దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలి
Published Mon, Aug 22 2016 12:49 AM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM
దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలి
మహబూబాబాద్ : దళి తులపై, ముస్లింలపై జ రుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ వరంగల్–ఖమ్మం జిల్లాల ఏరియా కమిటీ నాయకుడు లావుడ్యా రాజు పిలుపునిచ్చారు. పట్టణంలోని నలంద డిగ్రీ కళాశాలలో ఆది వారం ‘దళితులు, ము స్లింలపై జరుగుతున్న దాడు లు న్యాయమా.. ? అన్యాయమా..?’ అనే అంశంపైన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయన్నారు.
దాడులకు వ్యతిరేకంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. సమావేశంలో నాయకులు ఆకుల రాజు, గుగ్గిళ్ల పీరయ్య, కనకయ్య, శ్రావణ్, పిల్లి సుధాకర్, దుడ్డెల రాం మూర్తి, కుర్ర మహేష్, చాగంటి ప్రభాకర్, శంతన్ రామరాజు, తప్పెట్ల వెంకన్న, రామ య్య, పరికి రత్నం, వజ్జ రాము, సాయిలు, మీనమ్మ, హరీష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement