
తమిళసినిమా: అందం తిన్నానండీ అందుకే ఇట్టా ఉన్నానండీ.. అంటూ నటి తమన్నా ఓ చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు ఆడిపాడిన విషయం తెలిసిందే. ఆ పాటకు తగ్గట్టుగానే 36 ఆరేళ్ల వయస్సు మీద పడినా తరగని అందాలతో యువత గుండెల్ని కొల్లగొడుతున్న నటి తమన్నా. ఇటీవల జైలర్ చిత్రంలో నువ్వు కా వాలయ్యా అంటూ ఆడి దుమ్మురేపిన ఈ మిల్కీబ్యూటీకి ప్రస్తుతం అవకాశాలు తగ్గినా క్రేజ్ మాత్రం అలాగే మెయిన్‌టైన్ చేస్తోంది.
ప్రస్తుతానికి అరణ్మణై 4 చిత్రం మాత్రమే తమిళంలో ఈమె చేతిలో ఉంది. అయితే హిందీలో అవకాశాలు వరిస్తున్నాయట. ఇకపోతే బాలీవుడ్ నటుడు, నిర్మాత విజయ్‌వర్మ ప్రేమలో మునిగి తేలుతున్న తమన్నా ఆయనతో డేటింగ్‌లో ఉన్నారు. అయితే పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. కాగా తాజాగా పెళ్లి కూతురులా తయారైన ఫొటోలను ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నారు, పెళ్లి కూతురులా ఉన్నారు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి కొందరైతే అంతా బాగానే ఉంది గానీ పెళ్లెప్పుడో? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment