Mrunal Thakur Hesitate to Open Up About Her Relationship - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: ఆ విషయంలో పార్ట్‌నర్‌ కోరుకుంటే ఓకే చెప్తా: మృణాల్ ఠాకూర్

Published Sun, Jul 2 2023 4:39 PM | Last Updated on Sun, Jul 2 2023 5:34 PM

Mrunal Thakur hesitate to open up about her relationship - Sakshi

సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో జంటగా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఇటీవల బాలీవుడ్‌లో బిజీ అయిన భామ.. తాజాగా లస్ట్ స్టోరీస్‌-2 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్‌లో మరింత బోల్డ్‌గా కనిపించి ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా షాకిచ్చింది. సీతారామం చిత్రంలో పద్ధతిగా కనిపించిన భామ.. లస్ట్ స్టోరీస్‌తో ఐ యామ్ నాటీ అని నిరూపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన రిలేషన్‌షిప్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు ఓపెన్‌గానే ఉంటానని చెప్పుకొచ్చింది. 

(ఇది చదవండి: హైదరాబాద్‌లో ఇల్లు కొన్న మృణాల్‌ ఠాకూర్‌? ఆమె ఏమందంటే..)

మృణాల్‌ మాట్లాడుతూ.. 'ముందుగా దేవునికి ధన్యవాదాలు. నేను రిలేషన్స్ గురించి స్వేచ్ఛగా మాట్లాడే జనరేషన్‌లో పుట్టా. గతంలో నా బ్రేకప్‌ల గురించి మాట్లాడా. దీనివల్ల నా అనుభవాల ద్వారా ఇతరులు నేర్చుకుంటున్నారని భావిస్తున్నా. ప్రస్తుత రోజుల్లో నా చుట్టూ భాగస్వామి లేదా ప్రేమికుడి గురించి మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నందుకు సంతోషిస్తున్నా.' అని అన్నారు. 

భాగస్వామిని గౌరవించాలి

లైఫ్‌ పార్ట్‌నర్‌ గురించి మాట్లాడుతూ.. 'ఎవరైనా సరే మన పార్ట్‌నర్‌ మనోభావాలను గౌరవించాలి. మనకు కాబోయే భాగస్వామి తన రిలేషన్ ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటే అలాగే ఉండాలి. నేను ఇండస్ట్రీలో ఉన్నా.. కానీ నా భాగస్వామి ఈ పరిశ్రమకు చెందిన వారు కాకపోవచ్చు. అప్పుడు అతను తన రిలేషన్‌ను పబ్లిక్‌గా ఉంచకూడదనుకుంటే.. అతని గురించి నేను ఎక్కడా చర్చించను.' అని అన్నారు.

ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావని అనుకోవడం లేదని అన్నారు మృణాల్.. ఎందుకంటే ప్రస్తుతం నేను చాలా మెరుగైనస్థితిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. తమ రిలేషన్స్‌ గురించి ఒపెన్‌గా మాట్లాడిన నీనా గుప్తా , అంగద్ బేడీ, కరీనా కపూర్ ఖాన్, నేహా దుపియాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఇది చాలా సాధారణమైన విషయమన్నారు. కాగా.. మృణాల్ విజయ్ దేవరకొండ సరసన ఒక చిత్రంలో కనిపించనుంది.

(ఇది చదవండి: భర్త ఫోటోను షేర్ చేసిన పోకిరి భామ.. కానీ..! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement