మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది జైలర్ మూవీలో స్పెషల్ సాంగ్‌తో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది. అంతే కాకుండా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌తో అలరించింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ.. అరణ్మణై- 4 అనే తమిళ చిత్రంతో పాటు స్ట్రీ-2 అనే మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉండగా గతేడాది తమన్నా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మను అభిమానులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వీరిద్దరు పెళ్లి గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమన్నాతో డేటింగ్ ఎప్పుడు ప్రారంభించారనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
విజయ్ వర్మ మాట్లాడుతూ..' తమన్నా, నేను డేటింగ్ ప్రారంభించింది లస్ట్ స్టోరీస్-2 షూటింగ్‌లో కాదు. ఆ సమయంలో ర్యాప్ పార్టీ జరగాల్సింది. కానీ కుదరలేదు. మేమే నలుగురం కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నాం. ఆ రోజే తమన్నాకు అసలు విషయం చెప్పాను. నేను మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు ఆమెతో చెప్పా. ఆ తర్వాత మేం కలవడానికి దాదాపు 20 నుంచి 25 రోజులు పట్టిందని చెప్పుకొచ్చాడు. అయితే వీరిద్దరు జంటగా నటించిన లస్ట్ స్టోరీస్-2 చిత్రంలో కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఆ మూవీ సమయంలోనే డేటింగ్ ప్రారంభించారని ఫ్యాన్స్ భావించారు. కానీ తాజాగా ఈ విషయంపై విజయ్ వర్మ క్లారిటీ ఇచ్చారు. కాగా.. కొన్ని రోజుల క్రితమే విజయ్ వర్మ, తమన్నా భాటియా జంటగా ఓ పార్టీకి వెళ్తూ కనిపించారు.
కాగా.. కొత్త ఏడాదిలో విజయ్ వర్మ మర్డర్ ముబారక్ సినిమాతో అలరించాడు. గతేడాది జానే జాన్, దాహాద్, లస్ట్ స్టోరీస్-2 చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం ఉల్ జలూల్ ఇష్క్‌లో విజయ్ వర్మ కథానాయకుడిగా కనిపించనున్నారు. వీరిద్దరు డేటింగ్ గురించి తెలిసినప్పటీ నుంచి పెళ్లి గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని తెగ ఆరా తీస్తున్నారు. ఈ ఏడాదిలోనైనా వివాహాబంధంలోకి అడుగుపెడతారో లేదో వేచి చూడాల్సిందే. కాగా.. ఇటీవలే పెళ్లి కూతురులా తయారైన ఫొటోలను తన కాస్ట్యూమ్ డిజైనర్ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నారు, పెళ్లి కూతురులా ఉన్నారు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి కొందరైతే అంతా బాగానే ఉంది గానీ పెళ్లెప్పుడో? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment