ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సరికొత్త వెబ్ సిరీస్ 'ఐసీ 814: కాందహార్ హైజాక్'. ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సిరీస్‌లోని కొన్ని సన్నివేశాలపై పెద్దఎత్తున వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే సిరీస్‌పై మండిపడ్డ కేంద్రం వివరణ ఇవ్వాలంటూ మేకర్స్‌కు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ వివాదంపై నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ కేంద్ర, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారుల ముందు హాజరయ్యారు.
ఇకపై కంటెంట్ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కంటెంట్‌ను ప్రసారం చేస్తామని హామీ ఇచ్చారు. చిన్నారులకు సంబంధించిన కంటెంట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని ఓటీటీ సంస్థ అంగీకరించింది.
అసలేంటీ వివాదం..
1999లో భారత విమానాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసిన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్‌లో హైజాకర్ల పేర్లను శంకర్, భోలా అని మార్చి చూపించడమే కాకుండా.. వారిని మానవత్వమున్న వ్యక్తులుగా చిత్రీకరించారు. దీంతో హైజాకర్లు తమ మత గుర్తింపు దాచిపెట్టేందుకే మారుపేర్లు పెట్టుకున్నారని.. ఈ సిరీస్ రూపొందించిన వారు కావాలనే ఆ పేర్లనే క్యారెక్టర్స్‌కు పెట్టారని భాజపా ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. ఈ క్రమంలోనే కేంద్రం దీన్ని తీవ్రంగా పరిగణించి సమన్లు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment