Lust Stories 2
-
ప్రియుడితో అలాంటి సీన్స్.. అదే కావాలంటోన్న మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీగా అభిమానుల్లో గుండెల్లో పేరు సంపాదించుకున్న భామ తమన్నా భాటియా. గతేడాది జైలర్ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టేసింది. అంతే కాకుండా బాలీవుడ్లో వెబ్ సిరీస్‌లతో అలరించింది. లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో మరి బోల్డ్‌గా నటించి తన గ్లామర్‌ను మరోసారి పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో విజయ్ వర్మతో చేసిన రొమాన్స్ వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. తాజాగా ఈ సిరీస్‌లో అలా నటించడంపై తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది.లస్ట్ స్టోరీస్-2 ఫస్ట్ పార్ట్ చూశాక బోల్డ్ సీన్స్ పట్ల నా అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని తమన్నా తెలిపింది. అలా నటిస్తే తప్పేముందని నాలో నేనే ప్రశ్నించికున్నానని పేర్కొంది. అయితే అలాంటి సీన్స్‌లో నటిస్తే చూడాలని చాలామంది ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని వెల్లడించింది. అందుకే బోల్డ్ సీన్స్‌లో నటిస్తే తప్పేం లేదని అనిపించిందని తెలిపింది. అంతే కాదు.. ఒక నటిగా తాను అన్ని రకాల పాత్రలు చేయాల్సిన అవసరముందని చెప్పుకొచ్చింది. అందుకే ఒక నటిగా తాను ఏం చేయాలో అదే చేస్తానంటోంది మిల్కీ భామ. -
మా డేటింగ్ మొదలైంది అప్పుడే!
‘నువ్వు కావాలయ్యా...’ అంటూ ‘జైలర్’లోని ప్రత్యేక పాటలో తమన్నా చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పాటల్లో ఇదొకటి. కాగా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అయితే తమన్నాతో దాదాపు ఇలానే అన్నారట. ‘నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది’ అని చెప్పారట విజయ్. గత ఏడాది కొత్త సంవత్సరం పార్టీలో విజయ్, తమన్నా చాలా క్లోజ్‌గా కనిపించడంతో ఇద్దరూ డేటింగ్లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా సినిమాల్లో కూడా చేయనంతగా విజయ్ వర్మతో ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లో ముద్దు సన్నివేశాల్లో నటించారు తమన్నా. ఆ సిరీస్‌లో ఇద్దరి కెమిస్ట్రీ ప్రేమలో ఉన్నారేమోననే అభిప్రాయం పలువురికి కలగజేసింది. అయితే అప్పుడు కాదు.. అసలు డేటింగ్ మొదలైంది ఎప్పుడంటే అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు విజయ్ వర్మ, ఆ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ మాట్లాడుతూ – ‘‘లస్ట్ స్టోరీస్ 2’ అప్పుడు మేం డేటింగ్లో లేము. ఆ షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ‘ర్యాప్అప్ పార్టీ’ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అది జరగలేదు. దాంతో తమన్నా, నేను, మరో ఇద్దరు పార్టీ చేసుకున్నాం. ఆ పార్టీలోనే ‘నాకు నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది’ అంటూ నా ఫీలింగ్‌ని తమన్నాతో చెప్పాను. ఆ తర్వాత మా ఫస్ట్ డేట్ సెట్ కావడానికి 20, 25 రోజులు పట్టింది’’ అని పేర్కొన్నారు. సో.. ప్రపోజ్ చేసిన 25 రోజులకు విజయ్, తమన్నాల డేటింగ్ మొదలైందన్న మాట. ఇక ఈ ఇద్దరూ పలు సందర్భాల్లో ఒకరంటే మరొకరికి బాగా ఇష్టమన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి గురించి మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు. -
రెచ్చిపోతున్న తమన్నా.. ఆ విషయం అర్థమైపోవడం వల్లే!
హీరోయిన్ తమన్నా గత కొన్నిరోజులుగా ట్రెండింగ్ లో ఉంది. కారణం ఏంటో మీకు తెలుసు. రెండు వెబ్ సిరీసులు.. బోలెడన్ని అలాంటి సీన్స్ దీనికి మెయిన్ రీజన్. హమ్మయ్యా ఒకటి అయిందనుకునేలోపు మరొకటి అన్నట్లు షాక్ ఇచ్చి, ప్రతి ఒక్కరి మైండ్ బ్లాంక్ చేసి పడేస్తోంది. రెచ్చిపోవడం అనే రేసులో గుర్రంలా దూసుకెళ్తూ గీత ఎప్పుడో దాటేసిందా అనిపిస్తుంది. ఇంతకీ మిల్కీబ్యూటీ ఇంతలా మారిపోవడానికి కారణమేంటో తెలుసా?రెమ్యునరేషన్ డబుల్సాధారణంగా హీరోలతో పోలిస్తే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినాసరే రెమ్యునరేషన్ తక్కువగానే ఇస్తుంటారు. కొన్నాళ్ల ముందువరకు తమన్నా.. సినిమాకు రూ.4 కోట్లు మాత్రమే అందుకునేదట. ఆమెతో వెబ్ సిరీసులు చేయాలనుకున్న దర్శకనిర్మాతలు కొత్త ప్లాన్ వేశారు. ఏకంగా రెమ్యునరేషన్ డబుల్ ఇస్తాం, అంటే రూ.7 కోట్లు వరకు అని చెప్పారట. దీంతో ఎప్పటి నుంచో ముద్దుకి కూడా నో చెబుతూ వచ్చిన తమన్నా.. ఏకంగా శృంగార సన్నివేశాలు చేసి హద్దులు చెరిపేసింది.(ఇదీ చదవండి: గే రిలేషన్షిప్లో కొడుకు? నా నిర్ణయం అదే: 'అదుర్స్' విలన్)కెరీర్ లాస్ట్ స్టేజ్తమన్నా వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. 2005 నుంచి సినిమాల్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగడం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం తమన్నా వయసు కాస్త ఎక్కువ కావడం, హిట్స్ లేకపోవడం వల్ల దర్శకనిర్మాతలు ఈమెపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదేమో అనిపిస్తుంది. బహుశా తమన్నాకు ఇది అర్థమైనట్లు ఉంది. అందుకేనేమో ఇండస్ట్రీలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుందామనే ఆలోచనతో ఉన్నట్లు ఉంది. అందుకే ముద్దు నుంచి సెక్స్ సీన్స్ వరకు అన్నింటికీ ఓకే చెప్పేస్తోందా అనే డౌట్ వస్తోంది. విజయ్‌తో రిలేషన్గతేడాది వరకు తమన్నా సింగిల్. ఈ ఏడాది న్యూయర్ పార్టీలో మాత్రం నటుడు విజయ్ వర్మని ముద్దాడుతూ కనిపించింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో వీళ్లిద్దరి రిలేషన్ బయటపడింది. ఈ జంట పెళ్లి చేసేసుకుందామని ఫిక్సయినట్లు ఉన్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో పెళ్లయితే.. సదరు హీరోయిన్లకు అవకాశాలు వచ్చేది తక్కువ. పెళ్లి తర్వాత ఎలా పడితే అలా చేసేద్దాం అంటే కుదరకపోవచ్చు. ఇదీ కూడా తమన్నా ఆలోచించిదేమో.. అందుకే ఇలా రెచ్చిపోతున్నట్లు అనిపిస్తుంది. మరి ఇందులో నిజానిజాలు ఆ శివయ్యకే ఎరుక! (ఇదీ చదవండి: 'సలార్' అప్డేట్.. స్టార్ కమెడియన్ అలా అనడంతో!) -
తమన్నా బోల్డ్ సీన్స్.. అందుకేనా అంతలా రెచ్చిపోయింది!
ఇటీవల ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్న హీరోయిన్ పేరు తమన్న. 13వ వేటనే ఇండస్ట్రీలో ఎంట్రీ ముంబయి ముద్దుగుమ్మ 2005లో శ్రీ అనే తెలుగు చిత్రం ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కేడీ సినిమాతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. తన గ్లామర్‌తో అగ్ర కథానాయక స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఈమె వయసు 33 ఏళ్లు కాగా.. నటిగా దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు మోస్ట్ వాంటెడ్ బ్యాచ్‌లర్‌గా ఉన్న తమన్న ఇటీవలే విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. (ఇది చదవండి: 'సలార్' టీజర్ ఓకే.. కానీ డైరెక్టర్ని ఓ విషయంలో మెచ్చుకోవాలి!) అయితే నటిగా గ్లామర్ విషయంలో మాత్రం రోజు రోజుకు మరింత బోల్డ్‌గా తయారవుతోంది. ఎందుకంటే ఇటీవలే జీ కర్దా, లస్ట్ స్టోరీస్- 2 వెబ్ సిరీస్‌ల్లో ఈమె శృంగార భరిత సీన్స్‌తో పీక్ స్టేజ్‌కు చేరుకుందనే చెప్పాలి. దీంతో పలువురు తమన్నకు ఏమైంది అంటూ ఘాటుగా విమర్శిస్తుంటే.. ఆవిడ మాత్రం ఈ సమాజానికి ఏమైంది అంటూ ప్రశ్నించడం మరో విశేషం. లస్ట్ స్టోరీస్– 2 వెబ్, జీ కర్దా సిరీస్‌లలో బెడ్ రూమ్ సన్నివేశాలను లిప్ లాక్ సన్నివేశాలలో విజృంభించి నటించిన తమన్నా తాను సినిమాలో నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలనుకుంటున్నానని అందుకే అలా నటిస్తున్నట్లు సమర్ధించుకుంది. అయితే తాజాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అమ్మడు లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో నటించడానికి ఏకంగా రూ.7 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. సాధారణంగా ఈమే తీసుకునేది నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల లోపే ఉంటుంది. కాగా లస్ట్ లవ్ స్టోరీస్- 2 వెబ్ సిరీస్‌లో ఆమెకు హద్దులు మీరిన శృంగార భరిత సన్నివేశాలు 30 నిమిషాల వరకు ఉండడంతో తమన్నా నటించడానికి నిరాకరించరాదన్న కారణంగా నిర్మాతలు ఆమెకు రూ.7 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఈ గోల్డెన్ బ్యూటీ తమిళంలో రజినీకాంత్ సరసన నటిస్తున్న జైలర్ చిత్రం ఆగస్టు 10వ తేదీన విడుదల కానుంది. మరోవైపు తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న భోళాశంకర్ చిత్రం ఆగస్టు 11వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. (ఇది చదవండి: వాళ్లు నాకు ఛాన్సులు ఇవ్వడం లేదు: హీరోయిన్ ఐశ్వర్య) -
విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా
బాలీవుడ్ వరుస వెబ్ సిరీస్‌లతో మిల్కీ బ్యూటీ తమన్నా ఓటీటీని షేక్ చేస్తోంది. అత్యంత శృంగార సన్నివేశాల్లో నటిస్తూ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవలే రిలీజైన జీ కర్దా, లస్ట్ స్టోరీస్-2లో తమన్నా తన రొమాంటిక్ సీన్లతో ఓ రేంజ్లో వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ సరసన భోళాశంకర్‌లో నటిస్తోన్న భామ.. వెబ్ సిరీస్‌ల్లో మరింత బోల్డ్ కనిపించింది. దీంతో తమన్నాపై కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సీన్స్ ఎందుకు చేస్తున్నారంటూ మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే గతంలో ఎంసీఏ విలన్ విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. లస్ట్ స్టోరీస్-2 షూటింగ్ సమయంలోనే తాము ప్రేమలో పడ్డామని తెలిపింది. ఇటీవల ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. (ఇది చదవండి: మందు కొట్టి తీశారా?.. ఆదిపురుష్ మేకర్స్‌పై నటుడు ఆగ్రహం!) తమన్నా మాట్లాడుతూ.. 'విజయ్ వర్మకు స్త్రీలంటే చాలా గౌరవం. అతను నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. అందుకే నేను అతన్ని ప్రేమించా. తన కుటుంబ సభ్యులపై ప్రేమాభిమానులు ఎక్కువే. ఇంట్లో వాళ్లను గౌరవించేవారు.. బయటి వారితో అలాగే ఉంటారని నమ్ముతా. ఇతరులను గౌరవించడం నేటి యువత నేర్చుకోవాలి. ఇతరులతో ఎలా ఉండాలో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. మహిళలు ప్రతి విషయంలో రాజీపడాలనే భావనను అంగీకరించను.' అని అన్నారు. అయితే తన వెబ్ సిరీస్‌లపై వస్తున్న విమర్శలపై తమన్నా స్పందించారు. తమన్నా మాట్లాడుతూ.. 'ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తారనుకోలేదు. ఇలా విమర్శలు చేస్తారని ఊహించలేదు. హీరోలు ఎలాంటి పాత్రలు చేసినా ప్రశంసిస్తారు. వారిని ఏమి అనరు. కానీ హీరోయిన్స్ నటిస్తే మాత్రం విమర్శలు చేస్తారు. ఇదెక్కడి న్యాయం నాకర్థం కావడం లేదు. కెరీర్లో ఎదగాలంటే మన నిర్ణయాలను మార్చుకోవాలి. అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. (ఇది చదవండి: ప్రముఖ యూట్యూబర్‌కు ప్రాణాంతక వ్యాధి.. ఇంతకీ ఏమైందంటే?) -
రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!
సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో జంటగా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఇటీవల బాలీవుడ్లో బిజీ అయిన భామ.. తాజాగా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్‌లో మరింత బోల్డ్‌గా కనిపించి ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా షాకిచ్చింది. సీతారామం చిత్రంలో పద్ధతిగా కనిపించిన భామ.. లస్ట్ స్టోరీస్‌తో ఐ యామ్ నాటీ అని నిరూపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు ఓపెన్‌గానే ఉంటానని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: హైదరాబాద్‌లో ఇల్లు కొన్న మృణాల్ ఠాకూర్? ఆమె ఏమందంటే..) మృణాల్ మాట్లాడుతూ.. 'ముందుగా దేవునికి ధన్యవాదాలు. నేను రిలేషన్స్ గురించి స్వేచ్ఛగా మాట్లాడే జనరేషన్లో పుట్టా. గతంలో నా బ్రేకప్‌ల గురించి మాట్లాడా. దీనివల్ల నా అనుభవాల ద్వారా ఇతరులు నేర్చుకుంటున్నారని భావిస్తున్నా. ప్రస్తుత రోజుల్లో నా చుట్టూ భాగస్వామి లేదా ప్రేమికుడి గురించి మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నందుకు సంతోషిస్తున్నా.' అని అన్నారు. భాగస్వామిని గౌరవించాలి లైఫ్ పార్ట్నర్ గురించి మాట్లాడుతూ.. 'ఎవరైనా సరే మన పార్ట్నర్ మనోభావాలను గౌరవించాలి. మనకు కాబోయే భాగస్వామి తన రిలేషన్ ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటే అలాగే ఉండాలి. నేను ఇండస్ట్రీలో ఉన్నా.. కానీ నా భాగస్వామి ఈ పరిశ్రమకు చెందిన వారు కాకపోవచ్చు. అప్పుడు అతను తన రిలేషన్‌ను పబ్లిక్‌గా ఉంచకూడదనుకుంటే.. అతని గురించి నేను ఎక్కడా చర్చించను.' అని అన్నారు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావని అనుకోవడం లేదని అన్నారు మృణాల్.. ఎందుకంటే ప్రస్తుతం నేను చాలా మెరుగైనస్థితిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. తమ రిలేషన్స్ గురించి ఒపెన్‌గా మాట్లాడిన నీనా గుప్తా , అంగద్ బేడీ, కరీనా కపూర్ ఖాన్, నేహా దుపియాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఇది చాలా సాధారణమైన విషయమన్నారు. కాగా.. మృణాల్ విజయ్ దేవరకొండ సరసన ఒక చిత్రంలో కనిపించనుంది. (ఇది చదవండి: భర్త ఫోటోను షేర్ చేసిన పోకిరి భామ.. కానీ..! ) -
Lust stories 2: ఈ సీన్ల కోసం తమన్నా తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే..
స్టార్ హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా గురించి అందరికి తెలుసు.. టాలీవుడ్లో అడుగుపెట్టి ఇరవై ఏళ్లు పూర్తి కావొస్తున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.. ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లతో పోటి పడుతూ వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్లో ఆమె మొదట జీ కర్థ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఆ సిరీస్‌లో కూడా బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయింది. తాజాగా వచ్చిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్2'లో కూడా అవే సీన్లతో మరింత డోస్ పెంచింది. బాలీవుడ్లో అవకాశాల కోసమే మిల్కీబ్యూటీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుందానని కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆమె సినీ కెరియర్లో ఏ సినిమాలో కూడా ఈ స్థాయిలో బోల్డ్‌గా నటించలేదు. అంతే కాకుండా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ సీరిస్‌లో వారిద్దరూ ఏకంగా లిప్ కిస్ సీన్స్‌తో పాటు బెడ్ రూం సీన్స్‌లో కూడా రెచ్చిపోయారు. (ఇదీ చదవండి: సినీ తారల ‘వ్యాపారం’.. సైడ్ బిజినెస్‌తో కోట్లు గడిస్తున్న స్టార్స్ వీరే!) ఈ సిరీస్ కోసం తమన్నాకు భారీ స్థాయిలోనే రెమ్యూనేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఒక సినిమా కోసం తమన్నా సుమారు రూ. ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకుంటుందని ఇండస్ట్రీ టాక్. కానీ 'లస్ట్ స్టోరీస్2' కోసం ఏకంగా ఏడు కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఇందులో కూడా తను కేవలం 30 నిమిషాల నిడివి లోపే తన క్యారెక్టర్ ఉంటుంది. రొమాన్స్ సీన్లు చేసేందుకు ఎలాంటి అడ్డు చెప్పనందుకే ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ మేకర్స్ ఇచ్చారని తెలుస్తోంది. టాలీవుడ్లో భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో జోడిగా తమన్నా నటిస్తుంది. ఈ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. (ఇదీ చదవండి: 'భోళా శంకర్'కి లైన్ క్లియర్.. ఆ సినిమా వాయిదా వల్ల!) -
లస్ట్ గురించి బోల్డ్ కామెంట్ చేసిన సీతారామం బ్యూటీ
2018లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన 'లస్ట్ స్టోరీస్' మంచి విజయం సాధించింది . దానికి కొనసాగింపుగా తాజాగా వచ్చిందే ‘లస్ట్ స్టోరీస్ 2’. ఇందులో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్ వంటి అగ్ర కథానాయకలు నటించడం విశేషం. గురువారం (జూన్ 29)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీరిస్ ప్రధానంగా యూత్నే టార్గెట్ చేసిందనే చెప్పవచ్చు. ఇందులో వేద (మృణాల్ ఠాకూర్) అర్జున్ (అంగద్ బేడీ) ఇరువురు మెప్పిస్తారు. వేద బామ్మగా నీనా గుప్త క్యారెక్టర్ కూడా మెప్పిస్తుంది. జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగార జీవితాన్ని రుచి చూడాలని సలహాను వేద బామ్మ ఇవ్వడంతో సీరిస్ ఆసక్తి పెంచుతుంది. (ఇదీ చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే) శృంగారం, కామం గురించి పరిణతి చెందిన సంభాషణ చేయడంలో తప్పులేదంటూ తాజాగా ఈ సీరిస్ గురించి మృణాల్ ఠాకూర్ ఇలా చెప్పింది. 'ఈ రోజుల్లో శృంగారం, కామం గురించి ప్రతి ఇంట్లో ఓపెన్‌గా సంభాషణలు జరగడం ఎంతో ముఖ్యమని నేను బలంగా నమ్ముతాను. ముఖ్యంగా ఇంట్లో యుక్త వయసులో ఉన్న వాళ్లతో దీనిపై మాట్లాడటం అవసరం. వాళ్లకు వీటి గురించి సరైన సమాచారం అందించే ఓ రోల్ మోడల్ అవసరం. ఇలాంటి టాపిక్స్ పై ఇంట్లోని పిల్లలకు నిజాయితీగా వివరించే ఒక్క వ్యక్తి ఉన్నా కూడా వాళ్లు బయట నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని స్వీకరించరు' అని మృనాల్ చెప్పింది. (ఇదీ చదవండి: Ram Charan-Upasana: మెగా వారసురాలికి ముఖేష్ అంబానీ గిఫ్ట్) ‘సీతారామం’తో అందరికీ ఫేవరేట్ హీరోయిన్గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ పరశురామ్ దర్శకత్వంలో విజయ్‌దేవరకొండతో ఓ సినిమా చేయనున్నారు. మరోవైపు నానితో కూడా ఓ సినిమాతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ (ఆంథాలజీ)
టైటిల్: లస్ట్ స్టోరీస్ 2 నటీనటులు: తమన్నా, విజయ్ వర్మ, మృణాల్ ఠాకుర్, కాజోల్ తదితరులు నిర్మాణ సంస్థ: RSVP & ఫ్లయింగ్ యూనికార్న్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాత: ఆషీ దువా, రోనీ స్క్రూవాలా దర్శకత్వం: ఆర్. బాల్కీ, సుజోయ్ ఘోష్, అమిత్ రవీంద్రనాథ్, కొంకణ్ సేన్ శర్మ సినిమాటోగ్రఫీ: ఆనంద్ బన్సాల్ ఎడిటర్: సన్యుక్త కజా ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ విడుదల తేదీ: 29 జూన్ 2023 ఓటీటీలు వచ్చిన కొత్తలో 'లస్ట్ స్టోరీస్' ఓ సెన్సేషన్. ఎంతలా అంటే ఈ ఆంథాలజీ దెబ్బకు కియారా అడ్వాణీ తెగ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'లస్ట్ స్టోరీస్ 2' తీసుకొచ్చారు. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్ లో తమన్నా చేస్తున్న హడావుడి, ట్రైలర్లో ఆమె సీన్స్ వల్ల.. ఈ మూవీపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం... అంచనాల్ని అందుకుందా? ఫస్ట్ పార్ట్ కంటే మెప్పించిందా? లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) కథేంటి? ఇందులో నాలుగు కథలుంటాయి. మొదట దానిలో వేద(మృణాల్ ఠాకుర్), అర్జున్ (అంగద్ బేడీ) పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్లి పనుల్లో పెద్దలు బిజీగా ఉంటారు. వేద బామ్మ (నీనా గుప్తా) మాత్రం.. జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనాలని వేద, అర్జున్ కి సలహా ఇస్తుంది. రెండో దానిలో ఇషిత (తిలోత్తమ షోమీ) ముంబయిలో జాబ్ చేస్తూ ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటుంది. ఓ రోజు కాస్త త్వరగా ఇంటికొచ్చేసరికి.. తన బెడ్ పై పనిమనిషి సీమ(అమృత సుభాష్) తన భర్తతో కలిసి బెడ్ పై శృంగారంలో బిజీగా ఉంటుంది. మూడో దానిలో విజయ్ చౌహాన్ (విజయ్ వర్మ)కు మహిళలంటే తెగ మోజు. ఓ రోజు లవర్ తో వీడియో కాల్ మాట్లాడుతూ కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. దగ్గరలోని ఓ ఊరికి వెళ్తే అక్కడ తన మాజీ ప్రేయసి శాంతి (తమన్నా) కనిపిస్తుంది. నాలుగో దానిలో బిజోక్పుర్ అనే ఊరిలో రాజకుటుంబీకుడు (కుముద్ మిశ్రా).. భార్య దేవయాని(కాజోల్), కొడుకు అంకుర్ (జీషాన్ నదఫ్)తో కలిసి జీవిస్తుంటాడు. ఈయన కూడా ఆడవాళ్లని చూస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేడు. ఈ నాలుగు స్టోరీల్లోనూ చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? బామ్మ.. పెళ్లీడుకు వచ్చిన తన మనవరాలిని దగ్గర కూర్చోబెట్టుకుని, శృంగారం గురించి చాలా ఓపెన్ గా చెబుతుంటుంది. 'మీ తాతగారిని దేవుడు తీసుకెళ్లిపోయాడు. లేకపోయింటే ఈ గది తలుపులకు ఈ పాటికే గొళ్లెం పెట్టి ఉండేవి' అని అంటుంది. ఈ సీన్ లో ఆ మనవరాలు నవ్వుతూ ఉంటుంది గానీ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే నిజ జీవితంలో ఇలా జరుగుతుందా లేదా అనేది పక్కనబెడితే.. బోల్డ్నెస్ లో మరీ హద్దులు దాటేశారు బాబోయ్ అనిపిస్తుంది. ఇదే కాదు 'లస్ట్ స్టోరీస్ 2'లో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' టైటిల్ తో తీసిన తొలి స్టోరీలో 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకుర్ నటించింది. పెళ్లికి ముందు శృంగారం అనే షాకింగ్ కాన్సెప్ట్ తో దీన్ని తెరకెక్కించారు. ఇది నిజంగా భారతీయ సంస్కృతిలో వర్కౌట్ కాదు. ఈ ఎపిసోడ్ అంతా బామ్మ పాత్ర చుట్టూనే ఉంటుంది. ఆమె మాటలు విన్న అర్జున్, వేద ఏం చేశారనేది స్టోరీ. చాలా సింపుల్, ఫ్లాట్ గా దీన్ని తీశారు. యూత్ ని ఆకట్టుకోవడం తప్పితే పెద్దగా ఏం లేదు. 'ద మిర్రర్' పేరుతో తీసిన రెండో స్టోరీ ఓ శృంగార నవల చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో చూపించిన పాయింట్.. ప్రస్తుతం సమాజంలో ఒంటరి మహిళలు లేదా అమ్మాయిల జీవితాలని ప్రతిబింబించేలా అనిపిస్తుంది! ఇందులో పదేపదే 'ఆ' సీన్సే చూపిస్తుంటారు. దీని వల్ల కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. నిడివి కూడా కాస్త ఎక్కువే. అసలు విషయం బయటపడిన తర్వాత మనుషుల మనస్తత్వాలు ఎలా మారిపోతాయి అనే పాయింట్ కూడా ఇందులో చూపించారు. (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) 'సె*క్స్ విత్ ఎక్స్' పేరుతో తీసిన మూడో స్టోరీలో రియల్ లైఫ్ కపుల్ తమన్నా, విజయ్ వర్మ జంటగా కనిపించారు. ఈ ఎపిసోడ్ మొదటంతా రొమాంటిక్ వేలో వెళ్తుంది. చివరకొచ్చేసరికి మిస్టరీ తరహాలో మారిపోతుంది. తమన్నా అయితే రెచ్చిపోయి మరీ అలాంటి సీన్స్ చేసింది. యూత్ ని టార్గెట్ చేయడం కోసం ఈ ఎపిసోడ్ లో ముద్దు, శృంగారం సన్నివేశాల గాఢత పెంచిన ఫీలింగ్ కలుగుతుంది. చివరి సీన్ మాత్రం మనల్ని అవాక్కయ్యేలా చేస్తుంది. 'టిల్చట్టా(బొద్దింక)' పేరుతో నాలుగో ఎపిసోడ్.. పైవాటితో పోలిస్తే చాలా నిదానంగా సాగుతుంది. చివరి సీన్ కి వస్తే గానీ అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాదు. క్లైమాక్స్ పాయింట్ బాగున్నప్పటికీ.. దానికోసం ఎపిసోడ్ ని అరగంటపాటు సాగదీయడం బోర్ కొట్టిస్తుంది. ఇందులో కాజోల్ లాంటి స్టార్ యాక్టర్ ఉన్నప్పటికీ ఆమె పాత్రని సరిగా డిజైన్ చేయలేదు. మొత్తంగా చూసుకుంటే 'లస్ట్ స్టోరీస్' చిత్రంలో విభిన్న వ్యక్తుల భావోద్వేగాలని చూపిస్తే... ఇప్పుడీ సీక్వెల్ లో శృంగారమే ప్రధానం అన్నట్లు తీశారు. కథ కన్నా 'కామం' అనే పాయింట్ నే హైలెట్ చేశారు. దీంతో ఇది సినిమాలా కాకుండా ఓటీటీ కోసం తీసిన సెమీ బూతు చిత్రంలా అనిపిస్తుంది. ఫ్యామిలీ ప్రేక్షకులు.. ఈ ఆంథాలజీ చిత్రాన్ని పొరపాటున కూడా ఓపెన్ చేయొద్దు. ఎవరెలా చేశారు? మృణాల్ ఠాకుర్.. డిఫరెంట్ గా కనిపించింది. తిలోత్తమ షోమీ కూడా ఉన్నంతలో పర్లేదు. తమన్నా, విజయ్ వర్మ అయితే రెచ్చిపోయి నటించారు. ముద్దు, శృంగారం సన్నివేశాల్లో హద్దులు దాటేశారు. కాజోల్ తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది. సీనియర్ నటి నీనా గుప్తా అయితే ప్రతిఒక్కరినీ తన యాక్టింగ్, డైలాగ్స్ తో ఆశ్చర్యపరిచింది. చెప్పాలంటే ఈమె రోల్ అందరికీ పెద్ద షాక్. టెక్నికల్ గా నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ.. స్టోరీ, మిగతా విషయాల్లో దర్శకనిర్మాతలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. -చందు, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ)