relations
-
భారత్‌తో కుస్తీ.. పాక్‌తో దోస్తీ.. మారిన బంగ్లాదేశ్ వైఖరి?
న్యూఢిల్లీ: ఒకప్పుడు భారత్‌తో మంచి మిత్రత్వం కలిగిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్‌కు బద్ధ శత్రువుగా మారడమే కాకుండా పాకిస్తాన్‌తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. నాడు హిందువులపై ఆదరణచూపిన బంగ్లాదేశ్ ఇప్పుడు హిందువులను, ముఖ్యంగా భారతీయులను ద్వేషించడం మొదలుపెట్టింది.మహ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టాక..బంగ్లాదేశ్‌లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టినప్పటి నుండి ఆ దేశం ఛాందసవాద మార్గంలో ప్రయాణిస్తోంది. అక్కడి ముస్లింలు ఇప్పుడు భారతీయులతో స్నేహ భావాన్ని మరిచిపోయారు. హిందువులపై నిరంతరం దాడులకు పాల్పడుతున్నారు. హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్నారు. విగ్రహాలను తగులబెడుతున్నారు. ఇంతేకాదు హిందువులను నరికివేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారు.హిందువులకు బెదిరింపులుబంగ్లాదేశ్లో ఇస్కాన్ ఆలయాన్ని, భక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. హిందువులను బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఇస్కాన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఒక ఛాందసవాదికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతను ఇస్కాన్‌పై నిషేధం విధించాలని ఆ వీడియోలో బహిరంగంగా డిమాండ్ చేశాడు. ప్రభుత్వం అలా చేయని పక్షంలో హింసాత్మక దాడులకు దిగుతామని బెదించాడు. ఈ వీడియోను షేర్ చేసిన ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ మాట్లాడుతూ ఈ ప్రసంగం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని, బంగ్లాదేశ్ అంతటా ఈ తరహా విద్వేషాలే చెలరేగుతున్నాయన్నారు. ఇలాంటివారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఢాకా వీధుల్లో ప్రదర్శనబంగ్లాదేశ్లోని ముస్లింలు తాజాగా ఢాకా వీధుల్లో భారత్‌కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల రక్షణలో ఆందోళనకారులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాడికల్ ఇస్లామిక్ సంస్థలకు చెందిన మిలిటెంట్లు ఐఎస్ఐఎస్ జెండాలను ప్రదర్శించారు. అక్కడి భారత పౌరులను చంపేస్తామంటూ నినదించారు. ఈ నేపధ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య బీటింగ్ రిట్రీట్ను నిలిపివేశారు.పరాకాష్టకు మత అసహనంబంగ్లాదేశ్లోని ఛాందసవాదులు ఇస్కాన్ దేవాలయాలను ఒకదాని తర్వాత ఒకటిగా కూల్చివేసి, విగ్రహాలను దహనం చేస్తున్నారు. తాజాగా ఢాకాలోని ఇస్కాన్ సెంటర్‌కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ మత అసహన ఘటనలు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ ప్రతిష్టను ప్రభావితం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ డిసెంబరు 9న ఢాకాలో పర్యటిస్తారని తెలిపారు.పాక్‌కు చేరువవుతున్న బంగ్లాదేశ్ ఒకవైపు భారత్- బంగ్లాదేశ్ మధ్య పరస్పరం సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పాకిస్తాన్- బంగ్లాదేశ్‌లు ఇరు దేశాల పౌరులకు వీసా నిబంధనలలో వివిధ సడలింపులను ఇచ్చాయి. అలాగే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా, కరాచీ నుండి ఒక కార్గో షిప్ గత నెలలో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నౌకాశ్రయానికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య తొలిసారిగా సముద్ర రవాణా సంబంధాల ఏర్పడ్దాయి. వచ్చే ఏడాది నుంచి ఇస్లామాబాద్- ఢాకా మధ్య ఎయిర్ కనెక్టివిటీ కూడా ప్రారంభమవుతుందని బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ సమయ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.క్షీణించిన భారత్- బంగ్లా సంబంధాలుషేక్ హసీనాను అధికారం నుండి తొలగించి, మొహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన తర్వాత, బంగ్లాదేశ్‌లోని హిందువులతో సహా ఇతర మైనారిటీల భద్రతపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు భారత్ ఆందోళనలను బంగ్లాదేశ్ తోసిపుచ్చింది. భారత్ తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. భారతదేశంతో బంగ్లాదేశ్‌కు సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వచ్చి చదువుకుంటుంటారు. గత 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ ప్రజలు భారతదేశానికి వచ్చేందుకు సులభంగా వీసా పొందేవారు. అయితే గత ఆగస్టు నుండి బంగ్లాదేశ్‌లో వీసా విషయంలో నిబంధనలు పెరిగాయి.ఇది కూడా చదవండి: రానున్నది తాతల కాలం.. 2050 నాటికి వృద్ధ జనాభా మూడింతలు -
'రాజ్ తరుణ్‌కు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్స్'.. లావణ్య షాకింగ్ కామెంట్స్!
రాజ్ తరుణ్- లావణ్య టాపిక్ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. పరస్పర ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదురుతోంది. హీరోయిన్ తామిద్దరం 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నామని.. ప్రస్తుతం మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నాడంటూ లావణ్య ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్‌కు చాలామంది హీరోయిన్స్‌తో రిలేషన్స్ ఉన్నాయంటూ లావణ్య సంచలన కామెంట్స్ చేసింది. లావణ్య మాట్లాడుతూ..'నాకు రాజ్ తరుణ్‌కు 14 ఏళ్లుగా పరిచయం ఉంది. దాదాపు 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. మాల్వీ మల్హోత్రా వచ్చాక నన్ను దూరం పెడుతున్నాడు. ఆమె నన్ను చంపేస్తానని బెదిరించింది. వాళ్లిద్దరు కలిసి చెన్నైలో ఓ హోటల్లో ఉన్నారు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను, రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు తాను నన్ను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మస్తాన్ సాయికి, నాకు గొడవైంది. అందుకే అతనిపై ఫిర్యాదు చేశా. కొందరు నాతో మైండ్‌గేమ్ ఆడారు. ఆ గేమ్‌లో నేను, మస్తాన్ సాయి ఇద్దరం బాధితులమే. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను.' అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. 'నేను, మస్తాన్ సాయి ఎప్పుడు కూడా జంటగా కనిపించలేదు. ఒక పెళ్లికి గుంటూరు వెళ్లాం. అతను కేవలం నా మ్యూచ్‌వల్ ఫ్రెండ్. నాతో ఎవరు మాట్లాడినా అతనితో రిలేషన్లో ఉన్నట్లేనా? నాకు అన్యాయం జరిగింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశా. నా దగ్గర రాజ్ తరుణ్ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. లవర్ సినిమా నుంచి మాకు గొడవలు మొదలయ్యాయి. డబ్బుల కోసం నేను బెదిరించాల్సిన పనిలేదు. అతని కోసం చాలా భరించాను. రాజ్ తరుణ్‌కు చాలామంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయి. ' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. -
నీ కోసం నువ్వు.. అన్ని బంధాలకూ మూలమిదే!
కనెక్షన్ కార్నర్‌కి పున: స్వాగతం.. బంధాలు, అనుబంధాల గురించి మనకు తరచూ చాలా చాలా కంప్లయింట్స్ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినడంలేదని, పేరెంట్స్ అర్థం చేసుకోవడంలేదని, భర్త పట్టించుకోవడంలేదని, భార్య మాట వినడం లేదని, కింది ఉద్యోగి గౌరవం ఇవ్వడంలేదని, పైఅధికారి వేధిస్తున్నాడని.. ఇలా రకరకాల కంప్లయింట్స్. వాటన్నింటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు అన్ని బంధాలకూ మూలమైన సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడుకుందాం. కనెక్షన్ కార్నర్ అని పేరు పెట్టుకుని అందులో ‘సెల్ఫ్ లవ్’ గురించి ఎందుకబ్బా అని మీకు అనిపించవచ్చు. మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల అవసరమైనట్లే ఇతరులతో బలమైన బంధాలు ఏర్పడాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అవసరం. అదెంత అవసరమో తెలియాలంటే, ‘మాయ’ గురించి తెలుసుకోవాల్సిందే.ప్రేమించలేని మాయ..మాయ 25 ఏళ్ల ఆర్టిస్ట్. చక్కగా బొమ్మలు వేస్తుంది, నగరంలో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో తన బొమ్మలు ప్రదర్శిస్తుంది. అందరితోనూ కలివిడిగా ఉంటుంది. కానీ ప్రేమ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతోంది. ఏ ప్రేమా ఎక్కువకాలం నిలబడటం లేదు. దాంతో తనలో, తన ప్రవర్తనలో ఏమైనా లోపం ఉందేమోనని ఆందోళన చెందుతోంది. మాయతో మాట్లాడిన తొలి సెషన్ లోనే తాను సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక బాధపడుతోందని గుర్తించాను. మాయ బాల్యంలో ఆత్మవిశ్వాసంతో ఉండేది. కానీ ఆర్టిస్టుగా మారాక తరచూ ఇతరులతో పోల్చుకోవడం, విమర్శలు ఎదుర్కోవడం, నిత్యం విమర్శించే లోగొంతుతో అంచెలంచలుగా తనపై, తన సామర్థ్యంపై విశ్వాసాన్ని కోల్పోయింది. దాంతో తనను విమర్శిస్తారేమో, తిరస్కరిస్తారేమోననే భయంతో ఇతరులకు దూరంగా ఉండటం మొదలు పెట్టింది.బలమైన కనెక్షన్ లను ఏర్పరచుకోవడం స్వీయ-ప్రేమ కీలకపాత్ర పోషిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. సెల్ప్ కంపాషన్ ఉన్న వ్యక్తులు ఇతరులను అర్థం చేసుకోగలరు, వారి తప్పులను క్షమించి సురక్షిత బంధాలను పెంచుకోగలరు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు సానుకూల సామాజిక సంబంధాలను ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువని మరో అధ్యయనంలో వెల్లడైంది.అంచెలంచెలుగా పెరిగిన ప్రేమ..కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీలో అసలు సమస్యను, దాని మూలాలను తెలుసుకోవడమే కీలకం. మాయ సమస్య, దాని కారణాలు అర్థమయ్యాక ఆమెలో సెల్ప్-లవ్ ను పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించడంపై దృష్టి సారించాను. 👉: కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ ద్వారా మాయలోని ప్రతికూల ఆలోచనలను సవాలు చేసి సెల్ఫ్-కంపాషన్ తో భర్తీ చేసుకుంది. ఉదాహరణకు, "ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో స్థానం పొందలేకపోయానంటే నేను ఫెయిలయినట్టే" అని ఆలోచించే బదులు, "ఇది ఒక ఆర్టిస్టుగా నా విలువను నిర్వచించలేదు. ఈ అనుభవం నుండి నేర్చుకుంటా, మరింత మెరుగైన బొమ్మలు వేస్తాను " అని రీఫ్రేమ్ చేయడం నేర్చుకుంది.👉: థెరపీలో భాగంగా రోజూ తనలోని మూడు సానుకూల అంశాలను, సాధించిన విజయాలను, గ్రాటిట్యూడ్ చూపించాల్సిన విషయాలను గుర్తించి, తనను తాను అభినందించుకోవడం మొదలుపెట్టింది. ఇది ఆమె సెల్ఫ్ ఇమేజ్ పెరగడానికి, ఆమె దృష్టి తన బలాలవైపు మళ్లించడానికి ఉపయోగపడింది. 👉: తన కనెక్షన్ లలో ఎక్కడ దేనికి ఎస్ చెప్పాలో, ఎక్కడ నో చెప్పాలో గుర్తించగలిగింది, నో చెప్పడం నేర్చుకుంది. అనవసరమైన పార్టీలకు, ఫంక్షన్లకు, రిక్వెస్టులకు నో చెప్పడం సాధన చేసింది. 👉: కొద్ది సెషన్లలోనే మాయలోని అంతర్గత విమర్శకురాలు గొంతు మూగబోయింది. ఆమెలో సెల్ఫ్-లవ్, సెల్ఫ్-కంపాషన్ పెరిగింది. ఈ కొత్త స్వీయ-ప్రేమ ఆమె తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగింది. తన అవసరాలను, కోరికలను స్పష్టంగా వ్యక్తీకరించగలిగింది. ఇది అర్ధవంతమైన కనెక్షన్లకు దారితీసింది.మీకోసం కొన్ని చిట్కాలు.. మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల కావాలన్నట్లే, మంచి బంధాలు కావాలంటే సెల్ఫ్-లవ్ అవసరమని తెలుసుకున్నాం కదా. మాయలానే మీలోనూ సెల్ఫ్-లవ్ తగ్గిందనకుంటే ఈ కింది అంశాలను ప్రాక్టీస్ చేయండి. 👉: ప్రతి ఒక్కరి మనసులో ఒక అంతర్గత విమర్శకుడు ఉంటాడు. వాడి మాటలకు తలూపకుండా ‘నా స్నేహితుడితో నేనిలా మాట్లాడగలనా?’ అని ప్రశ్నించుకోండి. మీ అంతర్గత విమర్శకుడిని సవాలు చేయండి. 👉: ప్రతీ ఒక్కరి జీవితంలో మంచి విషయాలు ఉంటాయి. వాటిని గుర్తించండి. ప్రతీరోజూ మీరు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను వ్రాయండి. 👉: "నో" అని చెప్పడం, మీ స్వంత అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం స్వార్థం కాదు; ఇది ఆత్మగౌరవానికి అవసరం. ‘నో’ చెప్పడం ప్రాక్టీస్ చేయండి. 👉: శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం విలాసం కాదు -అవసరం. అందుకే మీకు సంతోషాన్నిచ్చే అంశాలకు రోజూ సమయాన్ని కేటాయించండి. 👉: మీ విజయాలను ఇతరులు గుర్తించే వరకు వేచి ఉండకండి. పెద్దవైనా, చిన్నవైనా సెలబ్రేట్ చేసుకోండి. అది మీ స్వీయ-విలువను బలపరుస్తుంది. 👉: ఎలాంటి తీర్పులూ లేకుండా ఈ క్షణంపై దృష్టిపెట్టే మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది, సెల్ఫ్-కంపాషన్ ను పెంచుతుంది. 👉: మనమందరం తప్పులు చేస్తాము. వాటినే తలచుకుంటూ నిందించుకోవడం మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరు క్షమించుకోవడం నేర్చుకోండి. క్షమాపణ అనేది మీకు మీరు ఇచ్చే బహుమతి.👉: సెల్ఫ్-లవ్ ను పెంపొందించుకోవడం ఒక ప్రయాణం. అందుకోసం ఇతరుల సహాయం అవసరం పడొచ్చు. అందువల్ల క్లోజ్ ఫ్రెండ్ సహాయ తీసుకోండి. అవసరమైతే సైకాలజిస్ట్ ను సంప్రదించడానికి సంకోచించకండి. 👉: సెల్ఫ్-లవ్ గమ్యం కాదు, నిరంతర అభ్యాసం. ఈ చిట్కాలను మీ దినచర్యలో భాగంగా చేసుకుని రోజూ ప్రాక్టీస్ చేయండి. మీ సెల్ప్-లవ్ పెరుగుతుంది, మీ బంధాలు బలపడతాయి.సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం : ఇష్టాయిష్టాలు కలిసాయా!?
గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి ఒక యువకుడికి, ఒక యువతికి ఉండవలసిన సాధారణ లక్షణాలు ఐదింటిని శ్రీరామాయణం నిర్దేశించింది. వాటిలో మొదటిది శీలం. అంటే స్వభావం. అది పుట్టుకతో వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కొంతమందికి సంగీతం, కొంతమందికి ఆధ్యాత్మిక చింతన, మరికొందరికి చిత్రలేఖనం.... అలా అది వారికి బాగా ఇష్టమైన విషయంగా ఉంటుంది. పెళ్ళి సంబంధం చూసేటప్పుడు ఒకరికి ఇష్టమైన విషయం మరొకరికి కూడా ఇష్టమేనా, అయిష్టం లేదు కదా.. అని చూస్తారు. ఆ పరిశీలన పెద్దలు చేస్తారు.తరువాత వయస్సు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది ఉండదు. రెండు కళ్ళల్లో ఏది మంచిదంటే ఏమని చెప్పగలం? బండి చక్రాలు రెండూ సమన్వయంతో పనిచేయాలి. జీవితం నుండి మొదట ఆయన నిష్క్రమిస్తే.. ఆవిడ పుణ్యకార్యం చేయదు. ఆమె వెళ్ళి΄ోతే...ఆయన తమ కడుపున పుట్టిన కూతురును కూడా కన్యాదానం చేయలేడు. ఆవిడ నిష్క్రమణతోనే ఆయనకు పుణ్యకార్యం చేసే అధికారం కూడా ΄ోతుంది. అందువల్ల ఇద్దరూ సమానమే. ఇద్దరూ కలిసి ఉంటేనే సౌభాగ్యం, సంతోషం. అంటే వాళ్ళ వయసులో ఎవరు పెద్దయితే గొప్ప అన్నదానికన్నా ప్రధానమైనది– ఒకరు నడిపించాలి, మరొకరు నడవాలి–అనేది. ఇక్కడ నడిపించేవారిది ఎక్కువ, నడిచేవారిది తక్కువ అనుకోకూడదు. అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలి. వరుడి వయసు పెద్దదయి ఉండాలి–అన్నారు. వయస్సు అంటే కాలం. కాలం అనుభవానికి, అవగాహనకు గుర్తు. ఎవరు ముందు ప్రపంచంలోకి వచ్చారో.. వాళ్ళుఅనుభవాన్ని, అవగాహనను ఎక్కువ సాధిస్తారు. మనం ఎంత చదివాం అన్నదానికన్నా... దానికి అనుభవం ఎంత తోడయింది... అన్నది ప్రధానం. ఒక ఉద్యోగానికి వెడితే అనుభవం ఎంత అన్నదాని ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వివాహం విషయంలో.. లోకజ్ఞానం, లోక ప్రవృత్తిని సరిగా అర్థం చేసుకుని భార్యకు అవగాహన కలిగించగలిగిన వాడయి ఉండాలి.అనుభవం అన్నమాటలోనే అంతర్లీనంగా ఉండే విషయం– భార్యపట్ల పరమ ప్రేమతో మెలుగుతూ ఆమెకు రక్షకుడయి ఉండాలన్నది. ఆమె గుణాలు, ప్రతిభ ప్రకాశించడానికి ఆయన అవకాశం కల్పించగలగాలి. ఆమె బలహీనతలు... శారీరకం కావచ్చు, నడవడిరీత్యా కావచ్చు... వాటిని కప్పగలగడంతోపాటూ ఆమె గౌరవమర్యాదలు తగ్గకుండా చూడగలగాలి. సంసారాన్ని సాఫీగా నడపడంలో ఆమెకు ఆయన అనుక్షణం అండగా నిలవాలి. ఒక అమాయకురాలైన కూతురు తెలిసీ తెలియక చేసే తప్పులను తల్లిదండ్రులు ఎలా సరిదిద్దుతూ కాపాడుతుంటారో భార్యను అలా కాపాడుకోగలిగి ఉండాలి. అది భర్త లక్షణం. భార్యది – అంకిత భావం. పిచ్చి ప్రేమ. భర్త ప్రేమకు కారణం ఉంటుంది. భార్య ప్రేమకు కారణం ఉండదు. అనుగమించడం, అంకితభావంలో మసులు కోవడం ఆమె కర్తవ్యం. ఆమెకు ప్రేమను పంచడం, ప్రతి కష్టంలో ఆమెకు రక్షణగా నిలవడం ఆయన బాధ్యత. ఆమెది పాతివ్రత్యం. ఆయనది ఏకపత్నీవ్రతం. అందువల్ల ఎక్కువ తక్కువలను వారి మధ్య ΄ోల్చిచూడకూడదు. కామసంబంధమైన ప్రవత్తి కలిగినా ఆయన దృష్టిలో ఆమె వినా మరొకరికి స్థాన ఉండదు. ఆమెకు ఆయనే సర్వస్వం. ఇది దాంపత్యం. ఇదే గృహస్థాశ్రమం. ఇది సనాతన ధర్మ వైభవం.-చాగంటి కోటేశ్వరరావు -
రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!
సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో జంటగా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఇటీవల బాలీవుడ్లో బిజీ అయిన భామ.. తాజాగా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్‌లో మరింత బోల్డ్‌గా కనిపించి ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా షాకిచ్చింది. సీతారామం చిత్రంలో పద్ధతిగా కనిపించిన భామ.. లస్ట్ స్టోరీస్‌తో ఐ యామ్ నాటీ అని నిరూపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు ఓపెన్‌గానే ఉంటానని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: హైదరాబాద్‌లో ఇల్లు కొన్న మృణాల్ ఠాకూర్? ఆమె ఏమందంటే..) మృణాల్ మాట్లాడుతూ.. 'ముందుగా దేవునికి ధన్యవాదాలు. నేను రిలేషన్స్ గురించి స్వేచ్ఛగా మాట్లాడే జనరేషన్లో పుట్టా. గతంలో నా బ్రేకప్‌ల గురించి మాట్లాడా. దీనివల్ల నా అనుభవాల ద్వారా ఇతరులు నేర్చుకుంటున్నారని భావిస్తున్నా. ప్రస్తుత రోజుల్లో నా చుట్టూ భాగస్వామి లేదా ప్రేమికుడి గురించి మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నందుకు సంతోషిస్తున్నా.' అని అన్నారు. భాగస్వామిని గౌరవించాలి లైఫ్ పార్ట్నర్ గురించి మాట్లాడుతూ.. 'ఎవరైనా సరే మన పార్ట్నర్ మనోభావాలను గౌరవించాలి. మనకు కాబోయే భాగస్వామి తన రిలేషన్ ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటే అలాగే ఉండాలి. నేను ఇండస్ట్రీలో ఉన్నా.. కానీ నా భాగస్వామి ఈ పరిశ్రమకు చెందిన వారు కాకపోవచ్చు. అప్పుడు అతను తన రిలేషన్‌ను పబ్లిక్‌గా ఉంచకూడదనుకుంటే.. అతని గురించి నేను ఎక్కడా చర్చించను.' అని అన్నారు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావని అనుకోవడం లేదని అన్నారు మృణాల్.. ఎందుకంటే ప్రస్తుతం నేను చాలా మెరుగైనస్థితిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. తమ రిలేషన్స్ గురించి ఒపెన్‌గా మాట్లాడిన నీనా గుప్తా , అంగద్ బేడీ, కరీనా కపూర్ ఖాన్, నేహా దుపియాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఇది చాలా సాధారణమైన విషయమన్నారు. కాగా.. మృణాల్ విజయ్ దేవరకొండ సరసన ఒక చిత్రంలో కనిపించనుంది. (ఇది చదవండి: భర్త ఫోటోను షేర్ చేసిన పోకిరి భామ.. కానీ..! ) -
ఇవేం‘రక్త’ సంబంధాలు..ఆస్తి కోసం అయిన వారినే తుదముట్టిస్తున్న వైనం
ఆస్తి కోసం ఒకనాడు అన్నను, ఇప్పుడు తమ్ముడిని హత్య చేశాడో వ్యక్తి. కన్న తండ్రినే చంపేందుకు ప్రయత్నించాడో యువకుడు. వివాహేతర సంబంధం కోసం ఓ భార్య.. భర్తపై హత్యా యత్నం చేస్తే.. ఆవేశంలో అన్నీ మరిచి కన్న తల్లినే చంపిందో కూతురు. బంధాలు, అనుబంధా లన్నీ మాటలకే.. మనిషిలోని మానవత్వం మాయమైపోతోంది. కన్నవారి మీద, తోబుట్టువుల పట్ల కూడా కనీస ప్రేమ కరువైంది. క్షణికావేశమో.. పగ, ప్రతీకారమో.. కుటుంబ సభ్యులను చంపేందుకు వెనుకాడటం లేదు మనిషి. అందుకు ఈ ఘటనలు ఓ ఉదాహరణ మాత్రమే! భర్తపై డీజిల్ పోసి.. నిప్పంటించి.. ♦ ఓ భార్య ఘాతుకం ♦ దాదిగూడ రాంనగర్ కాలనీలో ఘటన జిన్నారం(పటాన్చెరు): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తపై డీజిల్ పోసి హత్య చేసేందుకు ఓ భార్య యత్నించింది. ఈ ఘటన జిన్నారం మండలం ఊట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్ కాలనీలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఊట్ల గ్రామ పంచాయితీ పరిధిలోని దాదిగూడ గ్రామానికి చెందిన సంకు నర్సింహులు(32)కి దుండిగల్‌కు చెందిన యాదమ్మతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు దాదిగూడ సమీపంలోని రాంనగర్ కాలనీ లో ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. భార్యాభర్తలు కూలి పని చేసుకుంటూ బతుకుతున్నారు. యాదమ్మ కొంత కాలంగా వివాహేతర సంబం«ధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త తర చూ కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడేవాడు. ఇదే విషయమై 27వ తేదీ రాత్రి భార్యాభర్తల మధ్య గొ డవ జరిగింది. భర్త తనకు అడ్డంకిగా మారాడని భావించిన యాదమ్మ అత డిని చంపాలని నిర్ణయించుకుంది. గొడవ జరిగాక ఇంటి పక్కనే ఉన్న ఆటో నుంచి డీజిల్ తీసి పెట్టుకుంది. భర్త నర్సింహులు గాఢ నిద్రలోకి వెళ్లాక, రాత్రి 12 గంటల తర్వాత అతడిపై డీజిల్ పోసి నిప్పంటించింది. నర్సింహులు అరుపులతో చుట్టు పక్కల వారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయ త్నించారు. అప్పటికే 60 శాతం గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నర్సింహులు పరిస్థితి విషమంగా ఉంది. నర్సింహు లు తమ్ముడు పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విజయరావు తెలిపారు. యాదమ్మ పోలీసుల అదుపులో ఉంది. తల్లిని రోకలితో బాది.. ♦ ఓ కుమార్తె దుర్మార్గం నందిపేట్(ఆర్మూర్): తల్లీకూతుళ్ల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. కూతురు ఆవేశంలో తల్లిని రోకలితో బాది చంపిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలో వెలుగు చూసింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మెడకు చెందిన నాగం నర్సు(52) భర్త చనిపోవడంతో ఉమ్మెడలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కూతుర్లు హరిత, అరుణ. పెద్ద కూతురు హరిత.. తల్లి ఉండే ఇంట్లోని పక్కగదిలోనే వేరుగా నివసిస్తోంది. కాగా తల్లీకూతుళ్ల మధ్య కొన్నేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మృతురాలి రెండో కూతురు అరుణ ఇంట్లో ఈ నెల 26న తొట్లె ఫంక్షన్ జరిగింది. తల్లి నర్సు, పెద్ద కూతురు హరిత వెళ్లారు. అక్కడ నర్సు.. రెండో కూతురు అరుణ బంధువులతో గొడవపడి వారిని దూషించింది. ఇంటికి తిరిగొచ్చాక శుక్రవారం రాత్రి పెద్ద కూతురు హరితకు, మృతురాలికి మధ్య ఈ విషయంలో గొడవ జరిగింది. హరిత ఆవేశంలో తల్లి తల, ముఖంపై రోకలితో ఇష్టం వచ్చినట్లు కొట్టి వెళ్లిపోయింది. శనివారం రాత్రి తన చెల్లిలికి, బంధువులకు ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని తెలిపింది. వారు వచ్చి చూడగా నర్సు చనిపోయి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతురాలి మేనల్లుడు గణపురం రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆస్తి కోసం తండ్రిపై తనయుడి దాడి ♦ కత్తితో ఇష్టారీతిన పొడిచిన వైనం తొర్రూరు: వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకు.. ఆస్తి కోసం హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్సై లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అమీనాపురం గ్రామ శివారు టీక్యా తండాకు చెందిన మాలోతు రాములు అనే 70 ఏళ్ల వృద్ధుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేసి, తనకున్న మూడెకరాల భూమిని కుమారులిద్దరికి సమానంగా పంచాడు. భూ పంపకాల్లో అన్నకు ఎక్కువ భూమి పంచాడని, కుమార్తెలకు డబ్బులు పంపుతున్నాడని తండ్రితో చిన్న కుమారుడు స్వామి కొంత కాలంగా గొడవపడుతున్నాడు. పలుమార్లు పెద్దమనుషుల్లో పంచాయితీ పెట్టి నచ్చజెప్పినా అతని తీరులో మార్పు రాలేదు. రాములు ఈ నెల 26న దంతాలపల్లి పడమటిగూడెం శివారు చారి తండాలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి ఇంటికివ వెళ్లేందుకు ఆదివారం తొర్రూరు బస్టాండుకు వచ్చాడు. బస్సు కోసం ఎదురుచూస్తున్న తండ్రిని చాటుగా ఫాలో అవుతున్న స్వామి.. హెల్మెట్ ధరించి వెంట తెచ్చుకున్న కత్తితో తండ్రిపై దాడి చేశాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తల, పొట్ట, చేతులపై పదునైన కత్తి గాట్లు పడ్డాయి. బస్టాండ్‌లోని ప్రయాణికులు అడ్డుకోవడంతో అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్ర రక్త స్రావంతో అల్లాడుతున్న వృద్ధుడి గురించి పోలీసులకు అక్కడున్న ప్రయాణికులు సమాచారం అందించారు. పోలీసులు 108లో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. క్షతగాత్రుడి పెద్ద కుమారుడు శంకర్‌నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నాడు అన్నను.. నేడు తమ్ముడిని.. ♦ ఆస్తి కోసం హత్య చేసిన సోదరుడు మద్నూర్(జుక్కల్): ఆస్తి తగాదాలు నిండు ప్రా ణాన్ని బలితీసుకున్నాయి. రక్త సంబంధాన్ని మరిచి తోబుట్టువును దారుణంగా హత్య చేశాడో అన్న. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోనాలలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సోనాలకు చెందిన గంగాధర్, గినాన్బాయికి ముగ్గురు కొడుకులు సంజయ్ పాటిల్, రాజు పా టిల్, విజయ్ పాటిల్(32). వీరికి 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆస్తి విషయంలో గొడవలతో.. గంగాధర్ పెద్ద కొడుకు సంజయ్ పాటిల్‌ను తమ్ముడు రాజు పాటిల్ 2011లోనే హత్య చేసి, శిక్ష అనుభవించాడు. జైలు నుంచి బయటకు వచ్చిన రాజు అప్పటి నుంచి పెద్దపల్లి, హైదరాబాద్‌లలో ఇంగ్లిష్ టీచర్‌గా ప్రైవేటు స్కూళ్లలో పనిచేసేవాడు. కరోనా సమయంలో సొంతూరుకు తిరిగి వచ్చాడు. అయితే గంగాధర్ పేరున ఉన్న 18 ఎకరాల భూమిలోంచి ఐదు ఎకరాల భూమిని అప్పట్లో హత్యకు గురైన సంజయ్ భార్య పేరున చేశారు. 13 ఎకరాల్లోంచి మూడెకరాల భూమిని తమ్ముడు విజయ్ పాటిల్ అమ్మేశాడు. మిగిలిన పదెకరాల భూమిని తాకట్టు పెట్టడంతో రాజుపాటిల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆస్తి పంపకాలు జరగక ముందే ఇష్టారాజ్యంగా ఎట్లా అమ్మారని? భూమి తాకట్టు పెట్టి అప్పు చేయడం ఏమిటని? ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఒడిశా రాష్ట్రానికి వెళ్లి అక్కడే ఏదైనా ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా చేరాలని రాజు పాటిల్ అతడి భార్య సీతిక్ష నిర్ణయించుకున్నారు. అయితే ఆదివారం వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో రాజుపాటిల్ లేచి అదే ఇంట్లో వేరే గదిలో నిద్రిస్తున్న విజయ్పాటిల్ను విచక్షణ రహితంగా పొడిచాడు. మెడ, కాళ్లు, కడుపులో పలుమార్లు పొడవడంతో కడుపులోని పేగులు బయటకు వచ్చి విజయ్ వెంటనే మృతిచెందాడు. అక్కడి నుంచి నేరుగా మద్నూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన రాజు పాటిల్ జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్‌రెడ్డి, బిచ్కుంద సీఐ కృష్ణ, మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడు విజయ్ పాటిల్‌కు ఏడాది క్రితమే పెళ్లి జరిగిందని, భార్యాభర్తల మధ్య గొడవలతో భార్య ఇటీవలే పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పారు. -
ఆ దేశంతో మామూలు సంబంధాలు కావాలి..కానీ ఆ విషయంలో మాత్రం..
పాకిస్తాన్‌తో భారత్ సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటుందని భారత్ ప్రధాని మోదీ అన్నారు. అయితే ఉగ్రవాదం లేని అనుకూలమైన వాతావరణం సృష్టించడం, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో పాక్‌నే భాద్యత వహిస్తుందని మోదీ చెప్పారు. జపాన్‌లో జరిగే జీ7 సదస్సుకు గెస్ట్ కంట్రీగా భారత్ హాజరవనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అతిపెద్ద స్వతంత్ర వ్యాపార మీడియా గ్రూపులలో ఒక్కటైన నిక్కి ఆసియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఉగ్రవాదం విషయంలో పాక్ మద్దతుపై భారత్ పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదం, చర్చలు కలిసి వెళ్లలేవని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా చైనాతో సంబంధాల గురించి ప్రశ్నించిగా..దక్షిణాసియా దేశాల గొంతును, వారి ఆందోళనను తెలియజేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు గురించి మాట్లాడారు. భారత్ తన సౌర్వభౌమాధికారం, గౌరవం కాపాడుకునేందుకు సిద్దంగానే గాక అందుకు కట్టుబడి ఉందన్నారు. 2020లో చైనా సైన్యంతో చర్యలు తర్వాత తూర్ప లడఖ్‌లో ప్రతిష్టంభన ఏర్పడిందన్నారు. ఈ చర్చలు కొన్ని ప్రాంతాలను విడదీసేలా ఘర్షణ కలిగించాయి. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు నెరపాలంటే సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత చాలా అవసరమని చెప్పారు. భారత్-చైనా సంబంధాల భవిష్యత్తు, అభివృద్ధి, పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనాలపై మాత్రమే ఆధారపడి ఉందన్నారు. అంతేగాదు ఇరు దేశాల విస్తృత సంబంధాలు ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు. ఇక రష్యా ఉక్రెయిన్ వివాదంలో భారత్ మధ్యవర్తి పాత్ర పోషించగలదా అని సంధించిన ప్రశ్నకు..ఉక్రెయిన్ వివాదంపై తమ దేశం వైఖరి స్పష్టంగా తిరుగులేనిదని మోదీ చెప్పారు. భారత్ ఎప్పుడూ శాంతివైపు నిలుస్తుంది. ప్రాథమిక అవసరాలను తీర్చడంలో సవాళ్లను ఎదుర్కొనే వారికి మద్దతు ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్లతో తాము కమ్యూనికేషన్ కొనసాగిస్తామన్నారు. సహాయ సహకారాలతో సమయాన్ని నిర్వచించాలి గానీ సంఘర్షణతో కాదు అని చెప్పారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన వంటి విలువలే జపాన్, భారత్‌ని మరింత దగ్గర చేశాయని ప్రధాని మోదీ అన్నారు. తాము ఇప్పుడూ ఆర్థిక ప్రయోజనాల్లో పెరుగుతున్న రాజకీయ, వ్యూహాత్మక భద్రత కలయికను చూస్తున్నాం అని చెప్పారు. ఇదిలా ఉండగా జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం జపాన్‌లోని హిరోషిమా చేరుకున్నారు. ఈ సమ్మిట్‌కు భారత్‌ను అతిధిగా ఆహ్వానించారు. 2003 నుంచే జీ7 సదస్సులో భారత్ పాల్గొంటోంది. (చదవండి: నాడు అద్దె గదిలో జూనియర్ లాయర్‌గా ప్రారంభమై..నేడు సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి..) -
కవ్వింపులకు దిగితే మోదీ సర్కారు సహించబోదు: అమెరికా నిఘా వర్గాలు
వాషింగ్టన్: పాకిస్తాన్, చైనాలతో భారత్ సంబంధాలు నానాటికీ మరింతగా క్షీణిస్తున్నాయని, పెరుగుతున్న ఉద్రిక్తతలు సాయుధ ఘర్షణకూ దారితీసే ఆస్కారం లేకపోలేదని అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా పాక్ కవ్వింపులను భారత్ గతంలోలా సహించే పరిస్థితి లేదు. మోదీ హయాంలో పాక్‌పై సైనిక చర్యకు దిగే అవకాశముంది’’ అని అంచనా వేశాయి. అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో ఈ మేరకు పొందుపరిచాయి. ‘‘ముఖ్యంగా భారత వ్యతిరేక ఉగ్రవాద తండాలకు మద్దతిచ్చిన సుదీర్ఘ చరిత్ర పాక్‌ది. అందుకే ఇకపై పాక్ కవ్విస్తే మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండబోదు’’ అని నివేదిక అభిప్రాయపడింది. చైనాతో కూడా పలు సరిహద్దు సమస్యలను భారత్ చర్చల ద్వారా పరిష్కరించుకున్నా 2020 గల్వాన్ ఘర్షణ, తాజాగా అరుణాచల్ సరిహద్దుల వద్ద గొడవ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచాయని పేర్కొంది. చైనాతో అమెరికాకు పెనుముప్పు అమెరికా జాతీయ భద్రతకు, అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ స్థానానికి చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి అత్యంత ముప్పు పొంచి ఉందని యూఎస్ నిఘా విభాగపు నివేదిక అభిప్రాయపడింది. ‘‘రష్యాతో ఏడాదిగా చైనా బంధం బలపడుతున్న తీరు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. నానాటికీ పెరుగుతున్న ఈ చైనా సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి’’ అని ప్రభుత్వానికి సూచించింది. సెనేట్ సెలెక్ట్ కమిటీ సభ్యులకు నిఘా నివేదిక సమర్పించిన సందర్భంగా నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. -
ఆ పొత్తు చైనాకు తప్పదా?
చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్‌లో తిరుగులేని అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇంటా బయటా సమస్యలనూ, విమర్శలనూ ఎదుర్కొంటున్నారు. అమెరికా నేతృత్వంలో చైనాపై ఆంక్షలు మరింత పెరగడం, ఆసియాలో తన బలమైన పోటీదారైన భారత్‌కు పాశ్చాత్య పెట్టుబడులు తరలిపోతుండటం జిన్‌పింగ్‌కి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. నూరు చైనా కంపెనీలకు మైక్రోచిప్‌ల ఎగుమతిపై అమెరికా, దాని మిత్రదేశాలు కొనసాగిస్తున్న ఆంక్షలు జిన్‌పింగ్‌ను కలతపెడుతున్నాయి. దీంతో పాలనా విధానాలు, సంస్కరణలపై తన వైఖరిని ఆయన సడలించుకుంటున్నారు. అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా అనేక చర్యలు తీసుకున్నారు. జీరో–కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా నవంబర్‌లో చైనావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్త డంతో గత మూడు నెలలుగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేరు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయి. ప్రజానిరసనల తర్వాత జిన్‌పింగ్ తన పాలసీని వదిలేయవలసి వచ్చింది. దీంతో చైనాలో కోవిడ్–19 ఇన్ఫెక్షన్ల వేవ్స్ ఉద్ధృతంగా వ్యాపించాయి. నూతన సంవత్సర వేళ తాను చేసిన ప్రసంగంలో, తన జీరో–కోవిడ్ పాలసీపై వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత గురించి జిన్‌పింగ్ తప్పకుండా ప్రస్తావించాల్సి వచ్చింది. ‘‘ఒక పెద్ద దేశంలో ఒకే సమస్యపై వివిధ రకాల ప్రజలు వివిధ రకాల అభిప్రాయాలను కలిగి ఉండటం సహజం’’ అని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల జనాభాలో అత్యధిక శాతం మందికి ఇన్ఫెక్షన్లు సోకాయి. వృద్ధులు, ఇతర వ్యక్తులు పెద్ద సంఖ్యలో మరణించారు. అనేక ప్రాపర్టీ కంపెనీలు దివాలా తీయడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అనేక కంపెనీలు మూసివేతకు గురవడంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో జిన్‌పింగ్ పాలనకు వ్యతిరేకంగా అసమ్మతి గణనీయంగా పెరిగిపోయింది. దేశీయ శాంతి, సుస్థిరత, పాలనా నిర్వహణ జిన్‌పింగ్‌కే కాకుండా చైనా కమ్యూనిస్టు పార్టీ పాలనకు కూడా అత్యంత ప్రాధాన్యం కలిగిన విషయం. దీంతో తన పాలసీలపై విమర్శను అడ్డుకోవడానికి జిన్‌పింగ్ అతి చురుకుగా పనిచేయాల్సి వచ్చింది. ఆయన తన నూతన సంవత్సర ప్రసంగంలో అమెరికా, తదితర దేశాలకు చేరువ కావడం కోసం చైనా మాతృభూమితో తైవాన్ పునరేకీకరణ అనే ఊతపదాన్ని వదిలేసుకున్నారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలు ఒకే కుటుంబ సభ్యులు అని చెప్పారు. శరవేగంగా చైనా జాతి శ్రేయస్సు సాధించడానికి తమ రెండు దేశాలూ కలిసి పనిచేస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. స్వదేశంలోని విభిన్న గ్రూపులతో మాట్లాడుతున్న సమయంలో తన జీరో–కోవిడ్ పాలసీని జిన్‌పింగ్ సమర్థించుకున్నారు. ఇది దేశంలో కేసుల నిష్పత్తిని తగ్గించిందనీ, మరణాల రేటును అత్యంత తక్కువ శాతానికి తగ్గించివేసిందనీ చెప్పారు. అయితే జి¯Œ పింగ్‌ను దుర్వార్తలు వెంటాడుతున్నాయి. 2022లో చైనా జనాభా 8.5 లక్షల మేర పడిపోయిందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ జనవరి 17న ప్రకటించింది. వరదలు, కరవుల కారణంగా, మావో అమలుపర్చిన గొప్ప ముందంజ పారిశ్రామిక విధానం 1961లో కుప్పకూలిన తర్వాత చైనాలో జనాభా తగ్గిపోవడం ఇదే మొదటిసారి. దారిద్య్రాన్ని వేగంగా అధిగమించడానికి ఒకే సంతానం పాలసీని దాని దీర్ఘకాలిక పర్యవసానాలపై అధ్యయనం చేయకుండానే అమలు చేయాలని 1979లో చైనా పాలకులు నిర్ణయించడంతో చైనా జనాభా తగ్గుతూ వస్తోంది. అమెరికాకు చెందిన పరిశోధకుడు ప్రొఫెసర్ యి ఫుక్సియన్ ప్రకారం, చైనాలో సంతాన సాఫల్య రేటు 1.3 శాతానికి పడిపోయింది. (జనాభా భర్తీ రేటు 2.1 శాతం). దేశం తన సంతాన సాఫల్య రేటును 1.2 శాతం వద్ద స్థిరపర్చగలిగితే చైనా జనాభా 2050 నాటికి 1.07 బిలియన్లకు, 2100 నాటికి 48 కోట్లకు పడిపోతుంది. జనాభా తగ్గి పోవడం అంటే... ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవటం, వృద్ధుల ఆరోగ్య సమస్యలపై ఖర్చు పెరగడం, సామాజిక సంక్షేమ అవసరాలు కుంచించుకుపోవడం, పొదుపు మొత్తాలు తగ్గిపోవడం, వీటికి మించి వస్తూ త్పత్తి, ఎగుమతులు, ప్రభుత్వ ఆదాయాలు పడిపోవడం, ప్రజల కొను గోలు శక్తి సన్నగిల్లిపోవడం, ఆర్థిక వృద్ధి పతనమవడం అని అర్థం. పైగా దేశ వస్తూత్పత్తి రంగం, వ్యవసాయం, శ్రమశక్తి, సామగ్రి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, విద్యుత్ తదితర రంగాల్లో మరింతగా రోబోలను దింపాలని చైనా పథకరచన చేసింది. అయితే ఇప్పటికే ప్రతి 10 వేలమంది ప్రజలకు 322 రోబోలను అందుబాటులో ఉంచిన చైనాపై తాజా పథకం చూపే ప్రభావం పెద్దగా ఉండదు. ప్రపంచ రోబోటిక్స్ రిపోర్ట్–2022 ప్రకారం రోబోల వినియోగంలో అమె రికాను చైనా అధిగమించడమే కాక, ప్రపంచంలో రోబోల వినియోగంలో అయిదో స్థానంలో నిలిచింది. నూరు చైనా కంపెనీలకు మైక్రోచిప్‌ల ఎగుమతిపై అమెరికా, దాని మిత్రదేశాలు కొనసాగిస్తున్న ఆంక్షలకు సంబంధించిన వార్తలు కూడా జిన్‌పింగ్‌ను కలతపెడుతున్నాయి. దీనికి తోడు చైనాను ‘కనీవినీ ఎరుగని వ్యూహాత్మక సవాలు’గా అభివర్ణించిన జపాన్ 2027 నాటికి జీడీపీలో రక్షణ బడ్జెట్ 2 శాతం పెంచాలని నిర్ణయించుకుంది. అంతేకాక చైనాకు, ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా జపాన్ కొత్త క్షిపణులు, మానవ రహిత వ్యవస్థలకు చెందిన టెక్నాలజీలు, సైబర్ స్పేస్, అంతరిక్షం, ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్, కృత్రిమ మేథ వంటి ఎదురుదాడి సామర్థ్యాలను మిక్కుటంగా సేకరించనుంది. 2046 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 26 లక్షల డాలర్లకు చేరుకుంటుందనీ, 2025 నాటికి చైనా నుంచి 25 శాతం అమెరికన్ సెల్ఫోన్ల ఉత్పత్తిని భారత్‌కు తరలించాలనీ అమెరికా సెల్‌ఫోన్ మాన్యు ఫ్యాక్చరింగ్ సంస్థ యాపిల్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రకటించిన అంచనాలు జిన్‌పింగ్‌కి సంతోషం కలిగించవు. ఆసియా ప్రాంతంలో భారత్ పురోగతిని అడ్డుకుని తన ఆధిక్యాన్ని చాటుకోవాలని చైనా ఇప్పటికే లక్ష్యం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చైనా ఆర్థిక శక్తిని బలహీనపర్చడానికి భారత్ – అమెరికా పొత్తు పెట్టుకోవడం మరో ఉదాహరణగా జిన్‌పింగ్ అభిప్రాయ పడవచ్చు. ఈ అన్ని పరిణామాల వెలుగులో అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా జిన్‌పింగ్ అనేక చర్యలు తీసుకున్నారు. మొదటి చర్యగా అమెరికా ప్రభుత్వంపై వాడే తీవ్ర పదజాలాన్ని చైనా ప్రభుత్వం తగ్గించుకుంది. విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రత, ద్రవ్యవ్యవస్థ, పర్యావరణ మార్పు తదితర మంత్రిత్వ శాఖలతో భేటీకి చైనా అధ్యక్షుడు సమ్మతి తెలియజేశారు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా తదితర దేశాలు చేసే చిన్న విమర్శలను కూడా తీవ్ర పద జాలంతో తిప్పికొట్టే ధోరణిని జిన్‌పింగ్ మంత్రులు ఇప్పుడు పక్కన పెట్టేశారు. తమ పట్ల అమెరికాకు మించి మరింత స్వతంత్ర వైఖరితో వ్యవహరిస్తున్న జర్మనీ, ఫ్రా¯Œ ్స, ఇటలీ దేశాలతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా చైనా తహతహలాడుతోంది. గ్లోబల్ పెట్టుబడికీ, మార్కెట్ సంస్కరణలకూ తలుపులు తెరిచి మార్పునకు తాము సిద్ధమేనంటూ సంకేతాలు వెలువరించడంలో భాగంగా దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సమాఖ్య వార్షిక సదస్సుకు చైనా ప్రతినిధిగా చైనా ఉప ప్రధాని, తన పూర్వ ఆర్థిక సలహాదారు అయిన లియూ హేని చైనా అధ్యక్షుడు పంపించారు. పాశ్చాత్య బడా కంపె నీలకు లియూ హే సుపరిచితుడు కావడం విశేషం. అయితే 2022 అక్టోబర్‌లో జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్ సందర్భంగా లియూ హేని పోలిట్ బ్యూరో పదవి నుంచి జిన్‌పింగ్ తొలగించడం విశేషం. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అవలంబించిన లోపభూయిష్ఠ విధానాల కారణంగా అమెరికా, పలు యూరోపియన్, ఆసియా దేశాల, కంపెనీల విశ్వాసం దారుణంగా దెబ్బతింది. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వాతావరణం నుంచి బయటపడే ఎత్తుగడలో భాగంగా మాత్రమే జిన్‌పింగ్ విధానాల్లో వెనుకడుగు వేస్తున్నారనీ, తన వైఖరిని మార్చుకుంటున్నారనీ విదేశీ కంపెనీలు భావిస్తున్నాయి. చైనా ఆర్థిక ప్రగతిని బలహీనపరచడానికి ఆ దేశంపై తమ ఒత్తిడిని ఇవి కొనసాగించనున్నాయి. జిన్‌పింగ్ దూకుడునూ, ఆధిపత్యాన్నీ ప్రతిఘ టించడానికి చైనా సాంకేతిక పురోగతిని దెబ్బతీయాలని కూడా ఇవి గతంలోనే నిర్ణయించుకున్నాయన్నది గమనార్హం. యోగేశ్ గుప్తా వ్యాసకర్త మాజీ రాయబారి (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఉగ్రవాదులతో సంబంధాలు.. నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
శ్రీనగర్: ఉగ్రవాదులతో సంబంధాలున్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం వేటు వేసింది. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చీఫ్‌నని ప్రకటించుకున్న సయ్యద్ సలాహుద్దీన్ కుమారుడు, జైల్లో ఉన్న వేర్పాటువాద నాయకుడు బిట్టా కరాటే భార్యతో సహా నలుగురిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ శనివారం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్న వారితో సంబంధాలుండడంతో వారిని ఉద్యోగుల నుంచి తీసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాద సంస్థలతో లింకులుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ప్రభుత్వ పరమైన ఎలాంటి విచారణ చేయకుండా ఉద్యోగాలను తొలగించే అధికారం ప్రభుత్వాలకి ఉంటుంది. వాణిజ్య, పరిశ్రమల శాఖలో పని చేస్తున్న సయ్యద్ అబ్దుల్ ముయీద్, జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ అసాబ్ ఉల్ అర్జామంద్ ఖాన్ (ఫరూక్ అమ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటె భార్య) , కశ్మీర్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తగా పని చేస్తున్న డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్, కశ్మీర్ యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ప్రొఫసర్‌గా పని చేస్తున్న మజీద్ హుస్సేన్ ఖాద్రిలు ఉద్యోగాలు కోల్పోయారు. సోంపెరాలోని జమ్మూ కశ్మీర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (జేకేఈడీఐ) కాంప్లెక్స్‌లో జరిగిన పేలుళ్లతో అబ్దుల్ ముయీద్‌కు సంబంధం ఉంటే, అర్జామంద్‌ఖాన్‌కు పాస్‌పోర్టు కోసం తప్పుడు సమాచారం అందించారు. డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్ యూనివర్సిటీల్లో విద్యార్థుల్ని భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా పాఠాలు బోధిస్తూ ఉంటే, మరో ప్రొఫెసర్ మజీద్ హుస్సేన్‌కు నిషిద్ధ లష్కరేతోయిబా సహా పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి. సయ్యద్ సలాహుద్దీన్ కుమారులు ఇద్దరు గతంలోనే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మూడో కుమారుడిపైన కూడా వేటు పడింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలతో లింకులున్న దాదాపుగా 40 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. -
భర్తను పరస్త్రీతో పంచుకోవడం కంటే.. చావే మేలు అనుకుంది!
భర్త విషయంలో భారతీయ స్త్రీలు విపరీతమైన ఆలోచనా ధోరణితో ఉంటారని, తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకుంటారని, పరాయి స్త్రీతో బంధాన్ని పంచుకోవడానికి ఏమాత్రం సహించబోరని అలహాబాద్(ఉత్తర ప్రదేశ్) హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహిత మహిళలు భర్త తమకు మాత్రమే సొంతం అనుకుంటారు. వాళ్ల గురించి విపరీతంగా ఆలోచిస్తుంటారు. ఒకవేళ అతను గనుక వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నా, వివాహం చేసుకోవాలనుకునే ప్రయత్నం.. చివరికి ఆలోచనా చేసినా అది ఆ భార్యను కుదిపేసే అంశమే. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తీవ్ర నిర్ణయాలే తీసుకుంటారు. ఈ కేసులోనూ అదే జరిగింది అంటూ జస్టిస్ రాహుల్ చతేర్వేది నేతృత్వంలో ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. తన భర్త రహస్యంగా మరో మహిళను వివాహం చేసుకోబోతున్నాడని, లేదంటే వివాహం చేసుకున్నాడనే ఒక్క కారణం చాలూ.. ఆమె తన ప్రాణం తీసుకునేందుకు అంటూ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాలు.. వారణాసి మాండువాది చెందిన సుశీల్ కుమార్ అనే వ్యక్తి, అతని కుటుంబం మీద అతని భార్య చనిపోయే ముందు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వాళ్ల మీద కేసు నమోదు అయ్యింది. అయితే భార్య ఆత్మహత్యకు తామేమీ కారణం కాదని, కేసుల నుంచి ఉపశమనం ఇప్పించాలని సుశీల్ కోర్టులను ఆశ్రయించాడు. అయితే సుశీల్ కుమార్‌కు ఇదివరకే రెండు వివాహాలు అయ్యాయని, మరో వివాహం చేసుకోవడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ధృవీకరించినట్లయ్యింది. -
బంధువులు ఇచ్చే బహుమతులయితే ఒకే.. లేదంటే పన్ను కట్టాల్సిందేనా ?
ప్ర. బహుమతులను ఆదాయంగా పరిగణిస్తారా? – యం. రామ్ గౌడ్, నిజామాబాద్ జ. బంధువుల నుంచి వచ్చే బహుమతులను ఆదాయంగా పరిగణించరు. అంటే, ఎటువంటి పన్ను భారం ఉండదు. కానీ స్నేహితుల నుండి తీసుకుంటే అటువంటి మొత్తాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. మీరు ముందుగా బంధువు నిర్వచనాన్ని తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి సంబంధించి ఈ కింది వారు బంధువుల జాబితాలోకి వస్తారు. 1. జీవిత భాగస్వామి 2. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు 3. జీవిత భాగస్వామి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు 4. తల్లిదండ్రులు, వారి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు 5. అటు తరం, ఇటు తరం వంశస్థులు (ముత్తాత, తాత, నాన్న, కొడుకు, మనవడు, మునిమనవడు) 6. జీవిత భాగస్వామి యొక్క అటు తరం, ఇటు తరం వంశస్థులు 7. (2) నుండి (7)వరకు పేర్కొన్న వారి జీవిత భాగస్వాములు బీరకాయ పీచు బంధుత్వం ఒక విధంగా చెప్పాలంటే ‘బంధువు‘ నిర్వచనం అనేది దగ్గర వాళ్లందరినీ చుట్టబెట్టేస్తుందని చెప్పాలి. ఈ పరిధి దాటి వెళ్లకండి. ఎత్తేస్తే ఏడు చెక్కలయ్యే బంధువుల దగ్గరకి, బీరకాయ.. బెండకాయ పీచు చుట్టాలు..బాదరాయణ సంబంధాల జోలికి వెళ్లకండి. ఇక బంధువుల నుంచి వచ్చేవే కాకుండా మరికొన్ని బహుమతులకు కూడా మినహాయింపు ఉంది. ఒక వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 విలువ దాటి బహుమతులు వస్తే మొత్తం విలువ మీద ఎటువంటి బేసిక్ లిమిట్ లేకుండా ఆదాయంగా భావిస్తారు. కానీ ఈ కింది సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది. 1. వివాహ సందర్భంలో 2. వీలునామా ద్వారా 3. ఇచ్చే వ్యక్తి (దాత) చనిపోయే సందర్భంలో 4. స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వైద్య సంస్థలు, ట్రస్టులు మొదలైనవి ఇచ్చినవి (కొన్ని పరిమితుల మేరకు) 5.‘బదిలీ‘ కాని వ్యవహారాల నుండి వచ్చినవి అయితే, వ్యవహారం జరిపే ముందు తగిన జాగ్రత్త వహించాలి. దాత ఎవరైనా సరే మూడు విషయాలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు 1. దాత ఐడెంటిటీ (డమ్మీని సృష్టించకండి) 2. ఇచ్చే విషయంలో దాత సామర్థ్యం (దాతకు నిర్దిష్ట సోర్స్ ఉండాలి) 3. వ్యవహారానికి సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు ఇవి చూపించకపోతే, స్థాపించకపోతే ఈ మొత్తాన్ని మీ ఆదాయంగా పరిగణించే అవకాశం ఉంది. ప్ర. ఆదాయపు పన్ను రిటర్నులలో ఏమేమి ఫారాలు దాఖలు చేయాలి? – మహ్మద్ ఖదీర్ బాషా, నల్గొండ జ. ఒక్క వాక్యంలో చెప్పాలంటే రిటర్నులతో పాటు ఏ కాగితం దాఖలు చేయనక్కర్లేదు. ఇప్పుడు అమలవుతున్న నియమం ప్రకారం ఎటువంటి అటాచ్మెంటు ఇవ్వనవసరం లేదు. ఆన్లైన్లో వేసినా, ఆఫ్‌లైన్‌లో వేసినా ఇదే రూలు. అయితే, మీరు ఒక స్టేట్మెంట్ తయారు చేసుకోండి. అన్ని సోర్స్‌లకు సంబంధించి ఆదాయాలు, లెక్కలు, కాగితాలు, రుజువులు, సర్టిఫికెట్లు, టీడీఎస్ పత్రాలు, ట్యాక్స్ చలాన్లు, ఫారం 16, ఫారం 16 అ, ఫారం 26 అ , ధృవపత్రాలు, కన్ఫర్మేషన్ లెటర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, ఈమెయిల్స్, బ్యాంకు అకౌంటు స్టేట్మెంట్లు, అగ్రిమెంట్లు, సేల్ డీడ్లు, డివిడెండు వారంట్లు .. ఇలా అవసరమైనవన్నీ భద్రపర్చుకోండి. కేసీహెచ్ ఏవీఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు చదవండి: సీనియర్ సిటిజన్లకు ‘పన్ను’ లాభాలు -
పోటాపోటీ పెద్దన్నలు!
ఒకరు అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు బైడెన్... మరొకరు అగ్రస్థానానికి దూసుకువస్తున్న చైనా దేశాధినేత షీ జిన్‌పింగ్. ప్రపంచాన్ని శాసించే విషయంలో నువ్వా నేనా అంటూ పోటీపడుతున్న ఈ రెండు దేశాల అధినేతలూ కలసి మాట్లాడుకొంటే, అంతకన్నా పెద్ద వార్త ఏముంటుంది? వీడియో కాన్ఫరెన్స్‌లో అయితేనేం, సోమవారం నాటి ఈ అగ్రజుల భేటీ మీద అందరి దృష్టీ పడింది అందుకే! కానీ, చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అమెరికా... తైవాన్ అంశంలో అమెరికా వేలు దూర్చాలనుకోవడం నిప్పుతో చెలగాటమని హెచ్చరించిన చైనా... – ఇలాంటివే పతాక శీర్షికలకు ఎక్కాయి. అంటే, మూడున్నర గంటలు సాగిన ఈ భేటీ నిజంగా సాధించినదేమిటని అనుమానం రాక మానదు. రెండు దేశాల మధ్య అనేక విభేదాలున్నాయనీ, పోటీ తప్పదనీ మినహా ఈ చర్చల్లో తేలిన విషయం, చెప్పుకోదగ్గ విజయం ఏమిటన్నది విశ్లేషకులను వేధిస్తున్న ప్రశ్న. ఈ స్థాయి చర్చలు ముగిశాక సాంప్రదాయిక సంయుక్త ప్రకటనైనా వెలువడకపోవడం గమనార్హం. ఇద్దరు నేతలూ ఈ ఏడాది రెండుసార్లు ఫోన్లలో మాట్లాడుకున్నా, ఈ వీడియో భేటీ అనేక అంశాలపై లోతైన చర్చకు తావిస్తుందని అందరూ ఆశించారు. కానీ, ‘ఈ భేటీతో మేమేమీ అద్భుతాలు ఆశించలేదు. అదే జరిగింది’ అని తేల్చేశారో అమెరికన్ అధికారి. అయితే, నికర విలువ పరంగా, అమెరికాను దాటుకొని, ప్రపంచంలోనే ధనిక దేశంగా నంబర్ వన్ స్థానానికి చైనా ఎగబాకిందని తాజా మెకిన్సే నివేదిక తేల్చింది. ఆ పురోగతికి తగ్గట్టే, వాషింగ్టన్కు సమవుజ్జీ తామేనని బీజింగ్ భావిస్తున్నట్టు చర్చల్లో ఆ దేశాధ్యక్షుడి వైఖరి చెప్పకనే చెప్పింది. మానవ హక్కుల గురించి, ఉపఖండంలో దూకుడు గురించి అమెరికా సుద్దులు చెబితే చైనా డూడూ బసవన్నలా తల ఊపే పరిస్థితి కనపడలేదు. పైపెచ్చు, తాము అంతర్భాగమని భావించే తైవాన్ స్వాతంత్య్రంపై జోక్యం చేసుకుంటే తస్మాత్ జాగ్రత్త అని చైనా మాటకు మాట అప్పగించింది. ఆత్మవిశ్వాసంతో, నిక్కచ్చిగా మాట్లాడుతున్న చైనా మాటలను అమెరికా సావధానంగా వినక తప్పలేదు. అంతే కాదు... ‘మేము ప్రధాన ప్రపంచ లీడర్. అలాగే మీరు కూడా’ అని చైనాతో అమెరికా అంటే అది సహజం. కానీ ఈ భేటీలో బైడెన్, షీని ఉద్దేశించి, ‘మీరు (చైనా) ప్రధాన ప్రపంచ లీడర్. అలాగే అమెరికా కూడా’ అంటూ, చైనాకు పెద్ద పీట వేసి మాట్లాడడం మారిన పరిస్థితులకు ప్రత్యక్ష నిదర్శనం. చైనా జోరుకు బ్రేకులు పడేలా, భావసారూప్యం ఉన్న ప్రజాస్వామ్య దేశాలతో కలసి ‘క్వాడ్’ సహా రకరకాల పేర్లతో జట్టు కట్టడం అమెరికా వ్యూహం. ఈ వ్యూహాన్ని చైనా పరోక్షంగా ప్రస్తావించింది. శిబిరాల ఏర్పాటు వల్ల ప్రపంచానికి మళ్ళీ ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఉత్పాతం తప్ప ఒరిగేదేమీ లేదన్న షీ జిన్‌పింగ్ వ్యాఖ్య తీవ్రమైనదే. బైడెన్ సైతం షింజియాంగ్, టిబెట్, హాంగ్‌కాంగ్‌లలో చైనా అనుసరిస్తున్న విధానాలు, మానవ హక్కుల ఉల్లంఘన వార్తల లాంటి ఘాటైన అంశాలను నిర్మొహమాటంగా షీతో ప్రస్తావించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సముద్రయాన ప్రాధాన్యం గురించి లేవనెత్తారు. అదే సమయంలో పరస్పరం పోటీపడినప్పటికీ, ఘర్షణకు దిగకుండా, పర్యావరణ మార్పు లాంటి ఉమ్మడి ప్రయోజనాలున్న కీలక అంతర్జాతీయ అంశాల్లో కలసి పనిచేయాలంటూ అమెరికా అనడం ఆహ్వానించదగినది. ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం అంతర్జాతీయ బాధ్యతలలో ఇరుదేశాలూ భుజం కలపాలని చైనా అధినేత సైతం అంగీకరించారు. కానీ, వాస్తవంగా వాటి గురించి ఈ భేటీలో ఎంత చర్చ జరిగిందంటే, మళ్ళీ ప్రశ్నార్థకమే. ఇటీవలే ముగిసిన ప్రపంచ పర్యావరణ సదస్సు ‘కాప్–26’ సైతం పర్యావరణ పరిరక్షణకు అగ్రరాజ్యాలు చేయాల్సిన త్యాగాలను కుండబద్దలు కొట్టింది. ఆ సదస్సులో ఇరుదేశాల ప్రతినిధులూ ఒప్పందం కుదుర్చుకున్నా, ఇప్పుడీ భేటీలో అంతకు మించిన ఆచరణాత్మక ప్రణాళికను ప్రకటించే చొరవ దేశాధ్యక్షులు తీసుకోలేదు. కానీ పనిలో పనిగా అనేక అంశాల్లో చైనా తనను తాను సమర్థించుకుంది. భారత్‌తో వాస్తవాధీన రేఖ వెంట, జపాన్‌తో సముద్రజలాలపైన చైనా ప్రదర్శిస్తున్న దూకుడుపై వస్తున్న విమర్శలను తగ్గించే ప్రయత్నం చేసింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆవిర్భావం నుంచి ఇప్పటి దాకా చైనా తనకు తానుగా ఏ యుద్ధాన్నీ మొదలుపెట్టలేదనీ, ఇతర దేశాల నుంచి అంగుళమైనా ఆక్రమించలేదనీ, దురాక్రమణ – ఆధిపత్యం తమ రక్తంలోనే లేవనీ నాణేనికి ఒక వైపునే చూపెట్టింది. ప్రజాస్వామ్యమనేది ఏకరూప నమూనాలో ఉండదనీ, తమదైన పద్ధతిలో లేవని ఆ ప్రజాస్వామ్యాలను కొట్టిపారేస్తే అది అప్రజాస్వామికమనీ అమెరికాకు పాఠాలూ చెప్పింది. ట్రంప్ కాలం నుంచి ఇరుదేశాలూ వాణిజ్య, సాంకేతిక పోటీ విషయంలో వాదులాడుకుంటున్నాయి. అలాగని సరఫరా వ్యవస్థల కొరత, ద్రవ్యోల్బణం, ట్యారిఫ్లను తగ్గించే అవకాశం లాంటి ఆర్థిక అంశాలేవీ తాజా భేటీలో చర్చించినట్టు లేరు. ఇకపై జరిగే వాణిజ్య చర్చల్లో చైనా పట్ల అమెరికా కొంత మెత్తబడేందుకు ఈ పెద్దల వర్చ్యువల్ భేటీ దారులు వేస్తుందని చైనా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ‘పోటీ ఓకే కానీ, పోరాటం వద్దు. పర్యవసానంగా సంబంధాలు చెడగొట్టుకోవద్దు’ అన్నదే ఈ పెద్దన్నల మాటల్లో తేలిన విషయం. ఈ మార్చిలో అలాస్కాలో రెండు దేశాల సీనియర్ అధికారుల మధ్య రెండు రోజుల పాటు మూడు రౌండ్ల చర్చల వేళ నిందారోపణలు బయటపడితే, ఈసారి స్వరం మారడం కొంత శుభసూచకం. విభేదాలున్నా, అవి విపరీత ఘర్షణకు దారితీయకూడదన్న వివేకం ప్రపంచానికి మంచిదే! ఇటుపై దీన్ని ఎలా ముందుకు తీసుకెళతారో చూడాలి. -
ఐటీ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. తమ సెనేట్‌లో ఈ నెల 29న జరిగే ‘యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం 2021’సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాల్సిందిగా ఫ్రాన్స్ ప్రభుత్వం కేటీఆర్‌ను ఆహ్వానించింది. తమ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ సారథ్యంలో జరిగే ఈ సదస్సుతో రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతాయని కేటీఆర్‌కు పంపిన లేఖలో ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ తదనంతరం భారత్, ఫ్రాన్స్ సంబంధాల్లో అభివృద్ధి, భవిష్యత్తు నిర్మాణం అనే అంశంపై ప్రసంగించాలని కోరింది. ఈ సదస్సులో గతంలో కంటే ఎక్కువ కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని, ఇలాంటి కీలకమైన వేదిక తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌కు పంపిన లేఖలో ఫ్రెంచ్ ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా ఈ సదస్సులో ఆరోగ్య రక్షణ, వాతావరణ మార్పులు, వ్యవసాయ వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుందని వివరించింది. దీంతో పాటు ఫ్రాన్స్, భారత కంపెనీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయని మంత్రికి పంపిన ఆహ్వాన లేఖలో పేర్కొన్నారు. కాగా, ఫ్రాన్స్ ప్రభుత్వ ఆహ్వానంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించే వీలు కలుగుతుందని, ఫ్రాన్స్ దేశ ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ విధానాలను దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. -
పోలీసులపై ఫిర్యాదుల విచారణకు స్థాయీ సంఘం
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ నాయకులకు, పోలీసు అధికారులకు మధ్య ఉండే సన్నిహిత సంబంధాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీల అండ చూసుకొని బ్యూరోక్రాట్లు ,ముఖ్యంగా పోలీసు అధికారులు ఎలా ప్రవర్తిస్తారో తనకు తెలుసునన్నారు. పోలీసుల అకృత్యాలపై అందిన ఫిర్యాదులను విచారించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సస్పెండైన పోలీసు అధికారి గుర్జీందర్ పాల్ సింగ్ తనపై దేశద్రోహం, అవినీతి, బలవంతపు వసూళ్లకు సంబంధించి నమోదైన క్రిమినల్ కేసుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం విచారించింది. నేతల అండతో చెలరేగే పోలీసు అధికారుల్ని న్యాయవ్యవస్థ కాపాడలేదని సీజేఐ వ్యాఖ్యానించారు. పోలీసు అధికారుల దౌర్జన్యాలపై దాఖలైన పిటిషన్ల విచారణకు స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉందని చెప్పారు. -
11 మంది ‘ఉగ్ర’ ఉద్యోగుల తొలగింపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. వారికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని, బలగాల కదలికలను గురించి ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చారనే అభియోగాల మీద జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత అధికారులు వారిని తొలగించినట్లు శనివారం ప్రకటించారు. తొలగింపునకు గురైన వారిలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ చీఫ్ సలాహుద్దీన్ కుమారులు సయీద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసుఫ్‌లు ఉన్నారని పేర్కొన్నారు. తొలగించిన వారిలో పోలీస్, విద్య, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, విద్యుత్, ఆరోగ్య శాఖలకు చెందిన వారు ఉన్నారని వెల్లడించారు. వీరిలో నలుగురు అనంతనాగ్, ముగ్గురు బుద్గమ్‌కు చెందిన వారు కాగా.. బారాముల్లా, శ్రీనగర్, పుల్వామా, కుప్వారా జిల్లాల నుంచి ఒకరు చొప్పున ఉన్నట్లు తెలిపారు. వీరందరిని భారత రాజ్యాంగంలోని 311వ ఆర్టికల్ ద్వారా తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ ద్వారా ఉద్వాసనకు గురైతే వారు హైకోర్టులో మాత్రమే ఆ నిర్ణయాన్ని సవాలు చేయగలరు. రెండు సమావేశాల్లో.. కశ్మీర్‌కు చెందిన ఉన్నతాధికారుల కమిటీ ఇటీవల రెండు సార్లు సమావేశమైందని అధికారులు వెల్లడించారు. ఇందులో మొదటి సమావేశంలో ముగ్గురిని, రెండో సమావేశంలో 8 మందిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తొలగింపునకు గురైన వారు పలు రకాలుగా ఉగ్రవాదులకు సాయం అందించారని ఆరోపిం చారు. హవాలా ద్వారా డబ్బును పొందినట్లు వెల్లడించారు. భద్రతా బలగాలు చేపట్టబోయే కార్యకలాపాల వివరాలను చేరవేసి ఉగ్రవాదులకు సాయపడినట్లు అభియోగాలు మోపారు. -
స్థావర ప్రాంతాలే అమెరికా ధ్యేయం
పాకిస్తాన్‌ను అమెరికా దువ్వడం వెనక ఆ దేశంలో తన సైనిక స్థావరాలను నెలకొల్పే లక్ష్యముందని నిపుణుల అంచనా. ఇకపోతే పాకిస్తాన్‌కి 6 బిలియన్ డాలర్ల ఐఎమ్ఎఫ్ రుణ పంపిణీకి అమెరికా మద్దతు తెలపడం.. ఆ దేశ రాజకీయ వ్యూహంలో కొత్తమలుపునకు సంకేతమేననిపిస్తోంది. 2018 జూన్ నుంచి పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్‌లో ఉంచడం తెలిసిందే. ఉగ్రవాద నిరోధక చర్యలను సమర్థంగా నిర్వహించకపోవడమే దీనికి కారణం. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవడానికి విధించిన గడువును కోవిడ్ సంక్షోభంతో అనేకసార్లు పొడిగిస్తూ వచ్చారు. అయితే మారుతున్న పరిణామాల దృష్ట్యా పాకిస్తాన్ ఈసారి గ్రే లిస్టు నుంచి బయటపడవచ్చని తెలుస్తోంది. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను పునర్నిర్మించుకోవడం ద్వారా మొత్తం పరిస్థితిని తనకనుకూలంగా మార్చుకోవచ్చని పాక్ ఆశాభావంతో ఉంటోంది. అమెరికా వ్యతిరేక ఉగ్రవాదానికి సైనిక స్థావరంగా అఫ్గానిస్తాన్‌ను ఉపయోగించుకోవడం, అమెరికా సేనలు సెప్టెంబర్ 11, 2021వ తేదీన తన భూభాగం నుంచి నిష్క్రమించాక అఫ్గానిస్తాన్ అంతర్యుద్ధంలో చిక్కుకోవడాన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్లో తన సైనిక స్థావరాలను ఏర్పర్చుకునే అవకాశాల గురించి పెంటగాన్ ప్రయత్నిస్తోందంటూ పలు ఊహలు చెలరేగుతున్నాయి. అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాద వ్యతిరేక సైనిక చర్యలు జరపడం కోసం పాకిస్తాన్లో అమెరికా సైనిక స్థావరాలను అనుమతించబోవడం సాధ్యపడదని పాకిస్తాన్ విదేశీ మంత్రి షా అహ్మద్ ఖురేషి తాజాగా ప్రకటించారు. మరోవైపున అమెరికా సైనిక స్థావరాలను తమతమ భూభాగాల్లో అనుమతించరాదని అఫ్గాన్ తాలిబన్లు పొరుగు దేశాలను హెచ్చరించారు. ’మా పొరుగు దేశాలు తమ భూభాగాలపై పరదేశ సైనిక స్థావరాలను అనుమతించే చర్యలకు పూనుకోవద్దని కోరుతున్నాం. ఒకవేళ అలాంటి పనికి ఎవరైనా పాల్పడితే పెద్ద చారిత్రక తప్పిదమే అవుతుంది. అలాంటి తీవ్రమైన, రెచ్చగొట్టే చర్యల పట్ల తాలిబన్ మౌనంగా చూస్తూ ఉండదు’ అని తాలి బన్లు హెచ్చరించారు. తన భూభాగంలో అమెరికా వైమానిక స్థావరాలను అనుమతించబోతున్నట్లు వస్తున్న వార్తలను పాకిస్తాన్ ఇప్పటికైతే తిరస్కరించింది. అయితే మరోవైపున ఎయిర్ లైన్స్ కమ్యూనికేషన్, గ్రౌండ్ లైన్స్ కమ్యూనికేషన్‌కి సంబంధించిన అత్యవసర సహకారంపై 2001లోనే అమెరికాతో తాము ఒడంబడిక చేసుకున్నందున గగనతలం నుంచి, భూతలం నుంచి అమెరికాకు తామందిస్తున్న సహకారం కొనసాగుతుందని పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం నిర్ధారించడం గమనార్హం. నిస్సందేహంగానే, అమెరికా ప్రభుత్వంతో దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి పాకిస్తాన్ వ్యూహాత్మకంగా ముందుకు కదలాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాలనాకాలంలో ఇది సాధ్యపడుతుందని పాక్ ఆశాభావంతో ఉంది. అమెరికన్ రక్షణ రంగ నిపుణులతో, భద్రతా విధాన నిపుణులతో గణనీయంగా సంబంధాలు నెరపిన ప్రస్తుత పాక్ జాతీయ భద్రతా సలహాదారు మోయిద్ యూసఫ్ గత కొద్ది నెలల్లోనే పాక్ ప్రభుత్వ వ్యవస్థ విశ్వసాన్ని సంపాదించుకున్నారు. తన ఎజెండాలో పాక్–అమెరికన్ సంబంధాల పునరుద్ధరణ కీలకంగా ఉంది. ఉగ్రవాదంపై యుద్ధంలో అమెరికాతో కలిసి ముందుపీఠిన ఉండి పోరాడాలని పాకిస్తాన్ గతంలో తీసుకున్న నిర్ణయం పట్ల 2018లో అధికారంలోకి వచ్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదేపదే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక దేశీయంగా చూస్తే అమెరికా ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో పాక్ పాత్ర పట్ల తీవ్ర ఆగ్రహం రగుల్కొంటోంది. మరోవైపున, గత రెండు దశాబ్దాలుగా చైనాతో పాకిస్తాన్ సంబంధబాంధవ్యాలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. సైనిక నిర్మాణం, 60 బిలియన్ డాలర్ల ఆర్థిక పెట్టుబడులు వంటి కీలకమైన రంగాల్లో బీజింగ్ నాయకత్వం చేస్తున్న సహాయం పట్ల పాకిస్తాన్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అన్నిటికంటే మించి భారత్ వ్యతిరేక కశ్మీర్ ఎజెండాను సమర్థించడంలో దౌత్యపరంగా చైనా అందిస్తున్న సహకారానికి పాక్ ఎంతో ప్రాముఖ్యతనిచ్చి చూస్తోంది. ఒకవైపు దేశీయంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ చైనాతో వ్యూహాత్మక పొత్తు బలంగా ఏర్పర్చుకున్న పాకిస్తాన్.. తాజాగా అమెరికాకు సైనిక స్థావరాలను కల్పించడంపై అఫ్గాన్ తాలిబన్లు మృదువుగా హెచ్చరిస్తున్నప్పటికీ, పలు కారణాల వల్ల అమెరికాతో వ్యూహాత్మక సంబంధాల పునరుద్ధరణకు మొగ్గుచూపనున్నట్లు తెలుస్తోంది. పాక్ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మద్దతు ఎంతైనా అవసరముంది. స్వల్ప అభివృద్ధి రేటు, పెరిగిన అప్పులు, అత్యధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. 2019లో ఐఎమ్ఎఫ్తో 6 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని అత్యంత కఠినమైన షరతులతో పాకిస్తాన్ ప్రభుత్వం కుదుర్చుకుంది. కఠినమైన రుణ నిర్వహణ పథకాన్ని అమలు చేయాలని, పన్నులను పెంచాలని, ఇంధనరంగంలో సంస్కరణలకు తలుపులు తెరవాలని ఐఎమ్ఎఫ్ పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు అమెరికా ఇవ్వనున్న 6 బిలియన్ డాలర్ల రుణ పంపిణీ చాలా కీలకంగా మారింది. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా పాకిస్తాన్ ఈసారి గ్రే లిస్టునుంచి బయటపడవచ్చని తెలుస్తోంది. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను పునర్నిర్మించుకోవడం ద్వారా మొత్తం పరిస్థితిని తనకనుకూలంగా మార్చుకోవచ్చని పాకిస్తాన్ ఆశాభావంతో ఉండటం విశేషం. పాకిస్తాన్ అవలంబిస్తున్న అఫ్గాన్ విధానంలో మార్పులు చోటుచేసుకోవచ్చనిపిస్తోంది. పాకిస్తాన్ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిపట్ల అప్గానిస్తాన్ నాయకత్వం తన ఆగ్రహాన్ని ప్రకటిస్తూనే వస్తోంది. ఏదేమైనప్పటికీ అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం నిష్క్రమణ ద్వారా ఏర్పడనున్న అస్థిరత పాక్ సమస్యలను రెట్టింపు చేయనుంది. అఫ్గానిస్తాన్‌లో అస్థిరత్వం పాకిస్తాన్‌కి చెందిన తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ ప్రభావాన్ని రెట్టింపు చేయనుంది. సైనిక నిఘా, పరిమితమైన ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, అఫ్గాన్ భద్రతా దళాలకు దన్నుగా ఉండటం వంటి లక్ష్యాల సాధనకు సైనిక స్థావరాలను నెలకొల్పుకునే అవకాశాలను అమెరికా ఎంచుకుంటోంది. ఈ క్రమంలో అమెరికా నాలుగు సమర్థ అవకాశాలను కలిగి ఉంది. 1. అమెరికా ప్రయోజనాలకు సంబంధించి పాకిస్తాన్లో సైనిక స్థావరాల స్థాపన అత్యంత అనుకూలమైన అంశం. పైగా ఇరుదేశాల మధ్య సహకారం ఇప్పటికే ఉంది. 2. తమ వైమానిక స్థావరాల ఏర్పాటుపై మధ్య ఆసియా రిపబ్లిక్ దేశాలతో అమెరికా చర్చలు జరుపుతోంది కానీ దీనిపై పెద్ద స్పష్టత కానరావడం లేదు. 3. ఖతార్‌లోని వైమానిక స్థావరంతో సహా గల్ఫ్ ప్రాంతంలో ఉంటున్న అమెరికా సైనిక స్థావరాలు అంత అనుకూలత కలిగిలేవు. ఎందుకంటే ఇక్కడి నుంచి అమెరికా తన డ్రోన్లను ప్రయోగించాలంటే దాని సైనిక విమానాలు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు ప్రయాణించాల్సి ఉంటుంది. 4. కాగా అమెరికా సైనిక విమానాలకు గగనంలోనే ఇంధనం నింపుకునే సౌకర్యం అరేబియా సముద్రంలోని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లలో మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌లో అమెరికా ఉగ్రవాద నిరోధక చర్యలకు పాకిస్తాన్ ఎంత అనుకూలంగా ఉంటోందో నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఏకకాలంలోనే అటు అమెరికాతో, ఇటు చైనాతో సంబంధాలను నైపుణ్యంగా కొనసాగించే కళలో పాక్ రాటుదేలిపోయింది కూడా. అయితే ఈ మొత్తం ప్రక్రియలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికాతో పాక్ నేరుగా కలిసి పనిచేస్తుందా లేదా అమెరికన్ డ్రోన్ ఆపరేషన్ల కోసం పరోక్ష మద్దతు యంత్రాంగాన్ని మాత్రాన్నే కల్పిస్తుందా? పైగా చైనాతో సంబంధాలకు విఘాతం కలగకుండానే అమెరికాతో పాత సంబంధాలను పాక్ ఏర్పర్చుకోగలుగుతుందా? అఫ్గానిస్తాన్ నుంచి అమెరికన్ సేనల ఉపసంహరణ పూర్తయిన వెంటనే ఈ ప్రశ్నలకు సమాధానాలు వెలుగులోకి రావచ్చు. అందుకే ఈ ప్రాంతంలో తన భవిష్యత్ వ్యూహాన్ని రూపొందించుకోవడానికి గాను ప్రస్తుత పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలించాల్సి ఉంది. – వ్యాసకర్త విశిష్ట పరిశోధకురాలు, షాలిని చావ్లా సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ (ట్రిబ్యూన్ సౌజన్యంతో) -
నిర్మలా సీతారామన్‌తో పనిచేయడం కష్టం..
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఏడాది తరువాత దీనికి గల కారణాలపై మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది అక్టోబర్ 31న స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన శనివారం సుదీర్ఘమైన బ్లాగ్ పోస్ట్‌లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. తాను ఎందుకు రాజీనామా చేసిందీ బ్లాగులో ప్రచురించారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి పనిచేయడం కష్టంగా తాను భావించానని పేర్కొన్నారు. ఆమెతో తనకు కలిసి రాలేదన్నారు. వాస్తవానికి ఆర్థికమంత్రి తన బదిలీ కోరేకంటే ముందే తమ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనీ చెప్పారు. తన రాజీనామా నిర్ణయం వెనుక రెండు కారణాలున్నాయని గార్గ్ చెప్పారు. మొదటిది 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థనుంచి కేంద్రం పక్కకుపోవడం, రెండవది ఆర్థిక మంత్రితో తన సంబంధాలు బాగా లేకపోవడం కారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్థికమంత్రిత్వ శాఖ కాకుండా మరో శాఖలో పనిచేయాలని తాను భావించలేదన్నారు. భిన్నమైన వ్యక్తిత్వం, నాలెడ్జ్ ఎండోమెంట్, నైపుణ్యం, ఎకనామిక్ పాలసీలకు సంబంధించి సరియైన విధానాన్ని కలిగి ఉన్నారంటూనే ఆమెతో పనిచేయడం కష్టమని గార్గ్ వ్యాఖ్యానించారు. అలాగే 10 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంనుంచి కేంద్రం పక్కకుపోయిందనీ, ఇది సాధ్యంకాదనే విషయం తనకు ప్రారంభంలోనే స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. అలాగే దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి పనిచేయడం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు చాలా ఉత్తమమైనదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజా విధాన సమస్యల నాడిని అవగతం చేసుకున్న మాస్టర్ మైండ్ జైట్లీ అని కొనియాడారు. విధానాల అమలు, శాఖ నిర్వహణ తదితర అంశాలను ఆయన కార్యదర్శులకు విడిచిపెట్టేవారని గుర్తు చేసుకున్నారు.నిర్మలా సీతారామన్‌కు కూడా తనపై నమ్మకం ఉన్నట్టు అనిపించలేదనీ, చాలా అసౌకర్యంగా ఉన్నట్టు గుర్తించానని గార్గ్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆర్ బీఐ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్, నాన్-బ్యాంకింగ్ సంస్థలు, పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ పథకం విషయాలపై ఇద్దరి మధ్య తీవ్రమైన తేడాలు ఏర్పడ్డాయని మాజీ ఆర్థిక కార్యదర్శి చెప్పారు. దీంతో అధికారికంగా, వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో బాధ్యతలు స్వీకరించిన ఒక నెలలోనే, 2019 జూన్‌లో తన బదిలీ కోసం సీతారామన్ పట్టుబట్టినట్లు గార్గ్ పేర్కొన్నారు. అందుకే బడ్జెట్ సమర్పించిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నాను. జూలై 24 న విద్యుత్ మంత్రిత్వ శాఖకు బదిలీ ఉత్తర్వు జారీ అయిన అరగంటలోనే స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దాఖలు చేశానని చెప్పారు. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయానని తన బ్లాగులో చెప్పారు. -
నేపాల్‌తో మళ్లీ చెట్టపట్టాలు
అయిదు నెలలక్రితం భారత్–నేపాల్ సంబంధాల్లో వినిపించిన చిటపటలు కొద్ది రోజులుగా సద్దు మణిగాయి. కారణమేమిటో తాజా పరిణామాలే చెబుతున్నాయి. మన సైనిక దళాల ప్రధానాధికారి ఎం.ఎం. నరవణే వచ్చే నెలలో ఆ దేశం పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా నేపాల్ అధ్యక్షు రాలు విద్యాదేవి భండారీ ఆయనకు నేపాల్ సైనిక గౌరవ జనరల్‌గా గౌరవ పురస్కారాన్ని అంద జేయబోతున్నారు. ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాల సైనిక చీఫ్‌లనూ పరస్పరం గౌరవించుకోవడమనే సంప్రదాయాన్ని కొనసాగించాలని నేపాల్ భావించగా, అందుకు మన దేశం కూడా అంగీకరించడం మంచి పరిణామం. వాస్తవానికి ఇది గత ఫిబ్రవరిలోనే జరగాలి. కానీ అప్పటికే కరోనా కలకలం మొదలుకావడంతో వాయిదాపడింది. మన ఉత్తరాఖండ్‌లో భాగంగా వున్న లింపియాధుర, కాలా పానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనని మొన్న మే నెలలో నేపాల్ ప్రకటించడంతోపాటు అందుకు సంబంధించి ఒక మ్యాప్‌ను కూడా విడుదల చేసింది. భారత్ రాజముద్రలో ఉండే మూడు సింహాల ముందు ‘సత్యమేవ జయతే’ అని వుంటుందని... ఆ దేశం దానికి కట్టుబడి వుంటుందో, సింహమేవ జయతే అనుకుంటుందో చూడాలని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు కూడా. దాంతో ఇటు మన దేశం నుంచి కూడా ఘాటు వ్యాఖ్యలే వెలువడ్డాయి. మ్యాప్‌ను విడుదల చేయడంద్వారా చర్చలకు నేపాల్ శాశ్వతంగా తలుపులు మూసిందని మన దేశం సూటిగా చెప్పింది. నేపాల్ తీసుకొచ్చిన ఈ కొత్త పేచీ వెనక ‘ఎవరో’ ఉన్నారని జనరల్ నరవణే చేసిన వ్యాఖ్యతో అక్కడి నేతలు మరింత రెచ్చిపోయారు. తాము చైనా చెప్పినట్టల్లా ఆడుతున్నామని పరోక్షంగా అన్నారని వారికి అర్ధమైంది. కొత్త సరిహద్దులతో విడుదల చేసిన మ్యాప్‌లకు సంబంధించిన బిల్లుల్ని అక్కడి పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టారు. ఇక రెండు దేశాల సంబంధాలూ చక్కదిద్దలేని స్థాయికి చేరు కున్నాయని అందరూ అనుకున్నారు. కానీ చాకచక్యంతో దౌత్యం నెరపితే, కాస్త సంయమనం పాటిస్తే అన్నీ సర్దుకుంటాయి. ఆ సంగతి తాజాగా నిరూపణ అయింది. ఇరుగు పొరుగు దేశాల మధ్య విభేదాలుండటం కొత్తేమీ కాదు. చారిత్రకంగా, సాంస్కృతికంగా శతాబ్దాల చరిత్ర వున్న రెండు దేశాలు ఏదో ఒక ఘటన కారణంగానో, ఎవరో చేసిన వ్యాఖ్య కారణం గానో శాశ్వతంగా దూరమవుతాయని, శత్రువులుగా మిగులుతాయని భావించవలసిన అవసరం లేదు. భారత్–నేపాల్ సంబంధాలు మళ్లీ చివురిస్తున్న వైనం రెండు నెలలుగా కనబడుతూనే వుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని శర్మ ఓలితో ఫోన్లో మాట్లాడారు. అనంతరం మన ప్రభుత్వం నేపాల్‌లో చేపట్టి అమలు చేస్తున్న ప్రాజెక్టులపై కఠ్మాండులో ఆగస్టు 17న సమావేశం జరిగింది. అధికారుల స్థాయిలో జరిగిన ఆ చర్చల తర్వాత పరిస్థితి మళ్లీ మెరుగుపడటం మొదలైంది. అంతమాత్రాన కొత్త మ్యాప్‌ల వ్యవహారం సమసినట్టు కాదు. ఆ అంశంపై చర్చలు ఇంకా జరగాల్సేవుంది. నేపాల్‌తో మన దేశం సంబంధాలు ఎప్పుడూ ఉండాల్సిన విధంగా లేవు. ఇందుకు ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అప్పటి జనతా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో నియంతృత్వ పోకడలను అమలు చేయడమే కాక, దక్షిణాసియాలో ఆధిపత్య ధోరణులను ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు. తాము అధికారంలోకొచ్చాక ఇరుగుపొరుగుతో మంచి సంబంధాలు నెల కొల్పుతామని చెప్పారు. ఆ తర్వాత జనతాపార్టీ అధికారంలోకొచ్చి మొరార్జీ దేశాయ్ ప్రధానిగా, వాజపేయి విదే శాంగమంత్రిగా వ్యవహరించినప్పుడు విదేశాంగ విధానంలో కీలకమైన మార్పులే చేశారు. కానీ కొద్దికాలంలోనే వారు సైతం ఇందిర బాటలో పయనిస్తున్నారన్న విమర్శలొచ్చాయి. నెహ్రూ ఏలుబడిలో కూడా దక్షిణాసియా దేశాలతో సంబంధాల విషయంలో మన విధానం సరిగాలేదని నిపుణులు విమర్శించేవారు. ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి సాధించడానికి, ప్రపంచంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రాంతీయ దేశాలతో సఖ్యతే కీలకం. అందువల్ల మన సర్వశక్తులూ అభివృద్ధిపై కేంద్రీ కరించడానికి అవకాశం వుంటుంది. అవతలి దేశాలు మన స్నేహ హస్తాన్ని అందుకోవడంలో విఫలం కావొచ్చు... కావాలని మనతో పేచీలకు దిగొచ్చు... మన భద్రతకు ముప్పు తెచ్చే విధానాలు అను సరించొచ్చు. అటువంటప్పుడు దృఢంగా వుండాల్సిందే. మన రక్షణకు అవసరమైన చర్యలు తీసు కోవాల్సిందే. అదే సమయంలో వృధా వివాదాల వల్ల కలిగే అనర్థాలను అవి గ్రహించేలా చేయాలి. మనవైపుగా లోటుపాట్లు లేకుండా చూడాలి. మనం పెత్తనం చలాయిస్తున్నామని, వారి ప్రయోజనాలకు హాని కలిగిస్తున్నామని చిన్న దేశాలు అభిప్రాయపడేలా ఉండకూడదు. నేపాల్ విషయంలో మన పాలకులు మొదటినుంచీ నిర్లక్ష్యంగానే వున్నారు. 1997లో అప్పటి మన ప్రధాని ఐకె గుజ్రాల్ నేపాల్‌లో పర్యటించాక, మళ్లీ మోదీ ప్రధాని అయ్యేవరకూ ఏ ప్రధానీ ఆ దేశం వెళ్లలేదు. మంత్రుల స్థాయి పర్యటనలు, అధికారుల స్థాయి పర్యటనల తీరూ అంతే. చైనా దీన్ని ఆసరా చేసుకుని నేపాల్‌ను సన్నిహితం చేసుకోవడానికి ఎడతెగని ప్రయత్నం చేసింది. నేపాల్‌లో మనపై విద్వేషభావం ఏర్పడేలా ప్రచారం చేసింది. ఆ దేశంతో అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒక్క నేపాల్‌తో మాత్రమే కాదు... బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, మయన్మార్ వగైరాలతో కూడా చైనా వ్యూహాత్మకంగా చెలిమి చేస్తోంది. దీన్ని మన దేశం గమనంలోకి తీసుకోవాలి. భారత్–నేపాల్ మధ్య వాణిజ్య విస్తరణ జరిగితే అది ఇరు దేశాలకూ ఎంతో మేలు చేస్తుంది. అక్కడ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో మన దేశం మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి అవకాశం వుంటుంది. ఇప్పుడు జరగబోయే జనరల్ నరవణే పర్యటన వల్ల ఏదో ఒరుగుతుందని చెప్పలేం. కానీ మెరుగైన సంబంధాల దిశగా అడుగులేయడానికి అది ఎంతో కొంత తోడ్పడుతుంది. -
చేతులకు ఫోన్ దొరక్కుండా చేస్తే..?
శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపడానికి వారంలో ఒకరోజు ఉపవాస దీక్ష ఎలా చేపడ్తామో.. బంధాలు, అనుబంధాలు పెంచుకోవడానికి డిజిటల్ డిటాక్సిఫికేషన్ దీక్ష అలా అవసరం. లంకణం పరమౌషధం అన్నారు పెద్దలు.పొట్టను మాడిస్తే జబ్బు పారిపోతుందని అంటారు.మరి చేతులను మాడిస్తే?వాటికి ఫోన్ దొరక్కుండా చేస్తే?కంప్యూటర్ దొరక్కుండా చేస్తే?టీవీ రిమోట్ దొరక్కుండా చేస్తే? చేతులకు పత్యం పెడితే?ఈ పత్యం చాలా మంచిదిఅంటున్నారు నిపుణులు.సోషల్ మీడియాకు, స్మార్ట్‌ఫోన్ వ్యసనానికి వారానికి ఒకసారి లంకణం పెట్టిస్తే కుటుంబ అనుబంధాలుదగ్గరికి వస్తాయి. మనుషులు దగ్గరఅవుతారు. సంతోషం దగ్గరికొస్తుంది.ఒక్కమాటలో చెప్పాలంటే దూరమైనవన్నీ దగ్గరకొస్తాయి. ఒక కుటుంబం.. అత్యంత సన్నిహితులతో ఆత్మీయసమ్మేళనం జరుపుకుంటోంది. చిన్నాపెద్దా, యూత్ అంతా కలిసి పాతిక మంది వరకూ ఉన్నారు. కాని ఆ ఇంట్లో ఏమాత్రం సందడి æలేదు. హాల్లో వినిపిస్తున్న, కనిపిస్తున్న ఎల్ఈడీ టీవీ సౌండ్ తప్ప. వయసులో పెద్దవాళ్లు నలుగురైదుగురు టీవీలో లీనమయ్యారు. మిగిలిన వాళ్లంతా స్మార్ట్ ఫోన్స్‌తో ఎంగేజ్ అయ్యారు. పిల్లలు ఎవరికి వారే తమ చేతుల్లో ఉన్న ట్యాబ్స్‌లో గేమ్స్ ఆడుకుంటున్నారు. మధ్యవయస్కులు యూట్యూబ్‌లో వీడియోలు చూసుకుంటున్నారు. మగవాళ్లు తాము కూర్చున్న చోటే కాస్త పక్కకు తిరిగి ఫోన్ మాట్లాడుకుంటున్నారు. మెసేజ్ చేసుకుంటున్నారు. ఆడవాళ్లు సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సమ్మేళనానికి హాజరైన వారితోనే ఫ్యామిలీ గ్రూప్‌లో చాట్ చేసుకుంటున్నారు. అక్కడే వాళ్ల సమక్షంలో దిగిన ఫోటోలనే అందులో పెడుతున్నారు. వాళ్ల పక్కనే ఉన్న వాళ్లు.. ‘వావ్ .. నైస్.. భలే ఉంది చీర.. డిజైన్ చేయించావా?’ ‘ హేయ్.. నీ ఫొటో వెనక కనపడుతున్న షో పీస్ భలే ఉంది... అమెజాన్‌లో కొన్నావా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలదైతే అదో లోకం. పబ్జీ నుంచి టిక్‌టాక్‌ల దాకా.. ఈ మూల ఒకరు.. ఆ బాల్కనీలో ఒకరు.. కారిడార్‌లో ఒకరు.. కిచెన్‌లో ఒకరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోచోట ఒక్కో యాప్‌లో బిజీ. తీరా ఎప్పటికో పెద్దవాళ్లకు ఆకలేసి టీవీలోంచి మొహం బయటపెట్టి మిగిలిన వాళ్లను పలకరించే ప్రయత్నం చేశారు. ఎవరూ ఈ లోకంలో లేరు. అంతలోకే ఫోన్లోంచి తన చుట్టూ ఉన్న పరిసరాల మీదకు దృష్టి మరల్చిన ఆ ఇంటి కోడలికి పరిస్థితి అర్థమై ఆ ఫ్యామిలీ గ్రూప్‌లోనే మెసేజ్ పెట్టింది ‘లంచ్ చేద్దామా?’ అంటూ. ‘యెస్’ అంటూ ఒకరివెంట ఒకరు రిప్లయ్. లంచ్ చేసేప్పుడు కూడా చిన్న పిల్లలు తమ చేతుల్లోంచి ట్యాబ్స్ తీసి పక్కన పెట్టలేదు. నిజానికి ట్యాబ్స్ తీసేస్తే ముద్ద మింగడం లేదు వాళ్లు. దాంతో తల్లులు అందులో రైమ్స్ పెట్టి.. అన్నం తినిపించడం మొదలుపెట్టారు. ఆ ట్యాబ్ వంకే కళ్లప్పగించి గబగబా ముద్దలు మింగేస్తున్నారు. ఏం తింటున్నామో.. దాని రుచి ఏంటో కూడా తెలియనంతగా. అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్న ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి సినిమాకు వచ్చింది. అందరూ కలిసి సినిమా చూడాలని ప్లాన్ చేసుకొని మరీ వచ్చారు. సినిమా టైమ్‌కు కంటే కాస్త ముందే వచ్చారు. ‘హాయ్’ అంటూ విష్ చేసుకోవడం తప్ప వాళ్లు మాట్లాడుకున్నదేమీ లేదు. ఎవరి ఫోన్లో వాళ్లు మెసేజ్‌లు, వీడియోలు చూసుకుంటూ ఉన్నారు. ఇంతలోకే సినిమా టైమ్ అయింది. అలాగే ఫోన్లు చూసుకుంటూనే లోపలికి వెళ్లారు. సీట్లు వెదుక్కొని కూర్చున్నారు. సినిమా విన్నారు.. సెల్‌ఫోన్ చూసుకున్నారు. పెళ్లవుతోంది... పెళ్లికి హాజరైన అతిథుల్లో చాలామంది చేతుల్లో ఫోన్లు. ఆ ఫోన్లలోనే వాళ్ల దృష్టంతా. పెళ్లిని చూసిందే లేదు. నవ్వుకుంటూ ఆటపట్టించుకోవడమూ లేదు. సెల్ఫీలు దిగారు. వీడియోలు తీసుకున్నారు. ఎన్నాళ్లుగానో కలవని చాలామంది ఆ పెళ్లిలో కలుసుకున్నారు. ఆ ఆనందం ఎవరి మొహాల్లోనూ లేదు పెద్దగా. మాటామంతీ జరపలేదు. కాలక్షేపం అంతా స్మార్ట్‌ఫోన్‌తోనే జరిగింది. పైన చెప్పిన ఉదంతాలన్నీ ‘హికికొమోరి’కి దగ్గరగా ఉన్నాయి. జపాన్‌లోని యువతను, మధ్య వయస్కులను ఇంకా చెప్పాలంటే స్కూల్‌కు వెళ్లే పిల్లలనూ పీడిస్తున్న మానసిక జాడ్యం హికికొమోరి. ఒక వ్యక్తి తనంతట తానుగా ఇంటికే పరిమితమైపోయి బాహ్య పరిసరాలు, మనుషులకు దూరమైపోవడం ఈ జాడ్యం లక్షణం. ప్రస్తుతం మన దేశంలో మనుషులంతా కలిసి ఒకే చోట ఉన్నా ఫోన్ల వల్ల ఎవరికి వారుగానే ఉన్నారు. అందరూ కలిసి ఒక వినోదాన్ని ఆస్వాదించాలని వచ్చినా ఎవరికి వారే సోషల్ నెట్‌వర్క్‌లో వినోదాన్ని వెదుక్కుంటున్నారు. కళ్లముందు వేడుక జరుగుతున్నా మనుషులను, పరిసరాలను గమనించడం లేదు.. గ్రహించడం లేదు. ఎలక్ట్రానిక్ డివైజే నేస్తం.. దానితోనే చెలిమి.. అదే ఒక బంధం.. బంధనంగా బతుకుతున్నారు. దాన్ని నిరోధించాలంటే జీవన శైలి మార్చుకోవాలి అంటున్నాను మానసికవైద్య నిపుణులు, మనస్తత్వ శాస్త్రవేత్తలు. డిజిటల్ డిటాక్సిఫికేషన్ చేయాలి అంటున్నారు. అంటే శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపడానికి వారంలో ఒకరోజు ఉపవాస దీక్ష ఎలా చేపడ్తామో కుటుంబంతోపాటు చుట్టాలు, స్నేహితులు, నిత్యం మనం మెదిలే పరిసరాలతో బంధాలు, అనుబంధాలు పెంచుకోవడానికి డిజిటల్ డిటాక్సిఫికేషన్ దీక్ష అవసరం అంటున్నారు. అసలు జీవితం చిన్నదైపోతుంది స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడిన మెదడు పూర్తిగా స్మార్ట్‌ఫోన్ మీదే ఆధారపడిపోతుంది. అసలు జీవితం చిన్నదైపోతుంది. చేతిలోనో కనుచూపు మేరలోనో ఫోన్ కనిపించకపోతే ఏదో అభద్రతగా అనిపిస్తుంది. ఇదొక వ్యసనం. అందులోంచి బయట పడడానికి ఈ డిజిటల్ డీటాక్సిఫికేషన్ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్కసారిగా ఫోన్‌కు దూరంగా ఉండకుండా.. నెమ్మదిగా అంటే ముందు ఓ గంట, తర్వాత గంటన్నర, ఆ తర్వాత రెండు గంటలు.. ఇలా రోజురోజుకు దాన్ని దూరంగా ఉంచే సమయాన్ని పెంచుకుంటూ పోయి వారానికి ఒకరోజు పూర్తిగా ఫోన్ ఉపయోగించక పోవడం.. ఆ తర్వాత వారానికి రెండు రోజులు.. ఇలా పెంచుకుంటూ పోయి.. ఆ వ్యసనాన్ని మానుకోవచ్చు. ఈ అడిక్షన్ ఆల్కహాలు, స్మోకింగ్ లాంటిదే. అలవాటు పడిన మెదడు ఊరుకోదు. అందుకే ఫోన్లో గేమ్స్ ఆడాలి. అయితే ఒక్క విషయం... ఈ డిజిటల్ డిటాక్సిఫికేషన్ ప్రక్రియ ముందు పెద్దల నుంచే స్టార్ట్ అవ్వాలి. అప్పుడే పిల్లలు మనల్ని అనుసరిస్తారు. – డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి, సైకియాట్రిస్ట్ వారానికి ఒకరోజు సెల్‌ఫోన్‌తోపాటు దానికి అనుసంధానంగా ఇంటర్నెట్, అది వాహకంగా ఉన్న సోషల్ మీడియాకు దూరంగా ఉండడం, రోజంతా దాన్ని ఉపయోగించకుండా మన చుట్టూ భౌతిక ప్రపంచానికి దగ్గరగా మెదలడమే డిజిటల్ డిటాక్సిఫికేషన్. మనుషులను ఆక్రమించుకున్న ఈ సాధనాల వల్ల కలిగే దుష్పరిణామాలు అర్థమై ఇప్పుడు అంతా వాటిని ఉపవసించే పనిలో పడ్డారు. ఈ ఉపవాస దీక్ష ఒక ధోరణిలా మొదలైనా... ఆరోగ్యకరమైన భవిష్యత్‌కు దీన్నొక శుభపరిణామంగా అనుకోవచ్చు. – కథనం : సాక్షి ఫ్యామిలీ -
వరవరరావు హార్డ్‌డిస్క్ డేటా రికవరీ కోసం..
పుణే: ఎల్గార్ పరిషద్– మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన విరసం నేత వరవరరావు ఇంట్లో స్వాధీనంచేసుకున్న హార్డ్‌డిస్క్‌లోని డేటా రికవరీ కోసం అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సాయం తీసుకోవాలని పుణే పోలీసులు భావిస్తున్నారు. గతేడాది ఆగస్టులో వరవరరావు ఇంట్లో సోదాల్లో లభ్యమైన హార్డ్‌డిస్క్‌లో ఏముందో తెల్సుకునేందుకు నాలుగు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలకు పంపినా ఫలితం లేదు. తొలుత పుణేలోని ల్యాబొరేటరీకి పంపగా, నిపుణులు హార్డ్ డిస్క్‌లోని డేటాను రికవరీ చేయలేకపోయారని ఓ అధికారి చెప్పారు. తర్వాత ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినా అక్కడి నిపుణులు డేటా సంపాదించలేకపోయారు. గుజరాత్, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల నిపుణులు రికవరీ చేయలేకపోయారని పేర్కొన్నారు. ‘సాంకేతికతలో ఎఫ్‌బీఐ చాలా పురోగతి చెంది ఉంటుంది. అందుకే ఎఫ్‌బీఐకి హార్డ్ డిస్క్ పంపాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు అవసరమైన అనుమతులను కేంద్ర హోం శాఖ ఇచ్చింది’అని ఆ అధికారి చెప్పారు. -
యూఏఈ సాయం తిరస్కరణ.. కేరళ అసంతృప్తి!
వరదలు ముంచెత్తడంతో నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్ల ఆర్థిక సహాయానికి యూఏఈ ముందుకొచ్చింది. భారత్‌తో మరీ ముఖ్యంగా కేరళతో యూఏఈకి ప్రత్యేక సంబంధాలున్న నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం ఇంత భారీ సాయాన్ని ప్రకటించింది. ఈ సాయాన్ని స్వీకరించబోమని భారత ప్రభుత్వం తెలిపింది. విదేశీ విరాళాలను అంగీకరించబోవడం లేదని సమాచారం. 2004 డిసెంబర్ నుంచే అమల్లోకి 2004 డిసెంబర్లో నాటి ప్రధాని మన్మోహన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చిది. ఈ ‘విపత్తు సహాయ విధానం’లో భాగంగా విదేశీ సహాయాన్ని అంగీకరించకూడదని నిర్ణయించింది. సునామీ కారణంగా భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో తీవ్రనష్టం సంభవించిన సందర్భంలో ఈ విధానాన్ని ఖరారు చేశారు. సునామీ అనంతర సహాయ, పునర్నిర్మాణ కార్యక్రమాలు భారత్ సొంతంగా చూసుకోగలదని మన్మోహన్ చెప్పారు. కేరళలోని విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు దేశీయం గా అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలనే వినియోగించుకోవాలనే ఆలోచనతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉంది. దౌత్య కార్యాలయాలకు వర్తమానం కేరళ విపత్తుపై విదేశీ ఆర్థిక సహాయాన్ని స్వీకరించవద్దని ఇప్పటికే అన్ని రాయబార కార్యాలయాలకు మోదీ ప్రభుత్వం వర్తమానం పంపించింది. ఏ దేశ ప్రభుత్వమైనా సహాయం చేసే ఉద్దేశాన్ని వెల్లడిస్తే దానిని సున్నితంగా తిరరస్కరించాలని భారత రాయబార కార్యాలయాలకు పంపిన సందేశంలో పేర్కొంది. చివరగా 2004లో బిహార్ వరదలతో అతలాకుతలమైనపుడు విదేశీ ప్రభుత్వాల సహాయాన్ని భారత్ తీసుకుంది. ఆ తర్వాతి సందర్భాల్లో తిరస్కరించింది. ఎన్ఆర్ఐల విరాళాలపై పన్ను లేదు ఇతర దేశాల ప్రభుత్వాలిచ్చే విరాళాలు, ఆర్థిక సహాయాన్ని నిరాకరిస్తున్నా, ఆ దేశాల్లోని భారతీయులు కేరళ సీఎం సహాయనిధికి నేరుగా విరాళాలు పంపించవచ్చు. వాటికి పన్ను మినహాయింపు ఉంటుంది. ‘విదేశీ విరాళాల చట్టం కింద గుర్తింపు పొందిన, లాభాపేక్ష లేని స్వచ్ఛందసంస్థలు, ప్రభుత్వేతర సంస్థల ద్వారా వచ్చే విదేశీ సాయంపైనా పన్ను మినహాయింపు ఉంటుంది’ అని విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి చెప్పారు. కేంద్రం నిర్ణయంపై కేరళ అసంతృప్తి! కొచ్చి: కేరళ వరదలకు విదేశాలు చేస్తున్న సాయాన్ని కేంద్రం తోసిపుచ్చడంపై కేరళ ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ విరాళాలు అత్యవసరమని రాష్ట్ర సీఎం భావిస్తున్నారు. యూఏఈ విరాళంపై పునరాలోచించాలని ప్రధానిని కలిసి విన్నవించనున్నట్లు విజయన్ తెలిపారు. విదేశీ సాయం తీసుకునేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని కూడా వారు ప్రధానిని కోరనున్నారు. యూఏఈ రూ.700కోట్లు, ఖతార్ రూ.35కోట్లు, మాల్దీవులు రూ.35 లక్షల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భారత్-పాక్‌లపై చైనా కీలక వ్యాఖ్యలు
బీజింగ్ : భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో చైనా సానుకూల, నిర్మాణాత్మక పాత్ర పోషించనుందని చైనా విదేశాంగ ప్రతినిధి లూకుంగ్ తెలిపారు. ఆసియాలో భారత్, పాకిస్తాన్‌లు బలమైనా దేశాలని, ఆ రెండు దేశాల మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలు మెరగుపడాలని ఆయన వ్యాఖ్యానించారు. భారత్-పాక్ మధ్య అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయడంలో భవిష్యత్తులో చైనా కీలక పాత్ర పోషించనున్నట్లు లూకుంగ్ వెల్లడించారు. పాక్ నూతన ప్రధానిగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వంతో తాము చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని, భారత్-పాక్ సత్సబంధాలను చైనా ఎల్లప్పుడూ కోరుకుంటుందని ఆయన అన్నారు. రెండు దేశాలు మధ్య స్నేహం అభివృద్ధి, శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. చైనాకు పొరుగుదేశాలైన భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల పెరుగుదలకు చైనా రెండు దేశాలకు మద్దతునిస్తుందని.. ఇరు దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలను పరిష్కరించడానికి తాము ప్రయత్నిస్తామని తెలిపారు. భారత్, పాక్‌ల మధ్య నిర్మాణాత్మక, అర్ధవంతమైన చర్చలు జరగాలని పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లేఖ రాసినట్లు లూకుంగ్ గుర్తుచేశారు. కాగా భారత్-పాక్ సంబంధాల మధ్య ఇమ్రాన్ ఖాన్ ఆసక్తి చూపుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు కోరుకుంటే ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వంగా వ్యవహరించడానికి చైనా సిద్దంగా ఉందని తెలిపింది. -
కొండంత పేదరికానికి మతిమరుపు శిక్ష
ఖాలిద్ హుస్సేనీ మూడవ నవల, ‘ద మౌంటెన్స్ ఎకోడ్’ కథ 1952లో మొదలవుతుంది. అఫ్గానిస్తాన్‌లోని ఓ కుగ్రామంలో అన్నాచెల్లెలు పదేళ్ళ అబ్దుల్లా, మూడేళ్ళ పరీ– తండ్రి సబూర్, సవతి తల్లి పర్వానీతో కలిసి ఉంటుంటారు. మూడో బిడ్డ ఈ లోకంలోకి రాబోతున్నప్పుడు, కటిక పేదరికాన్ని తప్పించుకోడానికి, సబూర్, ‘చేతిని కాపాడుకోడానికి ఒక వేలుని కత్తిరించేయక తప్పదు’ అని తనకు తాను నచ్చజెప్పుకుని, పిల్లలకు, ‘ఒక రాక్షసుడి కోపాన్ని చల్లార్చడానికి మనకిష్టమైన పిల్లనో, పిల్లాడినో బలిస్తే తప్ప ఊరిని నాశనం చేయకుండా ఉండడు’ అన్న కాల్పనిక కథ చెప్తాడు. పిల్లల్లేకపోయిన ధనవంతులైన సులేమాన్, నీలా దంపతులకి డ్రైవరూ, వంటవాడూ అయిన నబీ– సబూర్ బావమరిది. అతను పరీని వారికి అమ్మడంలో సహాయపడతాడు. పరీ మొదట కాబూల్‌లోనూ, ఆ తరువాత పారిస్‌లోనూ పెరిగి పెద్దదవుతుంది. అన్నాచెల్లెలు వేరయినప్పుడు, చిన్నపిల్లయిన పరీ ఇంటిని త్వరగానే మరిచిపోతుంది. కానీ అబ్దుల్లా పరీని తలుచుకోని క్షణం ఉండదు. అయితే, అతడి జీవితం గురించి పాఠకులకు పరిచయం అయ్యేది అతడు అమెరికా వెళ్ళాకే. పరీ పరోక్షం ఇతర పాత్రల మీద చూపించే ప్రభావం గురించి తెలుసుకోకుండానే సబూర్ మరణిస్తాడు. పరీ ఉద్యోగం చేస్తూ, పెళ్ళి చేసుకున్న తరువాత, తను దత్తత తీసుకోబడిందన్న అనుమానం కలిగినప్పుడు, ఎప్పుడో అప్పుడు అఫ్గానిస్తాన్ వెళ్ళి తన గతం తెలుసుకోవాలనుకుని, ‘తన ఉనికికి మౌలికంగా బాధ్యత వహించిన ఎవరో, ఏదో లేరు/దు’ అని భావిస్తుంటుంది. అబ్దుల్లా కాలిఫోర్నియాలో ఒక రెస్టారెంటు నడుపుతుంటాడు. అతనూ, భార్యా తమ ఏకైక కూతురికి, ‘పరీ’ అన్న పేరే పెడతారు. అసలు పరీ ముసలితనానికి చేరువయి, అన్న ఎక్కడున్నాడో తెలిసి కలుసుకోడానికి వెళ్ళినప్పుడు, అతను అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ, పరీని అసలు గుర్తించకపోవడం మరీ విషాదకరంగా మారుతుంది.రచయిత అన్నా చెల్లెళ్ళ పరిస్థితిని ఒక పదునైన రూపకంతో వివరిస్తారు: ‘వంతెన నదికి మధ్యనే అంతం అయింది. ఇంచుమించు ఒడ్డుకి చేరబోతూ ఉన్నప్పుడే, అటువైపు భాగం పొట్టిదయిపోయింది’.కాలం ముందుకీ వెనక్కీ మారుతూ, నాలుగు తరాల యొక్క యాబై సంవత్సరాలని –తొమ్మిది అధ్యాయాల్లో, వేర్వేరు పాత్రల దృష్టికోణాలతో చూపిస్తుంది ఈ నవల. అయితే, ‘కథ కదులుతున్న రైలువంటిది. ఎక్కడెక్కినా సరే, ఎప్పుడో అప్పుడు గమ్యానికి చేరుస్తుంది’ అంటూ, పుస్తకాన్ని అర్థం చేసుకునే బాధ్యతని పాఠకులకే వదిలేస్తారు హుస్సేనీ.రచయిత కేంద్రీకరించేది సబూర్ చర్య వల్ల కలిగిన పర్యవసానాల మీద. సంబంధాలు తెగిపోయినప్పుడు ఏమవుతుందో అన్న సంగతిని ప్రతి చిన్న పాత్రకి కూడా జీవం పోసి మాట్లాడించడం ద్వారా తెలియజేస్తారు. పాత్రల మీద ఏ కనికరమూ చూపకుండా, నిశితంగా విమర్శిస్తూ, మానవ సంబంధాలని నేర్పుగా విశ్లేషిస్తారు. నైతిక సంక్లిష్టతల గురించిన ఈ కథ, ‘ఉద్దేశాలు మంచివయితే సరిపోతుందా! మంచితనాన్ని నిర్వచించేది ఎలా? తమ పిల్లలు బాధలనుభవించకుండా కాపాడేటందుకు తల్లిదండ్రులు ఎంత దూరం వెళ్ళవచ్చు! సొంత కుటుంబం నుంచి వేరుపడటం కటిక పేదరికం భరించడం కన్నా ఎక్కువ బాధాకరమైనదా?’ అన్న ప్రశ్నలని లేవనెత్తు్తతుంది. విలియమ్ బ్లేక్ కవిత ‘పిల్లల కంఠాలతో ప్రతిధ్వనించే కొండలు’ ఈ పుస్తక శీర్షికకు ప్రేరణ. 2013లో అచ్చయింది. ‘టైమ్స్ లిస్ట్’లో ఉత్తమమైన నవలగా 33 వారాల పాటు నిలిచింది. కృష్ణ వేణి -
అమ్మా..నాన్న.. ఓ సెల్‌ఫోన్!
న్యూయార్క్ : తల్లిదండ్రులు.. మీరు సెల్‌ఫోన్‌కు దగ్గరవుతున్నారా?.. కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన సమయాన్ని సెల్‌ఫోన్ వాడుతూ వృథా చేస్తున్నారా?.. అయితే మీ పిల్లలు మీకు దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పెద్దలు పిల్లలతో హాయిగా గడపాల్సిన సమయంలో సెల్‌ఫోన్ వాడుతూ ఉంటే పిల్లలలో భావోద్వేగాలు తగ్గిపోతాయని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. తద్వారా పిల్లలు క్రూరప్రవర్తన, చెడు ప్రవర్తనకు అలవాటుపడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన సర్వేల్లో ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి. ప్రతిరోజు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ముఖాముఖి సంభాషణలు లేకపోవటాన్ని ‘టెక్నోఫెరెన్స్’ అని నామకరణం చేశారు. పిల్లల చెడు ప్రవర్తన నుంచి తప్పించుకోవాలని తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌ను ఆశ్రయిస్తే అది వారిని మరింత నాశనం చేస్తుందంటున్నారు. రోజులో కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించటం ద్వారా వారు తల్లిదండ్రులకు మరింత దగ్గరవుతారని, వారికి సంబంధించిన విషయాలలో శ్రద్ధ కనబరుస్తూ ఉండటం వల్ల మంచి ప్రవర్తన అలవడుతుందని అంటున్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సమస్యలు ఎక్కువవ్వటానికి గల ముఖ్య కారణం సెల్‌ఫోన్ వాడకమేనని పేర్కొన్నారు.