స్టార్ హీరోయిన్ పెళ్లి వాయిదా.. ఇప్పట్లో లేనట్లే! | Tamannaah Bhatia Speaks About Marriage with Tamanna Bhatia | Sakshi

Tamannaah Bhatia: పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు.. ఎందుకంటే?: తమన్నా

Sep 3 2023 7:03 AM | Updated on Sep 3 2023 4:27 PM

Tamannaah Bhatia Speaks About Marriage with Tamanna Bhatia - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఈ అమ్మడు ఇటీవలే నటిగా 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. నట జీవితం చాలా సంతృప్తిగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రజినీకాంత్‌ కథానాయకుడిగా నటించిన జైలర్‌ చిత్రంలో ఒక్క పాట, రెండు సన్నివేశాల్లో నటించి చిత్రానంతా ఆక్రమించేసిందనే చెప్పాలి. దీంతో కెరీర్‌ గ్రాఫ్‌ పడిపోతుందనే ప్రచారం జరుగుతున్న సమయంలో జైలర్‌ చిత్రంలోని నువ్వు కావాలయ్యా.. పాట తమన్నాను ఒక్కసారిగా మళ్లీ ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టింది.

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి!)

అయితే పెళ్లిని కూడా వాయిదా వేసుకునే పరిస్థితికి తీసుకెళ్లిందనే భావన తమన్నా మాటల్లో వ్యక్తం అవుతోంది. ఈమె బాలీవుడ్‌ నటుడు విజయ వర్మ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తమన్నా ఇటీవల బహిరంగంగానే వెల్లడించింది. వీరిద్దరూ ఇ‍ప్పటికే చెట్టా, పట్టాలేసుకొని తిరుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హాల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. 

దీంతో పెళ్లి ఎప్పుడు అని ఓ ఒక ఇంటర్వ్యూలో తమన్నాకు ప్రశ్న ఎదురైంది. దీనిపై మాట్లాడుతూ..' వివాహ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పింది. ఒక దశలో వివాహం చేసుకోవాలని భావించా. అయితే ప్రస్తుతం అలాంటి మానసిక స్థితి లేదు. నటన జీవితం ప్రస్తుతం బాగా సాగుతోంది. దీంతో దానిపై మాత్రమే దృష్టి సారించా. వైవిధ్య భరిత కథలో నటించే అవకాశాలు వస్తున్నాయని అలాంటి వాటిని ఆనందంగా అంగీకరిస్తున్నా. షూటింగ్‌ స్పాటే ప్రస్తుతం తనకు ఆనందాన్ని ఇచ్చే ప్రాంతం'. అని తెలిపింది. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని కాబట్టి.. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని నటి తమన్న స్పష్టం చేసింది.

(ఇది చదవండి: 1980ల్లో స్టార్‌ హీరోయిన్‌.. మద్యానికి బానిసై కెరీర్‌ నాశనం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement