బాలీవుడ్ వరుస వెబ్ సిరీస్‌లతో మిల్కీ బ్యూటీ తమన్నా ఓటీటీని షేక్ చేస్తోంది. అత్యంత శృంగార సన్నివేశాల్లో నటిస్తూ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవలే రిలీజైన జీ కర్దా, లస్ట్ స్టోరీస్-2లో తమన్నా తన రొమాంటిక్ సీన్లతో ఓ రేంజ్‌లో వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ సరసన భోళాశంకర్‌లో నటిస్తోన్న భామ.. వెబ్ సిరీస్‌ల్లో మరింత బోల్డ్ కనిపించింది. దీంతో తమన్నాపై కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సీన్స్ ఎందుకు చేస్తున్నారంటూ మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
అయితే గతంలో ఎంసీఏ విలన్ విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. లస్ట్ స్టోరీస్-2 షూటింగ్ సమయంలోనే తాము ప్రేమలో పడ్డామని తెలిపింది. ఇటీవల ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
(ఇది చదవండి: మందు కొట్టి తీశారా?.. ఆదిపురుష్ మేకర్స్‌పై నటుడు ఆగ్రహం!)
తమన్నా మాట్లాడుతూ.. 'విజయ్ వర్మకు స్త్రీలంటే చాలా గౌరవం. అతను నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. అందుకే నేను అతన్ని ప్రేమించా. తన కుటుంబ సభ్యులపై ప్రేమాభిమానులు ఎక్కువే. ఇంట్లో వాళ్లను గౌరవించేవారు.. బయటి వారితో అలాగే ఉంటారని నమ్ముతా. ఇతరులను గౌరవించడం నేటి యువత నేర్చుకోవాలి. ఇతరులతో ఎలా ఉండాలో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. మహిళలు ప్రతి విషయంలో రాజీపడాలనే భావనను అంగీకరించను.' అని అన్నారు. అయితే తన వెబ్ సిరీస్‌లపై వస్తున్న విమర్శలపై తమన్నా స్పందించారు.
తమన్నా మాట్లాడుతూ.. 'ఈ జనరేషన్‌లో కూడా ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తారనుకోలేదు. ఇలా విమర్శలు చేస్తారని ఊహించలేదు. హీరోలు ఎలాంటి పాత్రలు చేసినా ప్రశంసిస్తారు. వారిని ఏమి అనరు. కానీ హీరోయిన్స్ నటిస్తే మాత్రం విమర్శలు చేస్తారు. ఇదెక్కడి న్యాయం నాకర్థం కావడం లేదు. కెరీర్‌లో ఎదగాలంటే మన నిర్ణయాలను మార్చుకోవాలి. అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.
(ఇది చదవండి: ప్రముఖ యూట్యూబర్‌కు ప్రాణాంతక వ్యాధి.. ఇంతకీ ఏమైందంటే?)
Comments
Please login to add a commentAdd a comment