ఫిబ్రవరి 8న ‘వేటూరి’ సాహిత్యంపై జాతీయ సదస్సు | veturi poetry feb 8th | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 8న ‘వేటూరి’ సాహిత్యంపై జాతీయ సదస్సు

Published Fri, Dec 30 2016 12:04 AM | Last Updated on Mon, Oct 1 2018 5:24 PM

veturi poetry feb 8th

రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : 
ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ’వేటూరి ప్రభాకరశాస్త్రి సాహిత్యం – సమాలోచనం’ అనే అంశంపై తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8న జాతీయ సదస్సు నిర్వహించనున్నారు.  ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని వైస్‌ చాన్సలర్‌ ఎం.ముత్యాలునాయుడు గురువారం ఆవిష్కరించారు. ప్రభాకరశాస్త్రి వాజ్ఞ్మయ పీఠం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంఞ్మీ సదస్సును నిర్వహించనున్నాయి. తెలుగు సాహిత్యానికి వేటూరి అందించిన సేవలు చిరస్మరణీయమైనవని, అన్నమయ సంకీర్తనలను స్వరపరచి, తెలుగుదనాన్ని తీసుకువచ్చారని వీసీ పేర్కొన్నారు. వేటూరి 129వ జయంతి సందర్భంగా జరుగుతున్న సదస్సుకు సంచాలకులుగా తెలుగు శాఖ సహాయ ఆచార్యులు దొంతరాజు లక్షీ్మనరసమ్మ, సమన్వయకర్తలుగా సహాయ ఆచార్యులు టి.వాసు, కేవీఎ¯ŒSడీ వరప్రసాద్, టి. సత్యనారాయణ వ్యవహరిస్తారు.   
‘ఫండమెంటల్స్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌ – 2’  ఆవిష్కరణ  
వాణిజ్య శాస్త్రం, వ్యాపార నిర్వహణ çసబ్జెక్టులతో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ‘ఫండమెంటల్స్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌ – 2’  పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. వర్సిటీ అకడమిక్‌ అఫైర్స్‌ డీ¯ŒS ఆచా ర్య ఎస్‌.టేకి రచించిన పుస్తకాన్ని గురువారం వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వీసీ మాట్లాడుతూ నన్నయ వర్సిటీ అనుబంధ కళాశాలలకే కాక ఇతర రాష్ట్రాలలోని వాణిజ, వ్యాపార నిర్వహణ సబ్జెక్టులతో డిగ్రీ చదివే విద్యార్థులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పుస్తక రచయిత  ఎస్‌. టేకి, రిజిస్టార్‌ ఆచార్య ఎ.నరసింహరావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement