మానవ సంబంధాలను మరింత పెంపొందిం చుకోవాలని వక్తలు అన్నారు. స్థానిక మెడికల్ హాల్‌లో ఆదివారం ’నెపుణ్యం, వ్యక్తిత్వ వికాసం, భావ వ్యక్తీకరణ’ అంశాలపై సదస్సు నిర్వహించారు.
మానవ సంబంధాలు పెంపొందించుకోవాలి
Jul 18 2016 2:12 AM | Updated on Oct 9 2018 7:52 PM
అనంతపురం సిటీ: మానవ సంబంధాలను మరింత పెంపొందిం చుకోవాలని వక్తలు అన్నారు. స్థానిక మెడికల్ హాల్‌లో ఆదివారం ’నెపుణ్యం, వ్యక్తిత్వ వికాసం, భావ వ్యక్తీకరణ’ అంశాలపై సదస్సు నిర్వహించారు. ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, ఐఎంఎ విద్యార్థి విభాగం అధ్యక్షుడు డాక్టర్ కొల్లి కరుణామూర్తి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.కొండయ్య హాజరయ్యారు. వైద్య విద్యార్థులు, ఫిజియో థెరపీ వైద్యులు, నర్సింగ్ విద్యార్థినులు హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లు, ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. సమాజ సేవపై దృష్టి సారించాలన్నారు. అనంతరం ఇందిరా గాంధీ అవార్డును గ్రహీత∙ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ, ఇందిరా గాంధీ స్టూడెంట్ వాలంటరీ అవార్డును పొందిన కుమ్మర కృష్ణ, విజయకుమార్‌ను సన్మానించారు.
Advertisement
Advertisement