పెళ్లికి తొందరపడుతున్న తమన్నా.. ఆ ప్రాబ్లమ్ వల్లే ఇలా! | Actress Tamannaah Marriage On Cards With Vijay Varma | Sakshi
Sakshi News home page

Tamannaah Marriage: హీరోయిన్ తమన్నా పెళ్లికి రెడీ.. కాకపోతే!

Published Mon, Nov 13 2023 6:02 PM | Last Updated on Mon, Nov 13 2023 6:20 PM

Actress Tamannaah Marriage On Cards With Vijay Varma - Sakshi

హీరోయిన్ తమన్నా గురించి కొత్తగా చెప్పేదేముంది. 2005 నుంచి తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. స్టార్ హీరోల్లో దాదాపు అందరినీ కవర్ చేసింది. ఇన్నేళ్లలో ఈమె ఫలానా వాడితో ప్రేమలో పడింది లాంటి రూమర్స్ పెద్దగా రాలేదు. అలాంటిది ఈ ఏడాది న్యూయర్ సందర్భంగా తమన్నా లవ్ మేటర్ బయటపడింది. నటుడు విజయ్ వర్మ ఈమె లవర్ అని తెలిసిపోయింది. 

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా)

అయితే న్యూయర్ సందర్భంగా తమన్నా-విజయ్ వర్మ ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీళ్ల ప్రేమ వ్యవహారం బయటపడింది. దీన్ని వీళ్లు దాచలేదు. ఓపెన్‌గానే చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 'లస్ట్ స్టోరీస్ 2' సిరీస్‌లో కలిసి నటించారు అనడం ముద్దులు, రొమాన్స్‌తో రెచ్చిపోయారు. దీంతో ఆటోమేటిక్‌గా పెళ్లి టాపిక్ వచ్చింది. ఇప్పట్లో మ్యారేజ్ ఉండకపోవచ్చు అన్నట్లు తమన్నా ఓ సందర్భంలో చెప్పింది.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. తమన్నా తల్లిదండ్రులు పెళ్లి విషయమై ఆమెపై ఒత్తిడి తెస్తున్నారట. వయసు కూడా పెరిగిపోతుందని, త్వరలో పెళ్లి చేసేసుకుంటే ఓ పనైపోతుందని అంటున్నారట. దీంతో మిల్కీబ్యూటీ కూడా వివాహానికి ఓకే చెప్పేసిందట. అయితే తమన్నా, విజయ్ చేతిలో ప్రస్తుతం కొన్ని మూవీస్ ఉన్నాయి. అయితే వాటిపై వర్క్ చేస్తూ, వచ్చే ఏడాది ప్రారంభంలో అంటే ఫిబ్రవరిలో తమన్నా పెళ్లి జరిగే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement