ఫన్ - సంకల్ప్ | Fun - Sankalp | Sakshi
Sakshi News home page

ఫన్ - సంకల్ప్

Published Sun, Apr 5 2015 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

ఫన్  - సంకల్ప్

ఫన్ - సంకల్ప్

గృహిణులకు, బయటి ప్రపంచంతో అంతగా పరిచయం లేని మహిళలకు పౌర సంబంధాలు (పీఆర్)ను పెంచే ఉదే ్దశంతో పుట్టిన క్లబ్ ‘ఫన్‌కార్’. ‘ప్రస్తుత సొసైటీలో రిలేషన్స్, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అవి మనకు ఉన్న ఆలోచనలకు ఆసరాగా మారడమే కాదు కొత్త ఆలోచనలను కలిగిస్తాయి’ అంటున్నారు ఫన్‌కార్ లేడీస్ క్లబ్ నిర్వాహకురాలు సుశీలా బొకాడియా. నగరంలో పేజ్ త్రీ సోషలైట్‌గా చిరపరిచితమైన సుశీల.. మరింత మంది మహిళలతో కలసి సంకల్ప్, ఫన్‌కార్ క్లబ్స్‌ను నిర్వహిస్తున్నారు. ఆమె పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే...
 ..:: ఎస్.సత్యబాబు
 
 
వ్యాపారరీత్యా ఈ నగరానికి 20 ఏళ్ల క్రితం వచ్చాం. అప్పుడు ఎవరితోనూ నాకు పరిచయాల్లేవు. ఇంటిపట్టునే ఉండేదాన్ని. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నప్పుడు నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉండాలనిపించింది. అప్పుడే సంకల్ప్ సంస్థను ప్రారంభించాను. నెలకు ఇద్దరు చిన్నారులకు అవసరమైన స్కూల్ ఫీజు క ట్టాలనుకున్నా. బంధువులు, బాగా సన్నిహితులైన మహిళలతో జట్టుగా ఏర్పడి సంకల్ప్ ద్వారా ఈ ఆలోచనను విజయవంతంగా అమలు చేయగలిగాను. పదేళ్లుగా ఈ క్లబ్ ద్వారా 200కిపైగా విద్యార్థులకు చేయూతనందించాం. ఇటీవలే సంకల్ప్ ఆధ్వర్యంలో ఓల్డేజ్ హోమ్ కూడా ప్రారంభించాం.
 
ఫన్‌కార్ పుట్టిందిలా...

ఇంటి నుంచి బయటకు వచ్చి నలుగురితో కలసి తమను తాము నిరూపించుకోవాలనే ఆకాంక్ష చాలా మంది మహిళల్లో ఉన్నా, సరైన గెడైన్స్ లేక  ఆ దిశగా సాగలేకపోతున్నారని నాకు అనిపించింది. అందుకే విభిన్న రంగాలకు చెందిన మహిళలతో పరిచయాలను పెంపొందించే సంకల్పంతో..  ఫన్‌కార్ క్లబ్‌ని స్టార్ట్ చేశాను. ఒక రంగం లేదా ఒక గ్రూప్ నుంచి ఒక్కరినే సభ్యురాలిగా చేర్చుకుంటూ వీలైనన్ని విభిన్న రంగాలకు చెందిన మహిళలకు స్థానం కల్పిస్తున్నాం.

ప్రస్తుతానికి 40 మంది సభ్యులు ఇందులో ఉన్నారు. దీపావళి ధమాకా,  దసరా దాండియా.. వంటి వేడుకలు నిర్వహిస్తూ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ బలపడేలా చూస్తున్నాం. ప్రతి డిసెంబర్ నెలలో ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ ఏర్పాటు చేసి చారిటీకి వినియోగిస్తున్నాం. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన నాలాంటి సాధారణ మహిళ ఇప్పుడు విభిన్న రకాల యాక్టివిటీస్ నిర్వహిస్తోంది. రకరకాల అంశాలకు సంబంధించి ఎన్నో సన్మానాలు, పురస్కారాలు అందుకుంది. ఇదే స్ఫూర్తి మరెందరో మహిళలకు అందివ్వాలనేదే నా ఆలోచన. అందుకు నా వంతుగా ఈ క్లబ్ ఏర్పాటు చేశాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement