Tamanna TROLLED For Steamy Kissing Scene With Vijay Varma In Lust Stories 2 - Sakshi
Sakshi News home page

Tamanna: 'ఇండియన్ కల్చర్‌ను నాశనం చేస్తున్నారు'.. తమన్నాపై నెటిజన్స్ ఫైర్!

Jun 27 2023 7:58 PM | Updated on Jun 27 2023 9:08 PM

Tamanna TROLLED For Steamy Kissing Scene With Vijay Varma In Lust Stories 2 - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ఇటీవలే 'జీ కర్దా' సిరీస్‌తో ఫుల్ రొమాంటిక్‌ సీన్స్‌తో నటించిన ముద్దుగుమ్మ.. మరోసారి లస్ట్ స్టోరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సిరీస్‌లో తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి నటించింది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ కాగా.. తమన్నా ఈసారి మరింత బోల్డ్ సీన్స్‌లో నటించినట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: జెట్ స్పీడ్‌లో శ్రీలీల కెరీర్.. ఆ అంశాలే కలిసొచ్చాయా?)

ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా  తాజాగా దీనికి సంబంధించిన ఓ ప్రోమోను రిలీజ్ చేసింది తమన్నా. అందులో తమన్నా మాట్లాడుతూ.. ఇందులో అమ్మ, నాన్నతో పాటు అందరి ప్రేమ ఉంది. లస్ట్ స్టోరీస్ జూన్ 29న నెట్‌ఫ్లిక్స్‌కు రాబోతోంది' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రోమో ప్రారంభంలోనే తమన్నా.. విజయ్‌తో బోల్ట్ సీన్‌ను చూపించారు. అందులో తమన్నా ముద్దుపెడుతున్న సీన్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇప్పటి వరకు తమన్నా ఇలాంటి సీన్స్ చూడలేదని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కొందరేమో మీరు 'భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు' అంటూ కామెంట్స్ చేశారు. 'నిన్ను ఇలా చూస్తున్నందుకు సిగ్గు పడుతున్నాం' అంటూ పోస్ట్ చేశాడు. మీరు సీ గ్రేడ్ నటులతో ఇలాంటి సీన్స్ ఎలా చేస్తారంటూ మరో నెటిజన్ మండిపడ్డారు. మరొకరు రాస్తూ.. 'తమన్నా దయచేసి కోలీవుడ్, టాలీవుడ్‌కి తిరిగి వచ్చేయండి' విజ్ఞప్తి చేయగా.. ఇలాంటి వాటితో మీ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతోందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. కాగా.. లస్ట్ స్టోరీస్-2 ఈనెల 29న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 

(ఇది చదవండి: ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతు డైలాగ్ ఎందుకు పెట్టారో?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement