Tamanna Revealed Why She Had To Cancel Her First Day Of Shoot For Lust Stories 2, Deets Inside - Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: విజయ్ ఫస్ట్ ఇంప్రెషన్ అదే.. చెప్పేసిన మిల్కీ బ్యూటీ!

Published Thu, Jun 22 2023 3:38 PM | Last Updated on Thu, Jun 22 2023 4:17 PM

Tamanna Revealed she had to cancel her first day shoot for Lust Stories 2 - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ జంటగా లస్ట్ స్టోరీస్‌-2 వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ జంట సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో తమన్నా, విజయ్ వర్మ రొమాంటిక్ సీన్స్‌ మరింత బోల్డ్‌గా ఉన్నాయంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి.

(ఇది చదవండి: హద్దులు దాటేస్తున్న తమన్నా.. 'లస్ట్ స్టోరీస్ 2'లో కూడా!)

ప్రస్తుతం లస్ట్‌ స్టోరీస్‌-2 ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సిరీస్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా లస్ట్ స్టోరీస్-2 లో మొదటి రోజు షూటింగ్ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో తమన్నా భాటియా వెల్లడించింది. అంతే కాకుండా విజయ్ వర్మ ఫస్ట్ ఇంప్రేషన్‌పై నోరు విప్పింది. తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో షూటింగ్‌కి హాజరు కాలేకపోయానని తమన్నా తెలిపింది. అయితే విజయ్ వర్మ మాత్రం  తాను ఈ సిరీస్ పట్ల భయంగా ఉన్నట్లు భావించాడని పేర్కొంది.  

తమన్నా మాట్లాడుతూ.. 'తాను ఏడెనిమిది రోజులు షూట్ చేశా. కానీ ఇది చాలా కఠినంగా అనిపించింది. మొదటి రోజు షూట్‌ను రద్దు చేసుకున్నప్పుడు ఈ సిరీస్ పట్ల తాను భయంగా, పిరికితనంగా ఉన్నట్లు విజయ్ భావించాడు. కానీ నేను ఓ పవర్‌ఫుల్ నటుడితో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని భావించా. అంతే కాదు విజయ్ కూడా ఓ ఊసరవెల్లి. తనకు నిర్ధిష్టమైన పాత్ర కోసం ఎలాగైనా మారతాడు. నేను అతని పనిని గతంలో కూడా చూశా. .' అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది.

కాగా.. ఈ వెబ్ సిరీస్‌లో నీనా గుప్తా, కాజోల్, మృణాల్ ఠాకూర్, అమృత శుభాష్, అంగద్ బేడీ, కుముద్ మిశ్రా, తిల్లోతమా షోమే ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సిరీస్‌ను కొంకణా సేన్ శర్మ, ఆర్ బాల్కీ, అమిత్ రవీందర్నాథ్ శర్మ, సుజోయ్ ఘోష్ నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ ఈనెల 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ సిరీస్‌లోనే తమన్నా, విజయ్ ప్రేమలో పడ్డారు. 

(ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్‌'.. ఆ రెండు మినహాయిస్తే: రామాయణ నటుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement