Seminor
-
తప్పుడు రాతలు రాసే వారికే ఆ సమస్యలు వస్తాయి: కొమ్మినేని శ్రీనివాసరావు
-
ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య కోసం చక్కటి అవకాశం
-
ఫిబ్రవరి 8న ‘వేటూరి’ సాహిత్యంపై జాతీయ సదస్సు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ’వేటూరి ప్రభాకరశాస్త్రి సాహిత్యం – సమాలోచనం’ అనే అంశంపై తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8న జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని వైస్ చాన్సలర్ ఎం.ముత్యాలునాయుడు గురువారం ఆవిష్కరించారు. ప్రభాకరశాస్త్రి వాజ్ఞ్మయ పీఠం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంఞ్మీ సదస్సును నిర్వహించనున్నాయి. తెలుగు సాహిత్యానికి వేటూరి అందించిన సేవలు చిరస్మరణీయమైనవని, అన్నమయ సంకీర్తనలను స్వరపరచి, తెలుగుదనాన్ని తీసుకువచ్చారని వీసీ పేర్కొన్నారు. వేటూరి 129వ జయంతి సందర్భంగా జరుగుతున్న సదస్సుకు సంచాలకులుగా తెలుగు శాఖ సహాయ ఆచార్యులు దొంతరాజు లక్షీ్మనరసమ్మ, సమన్వయకర్తలుగా సహాయ ఆచార్యులు టి.వాసు, కేవీఎ¯ŒSడీ వరప్రసాద్, టి. సత్యనారాయణ వ్యవహరిస్తారు. ‘ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ – 2’ ఆవిష్కరణ వాణిజ్య శాస్త్రం, వ్యాపార నిర్వహణ çసబ్జెక్టులతో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ‘ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ – 2’ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. వర్సిటీ అకడమిక్ అఫైర్స్ డీ¯ŒS ఆచా ర్య ఎస్.టేకి రచించిన పుస్తకాన్ని గురువారం వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వీసీ మాట్లాడుతూ నన్నయ వర్సిటీ అనుబంధ కళాశాలలకే కాక ఇతర రాష్ట్రాలలోని వాణిజ, వ్యాపార నిర్వహణ సబ్జెక్టులతో డిగ్రీ చదివే విద్యార్థులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పుస్తక రచయిత ఎస్. టేకి, రిజిస్టార్ ఆచార్య ఎ.నరసింహరావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రకృతితో ముడిపడిన కోయభాష
అంతర్రాష్ట్ర కోయ బాలసాహిత్య సమ్మేళనంలో ఆదివాసీ కవులు చింతూరు : ఆదివాసీలు మాట్లాడే కోయభాషలో ఎంతో గొప్పదనం ఉందని, ఈ భాషలోని పదాలు ప్రకృతితో ముడిపడి ఉంటాయని పలువురు అదివాసీ కవులు అన్నారు. కోయత్తోర్ బాట, కోయ సమాజ్‌ల ఆధ్వర్యాన చింతూరు మండలం రామన్నపాలెంలో మూడు రోజుల అంతర్రాష్ట్ర కోయ బాల సాహిత్య సమ్మేళనం శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ కవులు మాట్లాడుతూ, కోయ భాషను బాహ్య ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో కోయ బాల సాహిత్యాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మధ్య గోండ్వానా ప్రాంతమంతా కోయజాతి నిండి ఉందని, మాతృభాష ప్రాధాన్యాన్ని వీరికి తెలియజేయాల్సి ఉందని అన్నారు. ఆదివాసీలు నివసించే ఆరు రాష్ట్రాల్లో కోయ బాల సాహిత్యం ప్రవేశపెడితే ప్రాథమిక దశలోనే ఆదివాసీ పిల్లలకు మాతృభాష ఔన్నత్యం తెలుస్తుందన్నారు. త్వరలో జాతీయ స్థాయిలో సైతం ఇలాంటి సమ్మేళనాలను నిర్వహిస్తామని వారు అన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ యువ రచయితలు కోయభాషలో రచించిన పద్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అఖిల భారత గోండ్వానా మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు సిడాం అర్జూ, ఆదివాసీ రచయితల సంఘం కార్యదర్శి మైపతి అరుణ్‌కుమార్, కట్టం సత్యం, పద్దం అనసూయ, యాదయ్య, మురళి, భీమమ్మ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
భావన ప్రతిభ జాతీయ స్థాయికి..
గుంటూరు ఎడ్యుకేషన్: జాతీయస్థాయి సైన్స్ సదస్సుకు ఎంపికైన పెదకాకాని మండల జెడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఎస్. భావనను గుంటూరు డీవైఈవో పి.రమేష్ అభినందించారు. గుంటూరులోని డీవైఈవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ ఒంగోలులో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ సదస్సులో ప్రథమస్థానంలో నిలిచిన భావన నవంబర్ 4న ముంబైలో జరగనున్న జాతీయస్థాయికి అర్హత సాధించిందన్నారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. భావనకు ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు, సైన్స్ ఉపాధ్యాయుడు సీహెచ్ వీరప్పయ్య కూడా అభినందనలు తెలిపారు. -
ఆది కవి పుట్టిన చోటే ఆది ఆంధ్రకవి జననం
కుసుమ ధర్మన్న సాహితీసమాలోచనæసభలో తెలకపల్లి రవి ఘనంగా సప్తగ్రంథాల ఆవిష్కరణ రాజమహేంద్రవరం కల్చరల్: ‘ఆదికవి పుట్టిన చోటునే ఆదిఆంధ్రకవి జన్మించాడు. వేదనాగీతాలు జనించాయ’ని విశ్రాంత తెలుగు ఆచార్యుడు తెలకపల్లి రవి పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం బొమ్మన రామచంద్రరావు ఛాంబరు ఆఫ్ కామర్సుహాలులో జరిగిన ‘కుసుమధర్మన్న సాహితీసమాలోచన సదస్సు’కు ఆహ్వానసంఘం అధ్యక్షుడు ఇ. విజయపాల్ అధ్యక్షత వహించారు. తెలకపల్లి రవి మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమానికి సమాంతరంగా నడిచిన మద్యపాన నిషేధంపై కుసుమ ధర్మన్న రచనలు చేశారన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలను ఇవ్వాలని 1932లోనే అంబేడ్కర్ చెప్పారన్నారు. మాజీ ఎంపీ డీవీజీ శంకర‡రావు మాట్లాడుతూ మనం అంతరిక్షానికి దగ్గిరయినా, అంటరానితనానికి దూరం కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలవారిది అత్యుత్తమ సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ కుసుమ ధర్మన్న సాహితీస్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ మను ధర్మ శాస్త్రానికి విరుగుడు కుసుమ ధర్మన్న సాహిత్యమని అన్నారు. మధ్యందిన మార్తాండునిలా ధర్మన్న సాహిత్యం సుమారు ఏడు దశాబ్దాలు అజ్ఞాతంగా ఉన్న కుసుమ ధర్మన్న సాహిత్యం నేడు మధ్యందిన మార్తాండునిలా చీకట్లను చీల్చుకొని ఉదయిస్తోందని తెలుగు విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అన్నారు. ‘కుసుమ ధర్మన్న–సామాజిక సాహిత్య నేపథ్యం’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘మాలమాదిగలేకమైతే, లోకమంతా మారిపోదా’అని ఆనాడే ధర్మన్న పేర్కొన్నాడన్నారు.‘కంచం పొత్తు, మంచం పొత్తు’ ఉంటేనే అంతర్గత సమస్యలు మాసిపోతాయని కుసుమ ధర్మన్న భావించే వారన్నారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ ఆదికవికి ముందున్న సోదికవులను మనం పట్టించు కోకపోవడం వలనే తెలుగు సాహిత్యం కేవలం వెయ్యేళ్లకే పరిమిత మయిందని కొందరు సిద్ధాంతాలు వల్లె వేస్తున్నారని అన్నారు. మహాకవి ఆరుద్ర రచించిన సమగ్రాంధ్రసాహిత్యంలో కూడా కుసుమ ధర్మన్నపై పరిశోధన కనపడదన్నారు. దానికి ఏ ఇజం అడ్డువచ్చిందో తెలియదన్నారు. సాహితీవేత్త శిఖామణి మాట్లాడుతూ కుసుమ ధర్మన్న రచించిన, ఆయనకు సంబంధించిన పుస్తకాల ఆవిష్కరణ ఆయన పాదాలకు తొడిగిన స్వర్ణకంకణమన్నారు. జీవీ రత్నాకర్, సన్నిధానం నరసింహశర్మ, కుసుమ రాజకుమారి, గూటంస్వామి, వేముల ఎల్లయ్య, శ్యాంషా తదితరులు కుసుమ ధర్మన్నకు నివాళులు అర్పించారు. ఘనంగా పుస్తకావిష్కరణలు ప్రజాశక్తిబుక్‌హౌస్æ ప్రచురించిన కుసుమధర్మన్న రచించిన ‘మాకొద్దీనల్లదొరతనము’,‘హరిజనశతకం’, ‘సామ్యవాదాన్ని సహించని హిందుయిజం’,‘మద్యపాన నిషేధం’, వివిధ రచయితల వ్యాస సంకలనం , ‘తొలి దళిత స్ఫూర్తి కుసుమ ధర్మన్న, డాక్టర్ మద్దుకూరి సత్యనారాయణ రచించిన ‘కుసుమ ధర్మన్న రచనలు–దళితదృక్పథం’, డాక్టర్ పుట్ల హేమలత రచించిన ‘కుసుమ ధర్మన్న జీవిత ప్రస్థానం’ పుస్తకాలను కుసుమ ధర్మన్న కోడలు అమ్మాజీ, మనుమరాలు కుసుమ రాజకుమారి, మనుమడు ప్రసాద్ ఇతర అతిథులు ఆవిష్కరించారు. అలరించిన గీతాలు ‘ధర్మన్నా! కుసుమ ధర్మన్నా! ధరాతలం«ధ్వనించే కవివన్నా!’ మొదలయిన గీతాలను సభప్రారంభం కావడానికి ముందు గాయకులు ఆలపించారు. కుసుమ ధర్మన్న చిత్రపటానికి ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. -
దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలి
దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలి మహబూబాబాద్ : దళి తులపై, ముస్లింలపై జ రుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ వరంగల్–ఖమ్మం జిల్లాల ఏరియా కమిటీ నాయకుడు లావుడ్యా రాజు పిలుపునిచ్చారు. పట్టణంలోని నలంద డిగ్రీ కళాశాలలో ఆది వారం ‘దళితులు, ము స్లింలపై జరుగుతున్న దాడు లు న్యాయమా.. ? అన్యాయమా..?’ అనే అంశంపైన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయన్నారు. దాడులకు వ్యతిరేకంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. సమావేశంలో నాయకులు ఆకుల రాజు, గుగ్గిళ్ల పీరయ్య, కనకయ్య, శ్రావణ్, పిల్లి సుధాకర్, దుడ్డెల రాం మూర్తి, కుర్ర మహేష్, చాగంటి ప్రభాకర్, శంతన్ రామరాజు, తప్పెట్ల వెంకన్న, రామ య్య, పరికి రత్నం, వజ్జ రాము, సాయిలు, మీనమ్మ, హరీష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలకు భారత రాజ్యాంగం తల్లిలాంటిది
కర్నూలు(హాస్పిటల్): చట్టాలన్నింటికీ భారత రాజ్యాంగం తల్లిలాంటిదని జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎంఏ సోమశేఖర్ అన్నారు. గురువారం ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెమినార్ హాలులో కళాబంధు కళాపరిషత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యా విలువలు–మానవ హక్కులు అనే అంశంపై రెండో రోజు జాతీయ సదస్సు సంస్థ అధ్యక్షుడు ఎ. సర్దార్‌బాషా అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని సూచించారు. లక్షలోపు ఆదాయం ఉన్న మహిళలకు న్యాయాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. మానవ విలువలతో కూడిన విద్యా విధానం ప్రస్తుత సమాజానికి అవసరమని చెప్పారు. ఎస్ఎస్టీ సంస్థ డైరెక్టర్ వి. ఆంజనేయులు మాట్లాడుతూ తల్లి గర్భం నుంచే శిశువు నిరంతర విద్యను అభ్యసించడం ప్రారంభమవుతుందన్నారు. విలువల అభ్యాసానికి మొదటి మెట్టు కుటుంబమని పేర్కొన్నారు. వ్యక్తులలో పూర్వపు ఆధ్యాత్మికత, సేవాతత్వం ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. ఒక వ్యక్తి నీటిలో పడితే సెల్ఫీ ఫొటో తీస్తారని, కానీ హాస్పిటల్‌కు పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య వ్యక్తిత్వ వికాసానికి, సమాజ వికాసానికి, దేశాభివద్ధికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జి. రామకష్ణ, ఎస్టీబీసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీహెచ్ మనోరమ, సైకాలజిస్టు పి.లక్ష్మన్న, నందికొట్కూరు డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. బడేసాహెబ్, ఎస్‌ఆర్‌ఈఈ సంస్థ కార్యదర్శి కొమ్ముపాలెం శ్రీనివాసులు, న్యాయవాధి వాడాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రక్తపోటు నిశ్శబ్ద మృత్యువు
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సి.వెంకట ఎస్.రామ్ తెనాలి : నిశ్శబ్ద మృత్యువుగా అభివర్ణించే అధిక రక్తపోటు తగిన జాగ్రత్తలతో జీవితాన్ని గడపొచ్చని ప్రసిద్ధ అంతర్జాతీయ అధిక రక్తపోటు రుగ్మత నిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సి.వెంకట ఎస్.రామ్ పేర్కొన్నారు. వాకర్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సదస్సుకు క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి అధ్యక్షత వహించారు. ‘అధిక రక్తపోటు– తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అంశంపై డాక్టర్ వెంకట ఎస్.రామ్ మాట్లాడారు. గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల జబ్బు, మతిమరుపు మొదలైన సమస్యలకు అధిక రక్తపోటు కారణమవుతుందని చెప్పారు. ఎలాంటి లక్షణాలు లేకుండా అధిక రక్తపోటు కొన్ని సంవత్సరాలపాటు పెరిగి, అనేక సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. దీనిని సైలెంట్ కిల్లర్ అంటారని వ్యాఖ్యానించారు. తలనొప్పి, తలతిరగడం, ముక్కు నుంచి రక్త స్రావం వంటి లక్షణాలకు, అధిక రక్తపోటుకు సంబంధం లేదనీ, గురకవ్యాధికి, అధిక రక్తపోటుకు సంబంధం ఉందన్నారు. తరచుగా పరీక్షలు చేయించుకుంటూ వైద్యుడి సలహా ప్రకారం మందులు ఆపకుండా వాడాలని సూచించారు. ఉప్పు వాడకం తగ్గించాలనీ, మనిషికి 2–3 గ్రాముల ఉప్పును మాత్రమే వాడాలని చెప్పారు. -
‘ఆధునికీకరణ’ చేయకే సాగునీటి ఎద్దడి
భీమవరం : డెల్టాలో ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడం వల్లే సాగునీటి ఎద్దడి నెలకొందని పలువురు రైతు ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం రైతు కార్యచరణ సమితి సదస్సు జరిగింది. దీనిలో పలువురు ప్రజాప్రతినిధులు, నిపుణులు మాట్లాడారు. సాగునీటి కష్టాలను పరిష్కరించేందుకు డెల్టా పరిరక్షణ కమిటీని ఏర్పాటుచేసి చర్యలు తీసుకోవాలని కోరారు. సమితి అధ్యక్షుడు కలిదిండి గోపాలకృష్ణంరాజు ఆ««దl్వర్యంలో జరిగిన సదస్సులో సమితి గౌరవాధ్యక్షుడు, మాజీ ఎంపీ యర్రా నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత డెల్టాలో మొదటిపంటకే సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయని, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 250 టీఎంసీల సామర్థ్యంగల రిజర్వాయర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోందని, అది పూర్తయితే డెల్టా ఎడారిలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా కృష్ణా, గోదావరి డ్రెయినేజీ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కళాశాల వెట్ సెంటర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.ఎ.రామకృష్ణంరాజు(పార్కురాజు) మాట్లాడుతూ.. డెల్టా పరిరక్షణకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. గోదావరిలోని నీరు సముద్రంలోకి కొంతమేర వెళ్లకుంటే సముద్రంలోని ఉప్పునీరు ఎగువకు చొచ్చుకువచ్చి భూములు ఉప్పునీటి కయ్యలుగా మారతాయని చెప్పారు. నిడదవోలు, కొవ్వూరు, తణుకు ప్రాంతాల్లో రొయ్యల చెరువులు తవ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.æ సదస్సులో నరసాపురం, నిడదవోలు ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, బూరుగుపల్లి శేషారావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పొత్తూరి రామాంజనేయరాజు, రైతునాయకులు అక్కినేని భవానీప్రసాద్, పాతపాటి మురళీరామారాజు,ఎంవీ సూర్యనారాయణరాజు,పండురాజు, ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ఎస్వీ రంగరాజు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎత్తిపోతల పథకాలు, డెల్టా కాలువల్లో నెలకొన్న ఇబ్బందులపై పార్కురాజు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
‘ఆధునికీకరణ’ చేయకే సాగునీటి ఎద్దడి
భీమవరం : డెల్టాలో ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడం వల్లే సాగునీటి ఎద్దడి నెలకొందని పలువురు రైతు ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం రైతు కార్యచరణ సమితి సదస్సు జరిగింది. దీనిలో పలువురు ప్రజాప్రతినిధులు, నిపుణులు మాట్లాడారు. సాగునీటి కష్టాలను పరిష్కరించేందుకు డెల్టా పరిరక్షణ కమిటీని ఏర్పాటుచేసి చర్యలు తీసుకోవాలని కోరారు. సమితి అధ్యక్షుడు కలిదిండి గోపాలకృష్ణంరాజు ఆ««దl్వర్యంలో జరిగిన సదస్సులో సమితి గౌరవాధ్యక్షుడు, మాజీ ఎంపీ యర్రా నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత డెల్టాలో మొదటిపంటకే సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయని, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 250 టీఎంసీల సామర్థ్యంగల రిజర్వాయర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోందని, అది పూర్తయితే డెల్టా ఎడారిలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా కృష్ణా, గోదావరి డ్రెయినేజీ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కళాశాల వెట్ సెంటర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.ఎ.రామకృష్ణంరాజు(పార్కురాజు) మాట్లాడుతూ.. డెల్టా పరిరక్షణకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. గోదావరిలోని నీరు సముద్రంలోకి కొంతమేర వెళ్లకుంటే సముద్రంలోని ఉప్పునీరు ఎగువకు చొచ్చుకువచ్చి భూములు ఉప్పునీటి కయ్యలుగా మారతాయని చెప్పారు. నిడదవోలు, కొవ్వూరు, తణుకు ప్రాంతాల్లో రొయ్యల చెరువులు తవ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.æ సదస్సులో నరసాపురం, నిడదవోలు ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, బూరుగుపల్లి శేషారావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పొత్తూరి రామాంజనేయరాజు, రైతునాయకులు అక్కినేని భవానీప్రసాద్, పాతపాటి మురళీరామారాజు,ఎంవీ సూర్యనారాయణరాజు,పండురాజు, ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ఎస్వీ రంగరాజు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎత్తిపోతల పథకాలు, డెల్టా కాలువల్లో నెలకొన్న ఇబ్బందులపై పార్కురాజు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
'పార్టీ ఫిరాయింపులు-స్పీకర్ పాత్ర'పై నేడు సదస్సు
సాక్షి,సిటీబ్యూరో: జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘పార్టీ ఫిరాయింపులు - స్పీకర్ పాత్ర’ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి తెలిపారు. బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం (జులై 31న) ఉదయం 10 గంటకు సదస్సు ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. ప్రముఖ న్యాయ కోవిదులు జస్టిస్ బి.జీవన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ బి. శేషశయన రెడ్డి, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్.జయప్రకాశ్ నారాయణ, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి , ప్రముఖ రాజనీతి ఆచార్యులు ప్రొఫెసర్ ఆర్వీఆర్ చంద్రశేఖరరావులు సదస్సులో ప్రసంగిస్తారని లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. -
సమాచార హక్కు చట్టంపై విద్యార్థి దశలోనే అవగాహన ఉండాలి
కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ బాలాజీచెరువు (కాకినాడ) : సమాచార హక్కు చట్టంపై విద్యార్థి దశలోనే అవగాహన కలిగి ఉండాలని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. జిల్లా సమాచార ఐక్యప్రచార వేదిక మహిళా విభాగం ఆధ్వర్యాన ‘సమాచార హక్కు చట్టంతో మహిళా సాధికారత’ అనే అంశంపై జేఎన్టీయూకేలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజా శ్రేయస్సు కోసం ఈ చటాన్ని రూపొందించారని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్లో పారదర్శకతతోపాటు అధికారులను ప్రశ్నించే హక్కు పౌరులకు వచ్చిందన్నారు. ఈ చట్టాన్ని ప్రజాహితం కోసం వినియోగించాలని కోరారు. మహిళలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని, తద్వారా సమాచార హక్కు చట్టంలో వారికి ఉన్న హక్కులు తెలుస్తాయని చెప్పారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయబోమని ఐక్యప్రచార వేదిక సభ్యులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో జేఎన్టీయూకే రిజిస్ట్రార్ ప్రసాద్‌రాజు, వేదిక మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాళం ఆండాళ్ తదితరులు పాల్గొన్నారు. -
మానవ సంబంధాలు పెంపొందించుకోవాలి
అనంతపురం సిటీ: మానవ సంబంధాలను మరింత పెంపొందిం చుకోవాలని వక్తలు అన్నారు. స్థానిక మెడికల్ హాల్లో ఆదివారం ’నెపుణ్యం, వ్యక్తిత్వ వికాసం, భావ వ్యక్తీకరణ’ అంశాలపై సదస్సు నిర్వహించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, ఐఎంఎ విద్యార్థి విభాగం అధ్యక్షుడు డాక్టర్ కొల్లి కరుణామూర్తి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.కొండయ్య హాజరయ్యారు. వైద్య విద్యార్థులు, ఫిజియో థెరపీ వైద్యులు, నర్సింగ్ విద్యార్థినులు హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లు, ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. సమాజ సేవపై దృష్టి సారించాలన్నారు. అనంతరం ఇందిరా గాంధీ అవార్డును గ్రహీత∙ఎస్ఎస్బీఎన్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ, ఇందిరా గాంధీ స్టూడెంట్ వాలంటరీ అవార్డును పొందిన కుమ్మర కృష్ణ, విజయకుమార్‌ను సన్మానించారు. -
గ్రూప్–2పై అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన
గుంటూరు వెస్ట్ : గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో ఆదివారం జరిగిన గ్రూప్–2 ఉచిత అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 1000 మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ ఏ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు స్పష్టమైన లక్ష్యం ఉండాలన్నారు. నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడి చదవడం మినహా మరో మార్గం లేదన్నారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఛైర్మన్ పాశం రామారావు మాట్లాడుతూ జాషువా ఆశయాలను కొనసాగించేందుకు విజ్ఞానకేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముద్రించిన గ్రూప్–2 మెటీరియల్‌ను వీసీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆ మెటీరియల్‌ను అభ్యర్థులకు ఉచితంగా అందజేశారు. ప్రణాళికాబద్ధంగా చదివితేనే.. మాజీ ఎంఎల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు రాబోతున్నాయని, ప్రణాళికాబద్ధంగా చదువుకుని విజయం సాధించాలని అభ్యర్థులకు సూచించారు. ఖాళీగా ఉన్న 5 వేల పోస్టులను భర్తీ చేయాలని, నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రిలిమినరీ పరీక్షా విధానం ఆలోచనను విరమించుకోవాలని కోరారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ప్రవేశపెట్టే విధానాలు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బందిగా ఉండబోతున్నాయన్నారు. ఆ విధానాలపై తాము చేసే ఆందోళనలకు మద్దతుగా నిలవాలని కోరారు. ఉద్యోగ సోపానం ఎడిటర్ ఎస్.వి.సురేష్, సబ్జెక్టు నిపుణులు మునిస్వామి, బి.మల్లికార్జునరావు, షేక్ ఇస్మాయిల్, కుర్రా శ్రీనివాస్, ప్రణయ్‌కుమార్ తదితరులు పరీక్షల సిలబస్ తదితరాలు వివరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బీ.లక్ష్మణరావు, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఛైర్మన్ పిన్నమనేని మురళీకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీ.భగవాన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు. -
పీసీసీ ఆధ్వర్యంలో 5న సాగర్‌లో సెమినార్
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథి గృహంలో ఈనెల 5న పండిట్ జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి సందర్భంగా తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించనున్నట్లు సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం వారు సెమినార్ ఏర్పాట్లపై మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్‌రావు, డ్యాం ఎస్ఈ విజయ భాస్కర్‌రావులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నెహ్రూ జయంతి సందర్భంగా తెలంగాణ లోని పది జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో 500 మంది ప్రజా ప్రతినిధులతో ఈ సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సెమినార్‌కు వక్తలుగా మాజీ కేంద్ర మంత్రివర్యులు ఎస్. జైపాల్‌రెడ్డి, మీడియా ప్రతినిధులు, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, నాగేశ్వర్రావు రానున్నట్లు తెలిపారు. -
పక్కా ప్రణాళికతో...
-
పక్కా ప్రణాళికతో...
బంగారు తెలంగాణ నిర్మాణానికి పకడ్బందీగా ముందుకెళదాం: కేసీఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులతో ‘నవ తెలంగాణ సమాలోచన’ గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయండి తెలంగాణ దృక్పథం, దృష్టితో {పణాళికలు ఉండాలి.. ఎక్కడా తప్పు జరగొద్దు.. బడ్జెట్ సమావేశాల నాటికి సిద్ధం కావాలి రైతు రుణ మాఫీ చేసి తీరుతాం.. వచ్చే కేబినెట్ భేటీలో నిర్ణయం ‘ప్లాన్ విలేజ్.. ప్లాన్ టౌన్.. ప్లాన్ సిటీ..’.. అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కొత్త నినాదమిది. ‘అంతా పక్కా ప్రణాళికతో, ఎక్కడా చిన్నతప్పు కూడా దొర్లకుండా పనులు జరగాలి..’.. అధికారులకు ఆయన సూచన ఇది. ‘ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకూ అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి జరగాలి.. బంగారు తెలంగాణ కల సాకారం కావాలి..’.. తెలంగాణ సత్వర అభివృద్ధికి ఆదేశమిది.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యాలు, దృక్పథం, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టాలు, మార్గదర్శకాలేవీ తెలంగాణ కోణంలో లేవని, ఇకపై తెలంగాణ రాష్ట్ర కోణంలోనే ప్రణాళికలు, అభివృద్ధి అంతా సాగాలని సూచించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో ‘నవ తెలంగాణ సమాలోచన’ పేరిట సోమవారం జరిగిన మేధోమథనంలో కలెక్టర్లు, జేసీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. శాఖల వారీగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం వరకు, ప్రభుత్వ శాఖలు తమ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రణాళికల రూపకల్పనలో వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకు ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోబోమని... క్షేత్రస్థాయి నుంచి పూర్తి సమాచారంతోనే నిర్ణయాలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. హడావుడిలో చిన్న పొరపాటు జరిగినా తెలంగాణ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. నెలరోజుల్లో ప్రభుత్వం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదన్న విమర్శలను పట్టించుకోనని, కొత్త ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి రెండు మూడు నెలలు పడుతుందని పేర్కొన్నారు. ‘పంచాయతీ’ చెడిపోయింది.. స్థానిక సంస్థలు, చట్టసభలకు యువకులు ఎక్కువగా ఎన్నికయ్యారని, వారు చెడుదారి పట్టకముందే.. వారిని రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందని, దానిని సంస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒకప్పుడు ప్రజా భాగస్వామ్యం ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థ ఇప్పుడు రాజకీయమయమైందన్నారు. కొత్త ప్రజా ప్రతినిధులందరికీ 15 రోజుల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం.. తెలంగాణలోని 593 గ్రామాల్లో గృహ నిర్మాణంపై సర్వే చేస్తే.. ఒక్క ఇల్లు కూడా కట్టకుండానే రూ. 235 కోట్ల దుర్వినియోగం జరిగింది. అంచనాలు, బిల్లులున్నాయి. ఇళ్లు మాత్రం లేవు. గృహ నిర్మాణ కుంభకోణంపై లోతుగా విచారణ జరిపిస్తాం. దోషులు ఎవరైనా వదిలిపెట్టం. వారిని జైలుకు పంపించి తీరుతాం. రేషన్‌కార్డుల్లోనూ ఇవే అక్రమాలు. కుటుంబాల సంఖ్య కంటే.. 22 లక్షల కార్డులు అధికంగా ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి. బియ్యం ఎక్కడకు పోతోంది. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. అంతా సరిచేస్తాం. బృందంగా ముందుకు సాగాలి.. వ్యక్తులుగా మనం ఉన్నతస్థానాల్లోకి వెళుతున్నా, బృందంగా మనం విజయవంతం కాలేకపోతున్నాం. ఇకపై తెలంగాణలో బృందంగా ముందుకు సాగాల్సి ఉంది. ప్రతీ అంశాన్ని మైక్రో స్థాయి నుంచి మాక్రో స్థాయి వరకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఎక్కడా ఒక్క అంశంలోనూ తప్పు జరగడానికి వీల్లేదు. రేపటి నుంచే ఈ విధానం అమలుకు క్షేత్రస్థాయిలో పని ప్రారంభం కావాలి. సెప్టెంబర్‌లో జరిగే బడ్జెట్ సమావేశాల నాటికి ఈ ప్రణాళిక సిద్ధం కావాలి. ‘ప్రణాళిక’లోనే ఎస్సీలకు బడ్జెట్.. తెలంగాణ రాష్ట్రంలో 15.4 శాతం మంది ఎస్సీలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద నిధులను 54 ప్రభుత్వ శాఖలకు ఇవ్వకుండా.. ఇకపై బడ్జెట్లో ‘ప్రణాళిక’ కింద నేరుగా ఎస్సీ విభాగానికి కేటాయిస్తాం. ఉదాహరణకు 40 వేల కోట్ల ప్రణాళిక బడ్జెట్ అయితే.. అందులో 6,160 కోట్లను నేరుగా ఎస్సీ శాఖకు కేటాయిస్తాం. వారే కార్యక్రమాలు చేపడతారు. ఎక్కడా నిధులు పక్కదారి పట్టడానికి వీలుండదు. అవసరమైతే సబ్‌ప్లాన్ చట్టంలో మార్పులు చేస్తాం. వృధా నిధుల లెక్కలు తీయండి.. ఉమ్మడి రాష్ట్రంలో లేబర్‌సెస్ కింద దాదాపు వెయ్యి కోట్లు వసూలయింది. ఆ నిధులు నిరుపయోగంగా ఉన్నాయి. ఇందులో తెలంగాణకు రూ. 600 కోట్ల వరకు రావచ్చు. ఈ విధంగా ఏయే శాఖల్లో నిధులు వినియోగించుకోకుండా ఉన్నాయో ఆ లెక్కలన్ని తీయండి. కేంద్రం నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించి వినియోగ పత్రాల(యుసీలు)ను ఎప్పటికప్పుడు వెంటనే సమర్పించండి. తద్వారా కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చుకోవచ్చు. 6 వేల మెగావాట్ల ప్రాజెక్టులు చేపడతాం.. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. దీనిని అధిగమించడానికి ఆరు వేల మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టులను జెన్కో నిర్మిస్తుంది. అందుకు అవసరమైన కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. ఈ ప్రాజెక్టులకు బొగ్గు కేటాయింపు లేనందున విదేశీ బొగ్గు కొనుగోలు చేయక తప్పదు. మూడేళ్లలో 220 కోట్ల మొక్కలు నాటాలి.. సాధారణంగా భూ విస్తీర్ణంలో 33 శాతం అటవీ ప్రాంతం ఉండాలి. ప్రస్తుతం 25 శాతమే ఉంది. దానిని పెంచాలి. మూడే ళ్లలో 220 కోట్ల మొక్కలు పెంచాల్సి ఉంది. అభయారణ్యంలో వంద కోట్ల మొక్కల వేర్లు ఇంకా సజీవంగా ఉన్నందున, వాటిని పెంచాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మరో 120 కోట్లు నాటి పెంచాలి. ఒక్క హెచ్ఎండీఏ పరిధిలోనే పదికోట్ల మొక్కలు పెంచాలి. రహదారుల పక్కన చెట్లతోపాటు పూలమొక్కలు పెంచాలి. ప్రతీ గ్రామంలో 33 వేల మొక్కలు ప్రతీ సంవత్సరం ఇంకా పెంచాలి. అడవుల పెంపకానికి కేంద్రం వద్ద తెలంగాణ ప్రభుత్వం 1,100 కోట్లు జమ చేసింది. ఆ నిధులు తిరిగి ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరాం. వచ్చే కేబినెట్ భేటీలో రుణమాఫీపై నిర్ణయం రైతులకు రుణ మాఫీని కచ్చితంగా అమలు చేస్తాం. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం ప్రకటిస్తాం. ప్రతీ రైతుకు చెందిన భూమి భూసార పరీక్షను ప్రభుత్వమే చేయాలి. మండల, జిల్లా స్థాయిలో భూసార పరీక్షల సమాచారం ఉండాలి. గ్రామం, మండలం, జిల్లా వారీగా పంట ప్రాంతాలుగా విభజించాలి. తెలంగాణ ప్రాంతంలో ఏది ఎక్కువ వినియోగం అవుతుందనే దాన్ని బట్టి ఆయా విత్తనాలను సిద్ధం చేయాలి. వ్యవసాయ శాఖలో విస్తరణాధికారులు రైతుల పొలాల్లోకి వెళ్లడం పూర్తిగా మరిచిపోయారు. వారు కేవలం విత్తనాలు, ఎరువుల పంపిణీకి మాత్రమే పరిమితమయ్యారు. పాతతరం వ్యవసాయ విధానాల స్థానంలో కొత్త ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, ఒక్కపైసా దుర్వినియోగం కావొద్దు.. పేదలకు ఇళ్లు, వృద్ధులు, వితంతువులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ. 1,500 పెన్షన్ ఇస్తాం. ఈ పథకాల్లో ఒక్క పైసా దుర్వినియోగం కావడానికి వీల్లేదు. గ్రామాలు, మండలాల వారీగా స్థానిక స్వపరిపాలన జరగాలి. స్వయం సమృద్ధి సాధించాలి. ఆర్థిక భారం లేని మంచి పథకాలు, విధానం గురించి ఆలోచించాలి. డబ్బు ఇస్తేనే పనులు చేస్తామనే భావన పోవాలి. బ్యూరోక్రటిక్ ధోరణి ఉండొద్దు. ప్రతీ గ్రామానికి ఒక డంప్ యార్డు, శ్మశాన వాటిక ఉండాలి. పట్టణాలు, కార్పొరేషన్లలో మూడు నుంచి పది వరకు ఉండాలి. ప్రతి జిల్లాలో పరిశ్రమలు.. తెలంగాణలో 35 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. పరిశ్రమల ఏర్పాటు కోసం 2.20 లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. జిల్లాలు, మండలాల వారీగా నివేదికలున్నాయి. ఒక్క వరంగల్‌లో మాత్రమే భూమి తక్కువగా ఉంది. ఇవి వ్యవసాయానికి ఉపయోగపడని భూములు. ప్రభుత్వ ఖజానా నిండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా... ఈ ప్రాంతాల్లో, ప్రతి జిల్లాలో పరిశ్రమలు పెట్టాలని కోరుదాం. వాటికి మౌలిక సదుపాయలు కల్పిద్దాం. చెరువులన్నీ ధ్వంసం చేశారు.. ‘‘తెలంగాణకు కృష్ణా, గోదావరి నదుల కింద 1,200 టీఎంసీలు కేటాయించారు. అందులో చిన్న నీటిపారుదలకు కృష్ణా బేసిన్లో 90 టీఎంసీలు, గోదావరిలో 175 టీఎంసీలు కేటాయించారు. కానీ చెరువులను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారు. ఇప్పుడు రెండు నదుల పరిధి నుంచి 65 టీఎంసీలు కూడా చెరువులు, కుంటల్లో నిండడం లేదు. యుద్ధ ప్రాతిపదికన చెరువులు, కుంటలను పునర్నిర్మించాలి. నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఇకపై విధిగా తాగునీరు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు ఎంత మొత్తం నీటి కేటాయింపులు చేసేదీ ముందుగానే నిర్ణయించాలి. దానికి అనుగుణంగా ప్రణాళిక ఉండాలి. వెయ్యికోట్లతో చిన్న నీటిపారుదల రంగాన్ని యుద్ధ ప్రతిపాదికన సరిచేస్తాం. ఇందుకోసం ఉపాధి హామీ నిధులు వినియోగిస్తాం. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాలు గోదావరి బేసిన్లో, దక్షిణ తెలంగాణలోని నాలుగు జిల్లాలు కృష్ణా బేసిన్లో ఉంటే.. ఖమ్మం, వరంగల్ జిల్లాలు మాత్రం ఇరు బేసిన్ల పరిధిలో ఉన్నాయి. జూరాల-పాకాల వరకు గురుత్వాకర్షణ ద్వారా నీటిని తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. గ్రావిటీ, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పాదకత పెంచుదాం. ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మిద్దాం. లెండి, కౌలాస్ నాలా పనులు చేపట్టాలి. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి. జిల్లాల పెంపునకు సూచనలు ఇవ్వండి తెలంగాణలో జిల్లాల సంఖ్యను పెంచడంపై తగిన సూచనలు ఇవ్వాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. మొత్తం ఒకే సారి జిల్లాల సంఖ్యను పెంచకుండా..దశల వారీగా జిల్లాల పెంపు ఉంటుందని చెప్పారు. జిల్లాల భౌగోళిక స్వరూపం ఆధారంగా ఏయే ప్రాంతాలను కలిపి జిల్లాగా మార్చడానికి అవకాశం ఉందో పరిశీలించాలని సూచించారు. అలాగే పాలన మరింత పకడ్బందీగా కొనసాగడానికి, ప్రజలకు అవసరమైన సేవలు అందించడానికి వీలుగా జాయింట్ కలెక్టర్ల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు.