mahabobabad
-
అప్పటి వరకు ఆడుకున్నారు.. అంతలోనే!
సాక్షి, మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి గ్రామశివారులోని మున్నేరువాగులో పడి ఇద్దరు పిల్లలు గల్లంతు కాగా, ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలంలోని జమాండ్లపల్లి గ్రామానికి చెందిన భట్టుపల్లి బాబు – లలిత దంపతుల రెండో కుమారుడు యశ్వంత్ (10), బొల్లెపల్లి భద్రాచలం – నర్మద దంపతుల కుమార్తె సాయిసహస్ర(10) కలిసి గ్రామశివారులోని మున్నేరువాగు వద్దకు ఆడుకునేందుకు గురువారం మధ్యాహ్నం వెళ్లారు. అయితే, రాత్రి పొద్దుపోయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు వారి ఆచూకీ కోసం ఆరా తీశారు. మున్నేరువాగు సమీపంలో పిల్లల చెప్పులు కనిపించగా నీటిలో పడి ఉంటారనే అనుమానంతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటలకు యశ్వంత్ మృతదేహం లభ్యం కాగా, సాయిసహస్ర మృతదేహం లభించలేదు. చీకటి పడినా గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. -
దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలి
దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలి మహబూబాబాద్ : దళి తులపై, ముస్లింలపై జ రుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ వరంగల్–ఖమ్మం జిల్లాల ఏరియా కమిటీ నాయకుడు లావుడ్యా రాజు పిలుపునిచ్చారు. పట్టణంలోని నలంద డిగ్రీ కళాశాలలో ఆది వారం ‘దళితులు, ము స్లింలపై జరుగుతున్న దాడు లు న్యాయమా.. ? అన్యాయమా..?’ అనే అంశంపైన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయన్నారు. దాడులకు వ్యతిరేకంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. సమావేశంలో నాయకులు ఆకుల రాజు, గుగ్గిళ్ల పీరయ్య, కనకయ్య, శ్రావణ్, పిల్లి సుధాకర్, దుడ్డెల రాం మూర్తి, కుర్ర మహేష్, చాగంటి ప్రభాకర్, శంతన్ రామరాజు, తప్పెట్ల వెంకన్న, రామ య్య, పరికి రత్నం, వజ్జ రాము, సాయిలు, మీనమ్మ, హరీష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.