భావన ప్రతిభ జాతీయ స్థాయికి..
గుంటూరు ఎడ్యుకేషన్: జాతీయస్థాయి సైన్స్ సదస్సుకు ఎంపికైన పెదకాకాని మండల జెడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఎస్. భావనను గుంటూరు డీవైఈవో పి.రమేష్ అభినందించారు. గుంటూరులోని డీవైఈవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ ఒంగోలులో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ సదస్సులో ప్రథమస్థానంలో నిలిచిన భావన నవంబర్ 4న ముంబైలో జరగనున్న జాతీయస్థాయికి అర్హత సాధించిందన్నారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. భావనకు ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు, సైన్స్ ఉపాధ్యాయుడు సీహెచ్ వీరప్పయ్య కూడా అభినందనలు తెలిపారు.