
తమన్నా భాటియా వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. న్యూ ఇయర్ వేడుకలకు గోవా చెక్కేసిన మిల్కీ బ్యూటీ సందడి చేసింది. ఆ వేడుకల్లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ముద్దాడిన వీడియో వైరల్ కావడంతో రూమర్స్ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. తాజాగా తమన్నా తన ఇన్‌స్టాలో గోవా సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసింది.
తమన్నా ఇన్‌స్టాలో రాస్తూ..'కొత్త సంవత్సరంలోకి ట్వంటీ ట్వంటీ ఫ్రీ' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం తమన్నా పోస్టుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రియుడు విజయ్ వర్మ ఎక్కడా? అని పోస్టులు పెడుతున్నారు. విజయ్ వర్మతో ఉన్న ఫోటో పోస్ట్ చేయండి అంటూ మరొకరు ప్రశ్నించారు. కొందరేమో ఏకంగా మీ లవర్ ఎలా ఉన్నాడు? అంటూ కామెంట్స్ చేశారు.
అంతకుముందు తమన్నా, విజయ్ డిసెంబర్ 2022లో ముంబైలో జరిగిన దిల్జిత్ దోసాంజ్ కచేరీలో కనిపించారు. ఈ ఏడాది తమన్నా నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి బోలే చుడియాన్‌లో కనిపించనుంది. విజయ్ చివరిసారిగా అలియా భట్‌తో కలిసి డార్లింగ్స్‌లో కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment