పెళ్లికి రెడీ అయిపోయిన తమన్నా.. అందుకే ఇలా కనిపించిందా? | Actress Tamanna Bhatia At Kamakhya Temple In Guwahati | Sakshi
Sakshi News home page

Tamannaah: మిల్కీబ్యూటీ ఇలా మారిపోయిందేంటి? ఇదంతా దాని కోసమేనా?

Published Sun, Jan 28 2024 7:51 AM | Last Updated on Sun, Jan 28 2024 9:50 AM

Actress Tamanna Bhatia At Kamakhya Temple Guwahati - Sakshi

తెలుగు హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నాది ప్రత్యేక స్థానం. ఎందుకంటే చిన్న చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించింది.. తన టాలెంట్‌తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ బోలెడంత ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం అటు సినిమాలు.. ఇటు ఓటీటీల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు సడన్‌గా పూర్తి భక్తి మోడ్‌లో కనిపించింది. దీంతో ఈమె పెళ్లిపై మరోసారి పుకార్లు మొదలయ్యాయి.

(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ నన్ను కావాలనే కొట్టింది.. బాడీపై 30 చోట్ల గాయాలు: శ్రద్ధా దాస్)

'హ్యాపీడేస్' సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలందరితోనూ పనిచేసింది. హీరోయిన్ అనే కాకుండా స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. గతేడాది రిలీజైన 'జైలర్'లో ఈమె చేసిన కావాలయ్యా పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంతో పోలిస్తే ఈమెకు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. ఓ తమిళ చిత్రం మాత్రమే చేస్తోంది. మరోవైపు బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో చాలాకాలంగా ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఇటీవల ఈమెనే స్వయంగా వెల్లడించింది.

అయితే పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం తమన్నా క్లారిటీగా చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం దేవాలయాల సందర్శనలో బిజీగా ఉంది. తాజాగా గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని.. తన తల్లిదండ్రులతో కలిసి సందర్శించింది. అక్కడ స్పెషల్ పూజలు నిర్వహించింది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖమంతా కుంకుమ పూసుకుని పూలమాలతో చేతిలో పూజా సామగ్రితో ఈమె.. తమన్ననేనా అన్నంతగా కనిపించింది. అయితే ఇవన్నీ కూడా పెళ్లి కోసమే చేస్తుందని, త్వరలోనే ఆ శుభవార్త వినిపించనుందని సమాచారం.

(ఇదీ చదవండి: పూర్ణతో సంబంధం అంటగడుతున్నారు.. దర్శకుడి ఆవేదన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement