను ఒకరినొకరు చేతులు పట్టుకుని కెమెరాల కంటికి చిక్కారు. ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ జంట కారులో వెళ్తూ చాలా ఉత్సాహంగా అభిమానులను పలకరించారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ జంట ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

ఒక అభిమాని రాస్తూ.. "మీ జంట చాలా ఫర్‌ఫెక్ట్‌గా కనిపిస్తోంది. దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి అని రాయగా.. మరొకరు వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉన్నారంటూ వ్యాఖ్యానించాడు. మరో నెటిజన్స్ రాస్తూ ఈ జంట చాలా అందంగా కనిపిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా.. గత కొంతకాలంగా డేటింగ్‌లో ఈ జంట తొలిసారిగా  లస్ట్ స్టోరీస్- 2లో  కలిసి నటించారు.

కాగా.. ఇటీవలే ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నానంటూ.. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నానని తమన్నాతో రిలేషన్‌షిప్‌పై మాట్లాడారు. ఆమె రాకతో తన జీవితంలో విలన్‌ దశ ముగిసిపోవడమే కాకుండా రొమాంటిక్‌ దశ మొదలైందని చెప్పాడు. తమన్నా భాటియాను పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వస్తున్న వార్తలపై విజయ్ వర్మ పలు విషయాలు వెల్లడించాడు.

(ఇది చదవండి: తమన్నాతో పెళ్లి.. వారింట్లో నుంచి విజయ్‌పై పెరుగుతున్న ఒత్తిడి )

కాగా.. సినిమాల విషయానికొస్తే.. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం జైలర్‌లో రజనీకాంత్‌ సరసన నటిస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణన్, యోగి బాబు, వసంత్ రవి, వినాయకన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  విజయ్ వర్మ ఇటీవలే శ్వేతా త్రిపాఠి శర్మ సరసన కల్‌కూట్‌లో కనిపించాడు. సుమిత్ సక్సేనా దర్శకత్వం వహించిన కాల్‌కూట్‌లో యశ్‌పాల్ శర్మ, గోపాల్ దత్, సీమా బిస్వాస్ కూడా నటించారు. ఆ తర్వాత సుజోయ్ ఘోష్ తెరకెక్కిస్తోన్న థ్రిల్లర్‌లో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement